అన్వేషించండి

Breaking News Live: పోలీసులను అవమానించిన ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live: పోలీసులను అవమానించిన ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్

Background

భానుడి ప్రతాపంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు తేలిక పాటి వర్షాలతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో స్వల్ప వర్షాలు కురియనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దాని ప్రభావంతో ఇతర జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు కొద్దిమేర దిగిరానున్నాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని వర్షాలు నమోదవుతాయి. ముఖ్యంగా పాడేరు పరిసర ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణం ఉంది. వర్షాలు, మరోవైపు ఎండల తీవ్రత నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో.. (Temperature in Andhra Pradesh)
ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం,  ఉభయ గోదావరి జిల్లాల్లో ఎండల నుంచి ప్రజలకు కాస్త ఊరట లభించనుంది. మరో రెండు రోజులపాటు ఈ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మండు వేసవిలో మధ్యాహ్నం వేళ కొన్నిచోట్ల వర్షాలు పడతాయి. ఇలానే మరో వారం పాటు వాతావరణం కొనసాగనుంది. అత్యధికంగా నందిగామలో 36.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా, కావలిలో 36 డిగ్రీలు, నెల్లూరులోనూ 35.5 డిగ్రీలు, విశాఖలో 35.2 డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 36.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రలు ఉన్నాయి.

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ.. 
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భానుడి ప్రతాపంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వడగాల్పుల వల్ల ఉమ్మడి చిత్తూరు, కడప​, కర్నూలు, అనంతపురం జిల్లాలో 40 నుంచి 44 డిగ్రీల దాక ఎండల తీవ్రత ఉంటుంది. మధ్యాహ్నం వేళ అవసరమైతే తప్ప దక్షిణ కోస్తాంధ్ర, సీమ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. అనంతపురంలో 41.4 డిగ్రీలు, కర్నూలులో 40.2 డిగ్రీలు, కడపలో 39.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణ వెదర్ అప్‌డేట్స్.. (Telangana Temperature Today)
తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర పేర్కొంది. నిర్మల్, జగిత్యాల, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, సూర్యపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పెద్దపల్లి, నిజామాబాద్, సిరిసిల్ల రాజన్న, జయశంకర్ భూపాళపల్లి, ములులు, జనగామ, కరీంనగర్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్‌లో 41.2 డిగ్రీలు, నల్గొండలో 41.5 డిగ్రీలు, నిజామాబాద్‌లో 40.1 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ కేంద్రం తెలిపింది. 

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నిలకడగా ఉంది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. వెండి ధర మాత్రం నేడు కిలోకు రూ.400 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,800 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,140 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.71,000 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,140గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.71,000 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,800 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,140గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.71,000 గా ఉంది.

16:24 PM (IST)  •  06 Apr 2022

Telangana: తెలంగాణలో గ్రూప్‌1, 2 ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు గుడ్‌ న్యూస్ 

తెలంగాణలో గ్రూప్‌1, 2 ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు గుడ్‌ న్యూస్ చెప్పనుంది ప్రభుత్వం. ఇంటర్వ్యూలు ఎత్తివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం. ఈ మేరకు ఫైల్ రెడీ చేసిన సాధారణ పరిపాలన శాఖ. ఆ ఫైల్‌ను సీఎవోకు పంపించారు. ముఖ్యమంత్రి ఆమోదించిన తర్వాత అమల్లోకి వస్తుందీ రూల్. అప్పుడు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. 

14:55 PM (IST)  •  06 Apr 2022

MLC T.Jeevan Reddy: సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ ధాన్యం ఎవరు కొంటారో రైతులవి వారే కొనాలి

MLC T.Jeevan Reddy  in  Media Point of Telangana Assembly, Hyderabad: 

రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణ ప్రభుత్వం తన బాధ్యత నిర్వహించకుండా రొడెక్కుతుంటే దొంగేదొంగ అన్న విధముగ ఉంది..
వరి ధాన్యం సేకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత.. 
వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర కు కొనుగోలు చేయడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత..
యూపీఏ తో పాటు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించింది.. 
కాళేశ్వరం తో రైతుకు నీళ్లు అందిస్తామని చెబుతూ ..స్వయంగా ముఖ్యమంత్రి వరి వేస్తే ఉరి అంటున్నారు..  
రైతాంగం ఆందోళనకు గురవుతుంది..

