![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Maoist Rk: సంస్మరణ సభకు అడ్డుపడ్డారు... పోలీసులు తీసుకెళ్లిన పుస్తకాలు తిరిగివ్వాలి.. మావోయిస్టు ఆర్కే భార్య ఆవేదన
మావోయిస్టు ఆర్కే జీవితంపై ప్రింట్ చేస్తున్న పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆర్కే భార్య శిరీష ఆవేదన చెందారు. ఈ పుస్తకాలను తిరిగి ఇవ్వాలని, పుస్తక ఆవిష్కరణకు అనుమతి ఇవ్వాలని కోరారు.
![Maoist Rk: సంస్మరణ సభకు అడ్డుపడ్డారు... పోలీసులు తీసుకెళ్లిన పుస్తకాలు తిరిగివ్వాలి.. మావోయిస్టు ఆర్కే భార్య ఆవేదన Hyderabad Maoist Rk wife sirisha demanding police handover rk books Maoist Rk: సంస్మరణ సభకు అడ్డుపడ్డారు... పోలీసులు తీసుకెళ్లిన పుస్తకాలు తిరిగివ్వాలి.. మావోయిస్టు ఆర్కే భార్య ఆవేదన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/14/d01eb8c928696a0680364f8ebf8806ce_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
చనిపోయిన వ్యక్తికి సంస్మరణ జరుపుతారని తాను భర్తకు సంస్మరణ సభ నిర్వహించాలని ప్రయత్నిస్తే అడ్డుకున్నారని మావోయిస్టు ఆర్కే భార్య శిరీష ఆరోపించారు. సోమాజిగూడా ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. 2004లో మావోయిస్టు ఆర్కే ప్రభుత్వంతో చర్చలకు వచ్చినప్పుడు మీడియాలో వచ్చిన కథనాలు, ఫొటోలు, అరెస్టు అయినప్పుడు వచ్చిన కథనాలను పుస్తకంగా తీసుకురావాలని ప్రయత్నించినట్లు శిరీష తెలిపారు. ఆర్కే జ్ఞాపకాలను పుస్తక రూపంలో ప్రింట్ చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారన్నారు. రెండ్రోజుల క్రితం ప్రింటింగ్ ప్రెస్‌పై పోలీసులు దాడి చేసి పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారని ఆమె ఆవేదన చెందారు. ప్రింటింగ్ చేస్తున్న దశలోనే పుస్తకాలను తీసుకెళ్లిపోయారన్నారు. పోలీసులు ఆ పుస్తకాలను తిరిగివ్వాలని శిరీష డిమాండ్ చేశారు. పుస్తకావిష్కరణకు కూడా అవకాశం కల్పించాలన్నారు. సామాజిక వేత్త, హక్కుల సంఘం నాయకుడు ప్రొఫెసర్ హరగోపాల్ కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఆర్కే జ్ఞాపకాలు పంచుకోవాలనే పుస్తకం: ప్రొ.హరగోపాల్
మావోయిస్టులు చేస్తున్న పోరాటంపై ప్రజలకు అవగాహన లేకపోయినా పర్వాలేదు కానీ ప్రాణాలు కోల్పోతున్న వారి గురించి తెలుసుకోవాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. రాజకీయాలు ఎంత దిగజారినా మానవ విలువలు ఉండాలన్నారు. రాజకీయం అంటే ఇచ్చి, పుచ్చుకోవడం కాదన్న ఆయన... మనిషి చనిపోయాక మిగిలేవి జ్ఞాపకాలు మాత్రమే అని, వాటిని పంచుకోవాలనే ఆర్కే భార్య పుస్తకం తీసుకురావాలనుకున్నారన్నారు. ఆర్కే..ప్రభుత్వంతో చర్చలకు వచ్చినప్పుడు తాను కలిసినట్లు గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చర్చలకు ప్రయత్నించగా కుదరలేదని, అనంతరం 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చల ద్వారా ఆర్కే సూపరిచితుడు అయ్యారన్నారు.
Also Read: ఆర్కే స్థానంలో సుధాకర్ ? ఏవోబీలో పట్టు జారకుండా మావోయిస్టుల పక్కా వ్యహం !
ఫాసిస్ట్ ధోరణి మార్చుకోవాలి
అనారోగ్యంతో చనిపోయిన మావోయిస్టు ఆర్కే జ్ఞాపకాలను తెలియజేసే అవకాశం ఇప్పుడు లేదని ప్రొ.హరగోపాల్ ఆవేదన చెందారు. తెలంగాణ ఉద్యమ దశలో మావోయిస్టు అజెండానే తమ అజెండా అని సీఎం కేసీఆర్ అన్నారన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక అన్ని మారిపోయాయని ఆరోపించారు. మానవీయ విలువలు లేకుండా పోయాయని హరగోపాల్ అన్నారు. ఇప్పటికైనా ఫాసిస్ట్ ధోరణి మార్చుకొని ఆర్కే పుస్తకం ఆవిష్కరించేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read: మావోయిస్టు ఆర్కే జీవిత విషయాలు ప్రింటింగ్... నవ్య ప్రింటింగ్ ప్రెస్ లో పోలీసులు సోదాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)