Minister KTR : విశ్వగురు అని బిల్డప్ ఇచ్చినా, ఇంకా పేదదేశంగానే ఉన్నాం - మంత్రి కేటీఆర్
Minister KTR : విశ్వగురు అని చెప్పుకుంటున్న భారత్ లో ఇంకా ఆకలి కేకలు వినిపిస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏ దేవుడు చెప్పిండు తన్నుకు చావండని ప్రశ్నించారు.
Minister KTR : హైదరాబాద్ లో బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పోటీ పరీక్ష స్టడీ మెటిరీయల్ ను విడుదల చేసే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత్ ప్రపంచం ముందు విశ్వగురు అని బిల్డప్ ఇచ్చినా..ఇంకా పేదదేశంగానే ఉన్నామన్నారు. ఓ పూటకు తిండి లేక చనిపోతున్న మనుషులు మన మధ్యలో ఉన్నందుకు సిగ్గుపడదామన్నారు. ఉచితాలపై కామెంట్లు చేస్తున్న మేధావులు ఈ అంశాలపైనా దృష్టి సారించాలన్నారు. దేశంలో, రాష్ట్రంలో మత విద్వేషాలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరోక్షంగా విమర్శలు చేశారు. ఏ దేవుడు చెప్పిండు.. తన్నుకు చావండని అని మండిపడ్డారు. .
ఏ దేవుడు చెప్పాడు తన్నుకు చావండని!
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటుతున్నా...ఎవరు ఎలా బతకాలో...ఏం తినాలో..ఏం వినాలో...ప్రజల మీద రుద్దటం దారుణమని మంత్రి కేటీఆర్ అన్నారు. డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మాట్లాడిన కేటీఆర్ఎవరి దేవుడు గొప్ప అనే కొట్లాటలో అసలు లాజిక్ ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా పరిపాలకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్నారన్నారు. ఎందుకు కొట్లాడుతున్నాం, ఎవరి కోసం కొట్లాడుతున్నాం, ఏ కారణం చేత కొట్లాడుతున్నాం అనే విషయంపై దృష్టి పెట్టాలన్నారు. దేశంలో నీళ్లు లేవని ఒకరు ఏడుస్తుంటే, తిండి లేక చస్తుంటే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వగ్రామానికి మొన్ననే కరెంట్ వస్తే.. దానిపై మనకు సోయి లేదన్నారు. ఏ దేవుడు గొప్ప? అని ప్రశ్నించుకుంటున్నారన్నారు. తనను అడిగితే అమ్మ గొప్ప అని చెబుతానన్నారు. ఎవరి దేవుడు గొప్ప అనే ప్రశ్నకు అర్థంలేదన్నారు.
దేశానికి 5 శాతం జీడీపీ
మత విద్వేషాలతో ఎక్కడ్నో పోతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ 16 ట్రిలియన్ డాలర్లకు చేరితే, భారత్ 3.1 ట్రిలియన డాలర్ల వద్దనే ఆగిపోయిందన్నారు. ఇది సిగ్గుపడాల్సిన పరిస్థితి కాదా అని ప్రశ్నించారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఇందుకు భిన్నంగా పని చేస్తుందన్నారు. గత 8 ఏళ్లలో సాధించిన విజయాలు, నిధుల విషయంలో ఒక్క మాట చెప్పొచ్చన్నారు. 140 కోట్ల భారతదేశ జనాభాలో కేవలం 4 కోట్లు మాత్రమే ఉన్న తెలంగాణ దేశానికి 5 శాతం జీడీపీ కంట్రిబ్యూట్ చేస్తుందన్నారు. అభివృద్ధి అంటే ఇలా ఉండాలని కేటీఆర్ స్పష్టం చేశారు.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రూపొందించిన స్టడీ మెటీరియల్ ను మంత్రులు @KTRTRS, @SabithaindraTRS నేడు ఆవిష్కరించారు. pic.twitter.com/97ePqZ0CoO
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) August 27, 2022
Also Read : Hero Nithin JP Nadda Meeting : జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటీ, బీజేపీ గ్లామర్ పాలిటిక్స్ లో భాగమేనా?