ముఖ్యమంత్రి ఆయన ఫార్మ్ హౌజ్ లో  వరి సాగు చేస్తున్నారు.. 
ముఖ్యమంత్రి ధాన్యం ఎవరు కొంటారో రైతులవి వారే కొనాలి.. 
50 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా..  
భవిష్యత్ లో బోయిల్డ్ రైస్ పై ఒత్తిడి చేయం..రా రైస్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది..  
బోయిల్డ్ రైస్ కు రా రైస్ కు మధ్య  కేవలం 1500 కోట్లు తేడా వస్తుంది..  
ఉద్యమ పార్టీగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతా అన్నావు ఏమైంది...? నువ్వు మెడలు వంచుకొని వచ్చావు..  
నితోటి ఆంధ్ర ముఖ్యమంత్రి పోయి ప్రధానిని కలిసి వచ్చాడు..  
రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత విధానాల వల్ల 15 లక్షల ఎకరాల వరి సాగు  విస్తీర్ణం తగ్గిందని స్వయంగా మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.  
ధాన్యం సేకరణ కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలి.. ఎకరాకు 10 వేల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలి..

గవర్నర్..ఆడబిడ్డ తనను గౌరవ వించకపోవడం బాధాకరం   
రాజ్యాంగ పరమైన పదవిని గౌరవించాలి  
సమ్మక్క సారక్క లను దర్శించుకోడానికి పొతే.. ప్రోటోకాల్ ఉండదా.  
రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఎట్లా తీసేశారు 
గవర్నర్.. రాజ్యాంగ వ్యవస్థ. 
ఉగాది వేడుకుల కు కూడా రాజ్ భవన్ కు వెళ్ళకపోవడం..కరెక్ట్ కాదు  
గవర్నర్ ను పట్టించుకోవడం లేదంటే.. రాజ్యాంగాన్ని అ గౌరవ పరిచినట్లు. 

 రాహుల్ గాంధీ పర్యటన ఈ నెలాఖరు లో ఉండొచ్చు.  
కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ.. వ్యక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వున్నా.. అవి బేధాభిప్రాయాలు కావు. 
. ఎవరు పిసిసి అన్నదీ ముఖ్యం కాదు. అందరూ కలిసి పని చేస్తాం 
. మా అందరూ లక్ష్యం తెలంగాణ లో అధికారంలోకి రావాలని   
. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ..భేదాభిప్రాయాలు కాదు  
ఇన్నాళ్లు కాంగ్రెస్ లో ఉన్నవి భేదాభిప్రాయాలు కావు..భిన్నాభిప్రాయాలు మాత్రమే

13:51 PM (IST)  •  06 Apr 2022

MIM Corporator Arrest: పోలీసులను అవమానించిన ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్

MIM Corporator Arrest: హైదరాబాద్: నగరంలోని భోలక్‌పూర్‌లో పోలీసులపై కార్పొరేటర్‌ సహా కొందరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించిన ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని మంత్రి కేటీఆర్‌ కోరారు. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డికి ఆయన ట్వీట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భోలక్‌పూర్‌లో దుకాణాలు మూసేయాల్సిందిగా స్థానిక పోలీసులు కోరారు. రంజాన్‌ సందర్భంగా దుకాణాలు తెరుచుకున్నామంటూ కొందరు దుకాణదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఎంఐఎం కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ పోలీసులపై దుర్భాషలాడారు. దుకాణాలను మూసివేయించేందుకు వెళ్లిన పోలీసులను అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  100 రూపాయల ఆద్మీ అంటూ తెలంగాణ పోలీసులను అవమాన పరిచిన mim బోలక్ పూర్ కార్పొరేటర్ మహ్మద్ గౌసుద్దీన్ అరెస్ట్ చేసి కోర్ట్ కు తరలించిన ముషీరాబాద్ పోలీసులు

13:24 PM (IST)  •  06 Apr 2022

Student Jumps From School Building: స్కూల్ బిల్డింగ్ పైనుంని దూకిన 6వ తరగతి విద్యార్థిని

Student Jumps From School Building: మహబూబాద్ జిల్లా: తొర్రూర్ మండలం వెలికట్ట గ్రామ శివారులోని PSR ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి బానోత్ ఇందు(12) అనే 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

