By: ABP Desam | Updated at : 28 Feb 2023 03:43 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
బాలుడిపై వీధికుక్కల దాడి
Street Dogs Attack : ఏపీ, తెలంగాణలో వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందాడు. తాజాగా నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మరో వీధి కుక్కల దాడి ఘటన తెరపైకి వచ్చింది. మల్లాపూర్ గ్రీన్ హిల్స్ కాలనీలో ఆడుకుంటున్న బాలుడిపై వీధికుక్కలు దాడికి ప్రయత్నించాయి. అయితే బాలుడు చాకచక్యంగా వీధికుక్కల దాడి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి.
జీహెచ్ఎంసీ చర్యలు
హైదరాబాద్ లో వీధి కుక్కల బెడద నుంచి విముక్తికి జీహెచ్ఎంసీ ప్రతిష్టమైన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కుక్కల దాడి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలని అధికారులు మార్గదర్శకాలు జారీచేశారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా కుక్కల బెడద నివారణకు మార్గదర్శకాలను జారీచేశారు. రాష్ట్రంలో కుక్కల బెడదను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. జీహెచ్ఎంసీ పరిధిలో జంతు పరిరక్షణకు అనేక చర్యలు చేపడుతున్నారు. నగరంలో జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి, స్వచ్ఛంద సంస్థల సహకారంతో వాటిని నిర్వహిస్తున్నారు. ఇటీవల పెంపుడు జంతువుల క్రిమిటోరియాలను కూడా ఆరు జోన్లలో ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. అంతే కాకుండా.. కుక్కల బర్త్ కంట్రోల్ చేయడానికి, దాంతోపాటు రేబిస్ వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా 30 సర్కిళ్లలో 30 వాహనాలను ఏర్పాటు చేసి స్టెరిలైజేషన్ తో పాటు వ్యాక్సినేషన్ చర్యలు చేపడుతున్నారు. గతంలో కుక్కల గణన సందర్భంగా ఐదు లక్షల 75 వేల కుక్కలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. అందులో 75 నుంచి 80 శాతం వరకు బర్త్ కంట్రోల్ చేశారు. జంతు పరిరక్షణకు జాతీయ యానిమల్ బోర్డ్, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
విజయవాడలో వీధికుక్కల దాడి
విజయవాడ నగరంలో వీధికుక్కలు స్వైరవిహారం చేశాయి. భవానీపురంలో ఒకే రోజు ముగ్గురు పిల్లలపై వీధికుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో నజీర్, చైతన్య, జెస్సికా గాయపడ్డారు. నగరంలో పిచ్చికుక్కలు పెరిగిపోవడంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మంచిర్యాలలో పిచ్చికుక్కల స్వైర విహారం
మంచిర్యాల జిల్లాలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఈ దాడిలో 15 మందికి గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ లోని జోన్ 1, జోన్ 2లో రెండు పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు పిచ్చికుక్కల దాడిలో 15 మంది గాయపడ్డారు. కాలనీవాసులు మున్సిపాలిటీ సిబ్బందికి కుక్కల స్వైర విహారం గురించి ఫిర్యాదు చేయగా.. గత రాత్రి నుంచి మున్సిపాలిటీ సిబ్బంది వాటికి పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కుక్కలు దొరినట్టే దొరికి పారిపోవడంతో మున్సిపాలిటీ సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే ఈ కుక్కల దాడిలో 15 మందికి తీవ్ర గాయాలు అవడంతో కాలనీవాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. తక్షణమే వాటిని పట్టుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కుక్కల దాడిలో గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం అందించడం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.
ఏనుగుల గుంపు బీభత్సం
చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. పలమనేరు మండలం, కొలమాసనపల్లి పంచాయతీ దిగువ మారుమురు గ్రామ సమీపంలోని పొలాల్లో మంగళవారం అర్ధరాత్రి ఏనుగుల గుంపు స్వైర విహారం చేశాయి. సుమారు 25 ఏనుగులు ఏడుమంది రైతుల పంట పొలాల్లో ప్రవేశించి 10 ఎకరాల మేర పొంట పొలాలను ధ్వంసం చేశాయి. అరటి తోపును ఏనుగుల గుంపు పూర్తిగా ధ్వంసం చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఫారెస్టు అధికారులకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించలేదని, ఏనుగుల్ని కట్టడి చేసి జరిగిన పంట నష్టానికి ప్రభుత్వం నుంచి పరిహారం కల్పించాలని బాధిత రైతులు కోరుతున్నారు.
Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మరడం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Breaking News Live Telugu Updates: TSPSC పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితుల కస్టడీ పూర్తి
MLA Redya Naik: ఆగస్టులోనే ఎన్నికలకు ఛాన్స్, సీఎం కేసీఆర్ చెప్పేశారు!: ఎమ్మెల్యే రెడ్యానాయక్ సంచలనం
Minister Errabelli : గత పాలకులకు విజన్ లేదు, కేసీఆర్ వచ్చాక ప్రగతి పరుగులు పెడుతుంది- మంత్రి ఎర్రబెల్లి
Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి
PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్ 30 వరకు ఛాన్స్
Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!
Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?
Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్