అన్వేషించండి

Hyderabad Rains : ముసారాంబాగ్ వంతెనపై రాకపోకలు బంద్, ఈసీ వాగులో చిక్కుకున్న యువకుడు సేఫ్

Hyderabad Rains : హైదరాబాద్ లో మూసీ నదీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ముసారాంబాగ్ బ్రిడ్జ్ పై రాకపోకలను నిలిపివేశారు. రాజేంద్రనగర్ లోని ఈసీ వాగులో చిక్కుకున్న యువకుడ్ని ట్రాఫిక్ పోలీసులు రక్షించారు.

Hyderabad Rains : హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఈసీ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో హిమాయత్ సాగర్ 6 గేట్లు ఎత్తడంతో ఈసీ వాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. హిమాయత్ సాగర్ ఔటర్ రింగు రోడ్డులోని సర్వీస్ రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవాహిస్తుంది. ఈ ప్రవాహాన్ని గమనించకుండా వచ్చిన ఓ బైకర్ వంతెనపై చిక్కుకున్నాడు. వంతెనపై చిక్కుకున్న యువకుడు తనను కాపాడాలని అరుపులు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దాగారు. నీటి ప్రవాహంలో చిక్కుకున్న వ్యక్తిని చాకచక్యంగా కాపాడారు. యువకుడిని అరవింద్ గౌడ్ గా పోలీసులు గుర్తించారు. అతడిని రక్షించిన అనంతరం అరవింద్ మాట్లాడుతూ తాను చనిపోతానేమో భయం వేసిందన్నారు. దేవుడి రూపంలో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు వచ్చి తనను కాపాడారన్నారు. బైక్ తో పాటు అరవింద్ ను  రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు రక్షించారు. 

ముసారాంబాగ్ బ్రిడ్జ్ పై రాకపోకలు బంద్ 

ఎగువ నుంచి వస్తున్న వరద నీరు ఉద్ధృతి కారణంగా ముసారాంబాగ్ బ్రిడ్జ్ పై రాకపోకలను నిలిపివేశారు. ఈ మార్గం దిల్ సుఖ్ నగర్ కి ప్రధాన రహదారి కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వాహనాలను దారి మళ్లించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో గోల్నాక బ్రిడ్జ్ పై వాహనాలు బారులు తీరాయి. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లోని మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ముసారాంబాద్ పురాతన బ్రిడ్జ్ కావడంతో ప్రమాదం జరిగే అవకాశముంటుందని ట్రాఫిక్ పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. ఇవాళ రాత్రికి బ్రిడ్జ్ పైకి వరదనీరు చేరే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. మూసీ నది వరద ఉద్ధృతి పెరిగితే చాదర్‌ఘాట్‌లో లెవెల్‌ బ్రిడ్జ్ పై ట్రాఫిక్‌ నిలిపివేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. 

మూసీకి భారీ వరద 

హైదరాబాద్ లో గత రాత్రి భారీ వర్షాలు కురిశాయి. దీంతో నగరంలోని చాలా కాలనీలు జలమయం అయ్యాయి. మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌ 040-21111111ను సంప్రదించాలని మేయర్‌ సూచించారు. కంట్రోల్‌ రూం 24 గంటల పాటు పనిచేస్తుందని చెప్పారు. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తున్న కారణంగా మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను మేయర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు పరిస్థితులను పరిశీలించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

టాప్ హెడ్ లైన్స్

Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Embed widget