హాస్టల్ లో ఉండటం ఇష్టం లేక స్కూల్ బిల్డింగ్ పైనుండి విద్యార్థిని దూకినట్లు సమాచారం. ఉగాది పండుగ సెలవుల కోసం వెళ్లిన ఇందును ఈరోజు తల్లిదండ్రులు తిరిగి స్కూల్ కి తీసుకువచ్చారు. కుమార్తె ఇలా చేయడంతో బోరున విలపిస్తున్న తల్లిదండ్రులు. విద్యార్థిని స్వస్థలం పెద్దవంగర మండలం బొమ్మకల్ గ్రామ శివారు కన్య తండా. 

13:21 PM (IST)  •  06 Apr 2022

BJP MP Bandi Sanjay: బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో బండి సంజయ్ ఉద్వేగభరిత ప్రసంగం

BJP MP Bandi Sanjay Speech: దేశంలో ఎన్నో పార్టీలున్నయ్....మరి బీజేపీయే ఎందుకంటే......?
-నమ్మిన సిద్ధాంతం కోసం చావుకు వెనుకాడని పార్టీ బీజేపీ మాత్రమే
-భారత్ ను విశ్వగురుగా నిలబెట్టడమే పార్టీ లక్ష్యం
-అధికారం కంటే సిద్ధాంతమే ముఖ్యం
-తెలంగాణలో అరాచక పాలన రాజ్యమేలుతోంది
-టీఆర్ఎస్ అవినీతి-నియంత-కుటుంబ పాలన అంతమే బీజేపీ పంతం
-కార్యకర్తల్లారా...ఇదే ఆఖరి పోరాటం
-గడప గడపకూ వెళ్లి టీఆర్ఎస్ అరాచకాలపై ప్రజల్లోకి వెళదాం రండి...
-గొల్లకొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించే రోజులు రాబోతున్నయ్
-బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ఉద్వేగభరిత ప్రసంగం

‘‘ఈ దేశంలో ఎన్నో రాజకీయ  పార్టీలు పుట్టినయ్. మరి బీజేపీ మాత్రమే ఎందుకు కావాలి?... ఎందుకంటే... నమ్మిన సిద్ధాంతం కోసం చావుకు వెనుకాడని ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. అధికారం కంటే సిద్ధాంతమే ముఖ్యమని నమ్మి ఆచరిస్తున్న పార్టీ బీజేపీ మాత్రమే. ప్రపంచానికి భారతీయ జీవన గమనమే ఉత్తమ మార్గమని చాటి చెబుతూ భారత్ ను విశ్వగురుగా నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమే. అందుకే ఈ దేశానికి బీజేపీ మాత్రమే శ్రీరామరక్ష’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణలో అధికారంలో లేకపోయినా కార్యకర్తల త్యాగాల పునాదులపై నిలదొక్కుకున్న పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. కార్యకర్తల త్యాగాల స్పూర్తితో తెలంగాణలో టీఆర్ఎస్ అరాచక పాలనను అంతమొందించి గొల్లకొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ అవినీతి-కుటుంబ-నియంత పాలనను ఎండగట్టేందుకు బీజేపీ కార్యకర్తలంతా గడపగడపకూ వెళ్లి ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బండి సంజయ్ ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయ ఆవరణలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మంత్రి శ్రీనివాస్, బంగారు శ్రుతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, కార్యదర్శి ఉమారాణి, బొమ్మ జయశ్రీ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు....

• దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పోలింగ్ బూత్ ల వారీగా ఉత్సాహంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది.
 
• బీజేపీ ఆవిర్భవించి 41 ఏళ్లయింది. అనేక మంది ఆశయాలు, లక్ష్యాల కోసం త్యాగాలు చేశారు. నమ్మిన సిద్దాంతాల కోసం దేనికైనా కొనసాగించే కార్యకర్తలున్నారు. సిద్ధాంతాలను విస్తరించేందుకు చావుకు కూడా స్వీకరించేందుకు సిద్ధమైన కార్యకర్తలు బీజేపీలోనే ఉన్నారు.

