హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో నాలుగో అంతస్తులో దట్టంగా పొగ అలుముకుంది. సమాచారం తెలియడంతో సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Breaking News Live: డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి లక్ష్మీపతి అరెస్టు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
భానుడి భగ భగలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు కాస్త ఉపశనమం కలిగి వార్త ఇది. రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మంగళవారం వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. మరఠ్వాడా నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 48 గంటల పాటు హైదరాబాద్ లో వాతావరణం చల్లబడనుందని పేర్కొన్నారు. సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది వాతావరణ కేంద్రం తెలిపింది.
ఏపీలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు
శ్రీలంక సమీపంలో కొమరీన్ ప్రాంతంపై బంగాళాఖాతంలో అల్పపీడనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తమిళనాడు తీరం వరకు గాలులతో కూడిన ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ద్రోణి ప్రభావంతోనే రాగల మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి. దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలలో రేపు, ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశముందని తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రలో పొడి వాతావరణం ఉంటుందని, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాయలసీమలో రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని ప్రకటించింది.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే రూ.15 తగ్గింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. వెండి ధర మాత్రం నేడు కిలోకు రూ.100 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,800 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,140 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.71,400 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,140గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.71,400 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,800 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,140గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.71,400 గా ఉంది.
Hyderabad Drugs: డ్రగ్స్ కేసులో కీలక సూత్రదారి లక్ష్మీపతి అరెస్టు
హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యవహారంలో కీలక సూత్రదారిగా భావిస్తున్న లక్ష్మీపతి ఎట్టకేలకు అరెస్టు అయ్యాడు. హైదరాబాద్ నార్కోటిక్ వింగ్ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ వాడుతూ చనిపోయిన బీటెక్ విద్యార్థి మరణం కేసులో ఈయన కీలక నిందితుడు. ఇంకొందరు వ్యక్తులతో కలిసి ఈయన డ్రగ్స్, హ్యాష్ ఆయిల్ సరఫరా చేసినట్లుగా ఈయనపై ఆరోపణలు ఉన్నాయి.
Gandhi Hospital లో అగ్ని ప్రమాదం
AP CM Jagan At Gannavaram: సీఎం జగన్ కాన్వాయ్ మధ్యలోంచి వెళ్లిన 108 వాహనం
AP CM Jagan At Gannavaram Airport: అమరావతి.. గన్నవరం విమానాశ్రయం వద్ద సీఎం కాన్వాయ్ మధ్యలో నుండి 108 వాహనాన్ని పంపిన పోలీసులు.
ఢిల్లీ వెళ్లేందుకు తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి వస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
అదే సమయంలో గన్నవరం నుండి విజయవాడ వైపు వెళ్లేందుకు వచ్చిన 108 వాహనం.
అప్పటికే సీఎం కాన్వాయ్ కోసం వాహనాలు ఆపిన పోలీసులు.
వాహనాలను క్లియర్ చేసి 108 వాహనాన్ని పంపిన ట్రాఫిక్ పోలీసులు.
108 వాహనం ఎయిర్ పోర్ట్ ప్రధాన గేటువద్దకు వచ్చేసరికి సీఎం కాన్వాయ్ పాసింగ్.
కాన్వాయ్ చివర్లో.. 108 వాహనానికి దారి ఇచ్చిన పోలీసులు.
TRS MPs In Parliament: ధాన్యం కొనుగోలుపై చర్చ జరగలేదని టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్
TRS MPs In Parliament: ధాన్యం సేకరణపై చర్చించాలని ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు పట్టుపట్టారు. కానీ ప్రయోజనం లేకపోవడంతో లోక్‌సభ, రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఉప్పుడు బియ్యం కొనుగోళ్ల అంశంపై ఉభయ సభల్లో వాయిదా తీర్మానం ఇవ్వగా స్పీకర్ వాటిని తిరస్కరించారు. వాకౌట్ చేసిన టీఆర్ఎస్ సభ్యులు పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు. కేంద్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
LoP in Pakistan National Assembly Shehbaz Sharif: పాక్ అధ్యక్షుడి నుంచి ఏ లేఖ అందలేదు: షెహబాజ్ షరీఫ్
LoP in Pakistan National Assembly Shehbaz Sharif: తాత్కాలిక ప్రధానమంత్రి పదవికి సంబంధించి పాకిస్తాన్ అధ్యక్షుడు అల్వీ నుంచి తనకు ఎలాంటి లేఖ రాలేదని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ఒకవేళ లేఖ అందితే, ఆ తర్వాత తమ నేతలు, భాగస్వామ్య పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నేషనల్ అసెంబ్లీలో స్పష్టం చేశారు.
As I speak,I've not received any letter from President Alvi regarding interim PM. Once the letter comes,we'll have a discussion with our leaders and partners: LoP in Pakistan National Assembly Shehbaz Sharif on Pakistan President's letter to appoint a caretaker PM
— ANI (@ANI) April 5, 2022
(Source:PML-N) pic.twitter.com/Hl9GzrrpRf