•  ఇది కార్యకర్తల పార్టీ. కార్యకర్తల శ్రమ, త్యాగాల మీద ఏర్పడిన పార్టీ. ఏ ఒక్క వ్యక్తి సొంతమో కాదు. పదవులు ముఖ్యం కాదు... సిద్దాంతాలే ముఖ్యం అని చాటిన పార్టీ. ప్రజల కోసం సిద్ధాంతాల ప్రచారమే ధ్యేయంగా అధికారం కావాలనుకుందే మరో స్వార్ధం కోసం కాదు.

• బీజేపీ లక్ష్యం చాలా పెద్దది. భారతీయ జీవనమే ప్రపంచానికి ఉత్తమమైన మార్గం అనే సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటి చెప్పి విశ్వగురుగా భారత్ ను నిలబెట్టాలన్నదే బీజేపీ లక్ష్యం. 

• ఈ దేశంలో ఎన్నో పార్టీలున్నయ్. బీజేపీయే ఎందుకు? అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది.  ఈ ప్రశ్నకు సమాధానం మనం చేస్తున్న పనే. అన్ని పార్టీల్లాగా అధికారం లక్ష్యమైతే బీజేపీ ఎందుకు? కాంగ్రెస్, టీఆర్ఎస్ చాలు కదా... భారత్ ను విశ్వగురుగా నిలబెట్టాలనే మహోన్నత లక్ష్యంతో పనిచేస్తూ ప్రపంచంలోని హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు నిరంతరం క్రుషి చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. ఇంత గొప్ప పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగడం నా పూర్వ జన్మ సుక్రుతంగా భావిస్తున్నా.

• ఈ రోజు నాకు పార్టీ స్థాపించిన నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. సరిగ్గా 41 ఏళ్ల క్రితం అంటే 1980 ఏప్రిల్ 6న ఆ మహనీయుడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి ముంబైలో చీకటి నిండిన హాలులో భారతీయ జనతా పార్టీని స్థాపిస్తూ ‘చీకట్లు చీలిపోతాయి.. సూర్యుడు ఉదయిస్తాడు.. మన కమలం వికసిస్తుంది..’ అని అన్న మాటలు నా చెవుల్లో రింగుమంటున్నాయి. 

• ఆనాడు అటల్ జీ చెప్పిన మాటలను దేశం నిజం చేసింది. పార్టీ ఆవిర్భావం తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండంటే రెండే సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చినా.... వాజ్ పేయి, అద్వానీ సహా ఆనాడు ఎందరో మహనీయులు చేసిన క్రుషి, త్యాగాల ఫలితంగా ఈనాడు 303 ఎంపీ సీట్లతో తిరుగులేని శక్తిగా పార్టీ ఎదిగింది. 

• మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పార్టీ ఏనాడూ అదరకుండా బెదరలేదు. కారణం సిద్ధాంతాలే పునాదిగా... అధికారమే లక్ష్యంగా.... ప్రజాసేవ పరమావధిగా ముందుకు సాగుతున్న మహోన్నత పార్టీ కాబట్టి. 

• అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం అద్వానీ చేపట్టిన రథయాత్రతో దేశవ్యాప్తంగా హిందువుల ఐక్యత ఎంత అవసరమో దేశానికి చెప్పిన పార్టీ నా బీజేపీ. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ లోక్ సభలో మెజారిటీ లేకపోవడంతో అటల్ జీ ప్రధాని పదవి చేపట్టిన 13 రోజులకే ప్రభుత్వం పడిపోయంది. ఆ తరువాత జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించి అటల్ జీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు  చేసినప్పటికీ అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరణలో 13 నెలలకే మళ్లీ గద్దె దిగాల్సి వచ్చింది.

• 199లో ఎన్డీఏ కూటమి పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చి అటల్ జీ ఆధ్వర్యంలో ఐదేళ్ల పాటు కొనసాగింది. ఆ తరువాత 2014లో మరో నవశకం మొదలైంది. 282 ఎంపీ స్థానాలను గెలిచి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలకు చరమ గీతం పాడారు.

• మోదీజీ నాయకత్వం, అమిత్ షా చాణక్యం... నడ్డా నేత్రుత్యంలో బీజేపీ ప్రభ దేశం నలమూలలా విస్తరించింది. మోదీ సారథ్యంలో భారతదేశ ఖ్యాతి ప్రపంచవ్యాప్తమైంది. భారత్ ను విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి నిరంతరం పనిచేస్తూ మోదీజీ చేస్తున్న క్రుషి అసామాన్యం. 

• మోదీ ఆధ్వర్యంలో ట్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్ రద్దు, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న ఘనత నరేంద్రమోదీ ప్రభుత్వానిదే. కరోనా కాలంలో ప్రపంచానికి వ్యాక్సిన్ అందించడమే కాకుండా ఆత్మనిర్బర్ భారత్ పేరుతో ప్రజలను ఆదుకున్న ఘనత మోదీజీ ఆలోచనా ఫలితమే. ఈరోజు ప్రజలు దేశంలో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారంటే అది మోదీ ప్రభుత్వ విధానమే కారణం.

• కానీ బీజేపీ తను నమ్మిన సిద్ధాంతం కోసం త్యాగాలు చేసేందుకు ఏనాడూ వెనుకాడలేదు. దేశం ఫస్ట్... పార్టీ నెక్ట్స్... వ్యక్తి లాస్ట్ అనే గొప్ప సిద్ధాంతమే బీజేపీ బలం. ఈ దేశం కోసం.. నమ్మిన సిద్ధాంతం కోసం తన ప్రాణాలను  బలిదానం చేసిన నాయకులు శ్యామా ప్రసాద ముఖర్జీ.. వారి త్యాగాల ఫలితంగా ఈరోజు దేశంలో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. దాదాపు 20 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

• కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీ ఏనాడూ అధికారంలో లేదు. అయినా సిద్ధాంతాల కోసం నిరంతరం కొట్లాడుతూ ఎన్నో ఒత్తిడిలను ఎదుర్కొంటూ నిలిచిన పార్టీ బీజేపీ.

• మరి తెలంగాణలో పరిస్థితి ఏంది? తెలంగాణలో పార్టీని బతికించడానికి, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎందరో నాయకులు, కార్యకర్తలు తమ జీవితాలను ధారపోశారు. ప్రాణాలకు ఫణంగా పెట్టారు. నక్సలైట్లకు ఎధురొడ్డి బలిదానాలు చేశారు. జిహాదీలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు వదిలారు.

• వీరందరి ఆశయం ఒక్కటే. పేదల కోసం అధికారం రావాలన్నదే వారి లక్ష్యం.  టీఆర్ఎస్ అరాచక పాలనను గద్దె దించడమే లక్ష్యంగా తెగించి కొట్లాడాలని కార్యకర్తలందరినీ కోరుతున్నా.  ఈరోజు కార్యకర్తల త్యాగాలు, బలిదానాలు ఫలితంగా ఈరోజు తెలంగాణలో బీజేపీ మాత్రమే టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం అనే భావన ప్రజల్లో నెలకొంది. ఇదంతా కార్యకర్తల శ్రమ ఫలితమే. 

• కార్యకర్తల స్పూర్తితో టీఆర్ఎస్ గద్దె దించడానికి ఇదే మన ఆఖరి పోరాటం కావాలి. కరెంట్, ఆర్టీసీ ఛార్జీల పెంపుతో జనం అల్లాడుతున్నారు. ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగులను మోసం చేస్తుండు. వీటిపై చర్చ జరగకుండా ఉండేందుకు ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని బదనాం చేస్తూ కేసీఆర్ చేస్తున్న డ్రామాలు చేస్తూ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే కుట్ర చేస్తున్నారు. 

• దీనిని ద్రుష్టిలో ఉంచుకుని టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా మనందరం గడప గడపకూ వెళదాం. వాస్తవ విషయాలను ప్రజలకు వివరిద్ధాం. టీఆర్ఎస్ కుటుంబ-అవినీతి-నియంత పాలనపై చైతన్యం కలిగిద్దాం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ జెండాను గొల్లకొండ కోటపై ఎగరేద్దాం. ఆ సన్నివేశాన్ని మనందరం చూసే రోజు దగ్గర్లోనే ఉంది.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Chhattisgarh Encounter: ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP DesamRishabh Pant Sixer Viral Video | ఊహకు అందని రీతిలో సిక్స్ కొట్టిన పంత్ | ABP DesamKL Rahul Controversial Out in Perth | ఆడక ఆడక ఆడితే నీకే ఏంటిది రాహుల్..? | ABP DesamAus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Chhattisgarh Encounter: ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
Life And Death Story: చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
Embed widget