Hyderabad District Election: వజ్రాయుధం కోసం అప్లై చేశారా! 19 లాస్ట్ డేట్ త్వరగా దరఖాస్తు చేయండి
Hyderabad District Election: సెప్టెంబర్ 19వ తేదీలోపు ఓటరు నమోదు, అభ్యంతరాలు, సవరణలకు దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికకల అధికారి తెలిపారు.
Hyderabad District Election: ఓటరు నమోదు, అభ్యంతరాలు, సవరణలకు ఈ నెల 19వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ సూచించారు. రెండో ప్రత్యేక సమ్మరీ రివిజన్ 2023 కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులను ఆహ్వానించారు. ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటరు జాబితాలో ముందుగా పేరు ఉందో లేదో ఈసీఐ వెబ్‌సైట్(https://voters.eci.gov.in/) ద్వారా లేదా యాప్(voter helpline) లో సరిచూసుకోవాలని సూచించారు. ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేకపోతే.. ఈఆర్వో, ఏఈఆర్వోలుగా వ్యవహరిస్తున్న డిప్యూటీ కమిషనర్లను సంప్రదించాలని లేదా వెబ్ సైట్, ఓటర్ హెల్ప్‌లైన్ లో తిరిగి పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు.
- ఫారం-6 అంటే 18 సంవత్సరాల వయస్సు దాటిన వారు, 2023 అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే వారు, ఇప్పటి వరకు ఓటరు జాబితాలో పేరు లేని వారు ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి.
- ఫారం-6బి అంటే ఓటరు జాబితాలో ఆధార్ ను అనుసంధానం అప్‌డేట్ చేసుకోవాలి.
- ఫారం-7 అంటే ముసాయిదా ఓటరు జాబితా పేరు తొలగింపు, అభ్యంతరాలు ఉంటే అప్లై చేసుకోవాలి.
- ఫారం-8 అంటే ముసాయిదా ఓటరు జాబితాలో పేరులో తప్పులు, ఇంటి నెంబరు తప్పుగా ఉన్నప్పుడు, ప్రామాణికంగా లేని ఇంటి నంబరు, అడ్రస్ మారినప్పుడు, ఓటరు జాబితాలో మిస్‌మ్యాచ్ ఫోటోలు, సక్రమంగా లేని ఫోటోలు, కుటుంబ సభ్యుల రిలేషన్ తప్పుగా నమోదు అయితే (తల్లి, తండ్రి, భార్య, భర్త, కూతురు) ఒకే కుటుంబ సభ్యులు అదే నియోజకవర్గంలో వేర్వేరు పోలింగ్ స్టేషన్ లో ఉంటే, కుటుంబ సభ్యుల పేర్లు వేర్వేరు నియోజకవర్గంలో నమోదు అయితే, మొబైల్ నంబర్ అప్‌డేట్, ఇంకా తదితర తప్పులు సవరించుకోవడానికి ఈ నెల 19లోపు ఫారం-8తో దరఖాస్తు చేసుకోవాలని రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు.
Read Also: సెప్టెంబరు 17 సభ ఏర్పాట్లలో అధికారులు- జిల్లా వేడుకల బాధ్యులను ప్రకంటిన బీఆర్‌ఎస్
ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోండిలా..!
తెలంగాణలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, లోక్‌సభ ఎన్నికలకు కూడా కొన్ని నెలల సమయమే ఉంది. దీంతో ఓటర్ల జాబితా తుది మెరుగులు దిద్దుకుంటోంది. కనుక త్వరపడండి... ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో వెంటనే తెలుసుకోండి. ఓటు ఉంటేనే ఒక పౌరుడిగా మీ నాయకుడిని ఎన్నుకోగలరు. ఓటు లేకపోతే.. మళ్లీ నమోదు చేయించుకోండి. అది ఎలా అంటారా...? దానికి ఎన్నో మార్గాలు కల్పించింది ఎన్నికల కమిషన్.
https://ceoandhra.nic.in వెబ్‌సైట్‌లో వెళ్తే.. పై భాగంలో పీడీఎఫ్ ఎలక్టోరల్ రోల్స్ అనే విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే.. అసెంబ్లీ నియోజకవర్గాల విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి.. మీ జిల్లా, మీ శాసనసభ నియోజకవర్గం సెలెక్ట్ చేసుకోవాలి. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల ఓటర్ల జాబితా పీడీఎఫ్ ఫైల్స్‌లో ఉంటాయి. మీరు ఉంటున్న ఏరియా... ఏ పోలింగ్ కేంద్రం పరిధిలోకి వస్తుందో చూసుకుని, ఆ కేంద్రానికి సంబంధించిన ఓటర్ల జాబితాను పరిశీలించి అందులో మీ పేరు ఉందా? లేదా చూసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లోనే సెర్చ్ యువర్ నేమ్ అనే సబ్ కేటగిరీ కూడా ఉంటుంది.
ఇక, ఓటరు గుర్తింపు కార్డు నెంబర్ ద్వారా... ఓటరు లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. http//voterportal.eci.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. ఎలక్టోరల్ కాలంపై క్లిక్ చేసి.. ఫోటో గుర్తింపు కార్డుపై ఉన్న నెంబర్ ఎంటర్ చేస్తే... జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుస్తోంది. ఈ పేరు ఉంటే.. ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది... సీరియల్ నంబర్ ఎంత.. లాంటి వివరాలన్నీ కనిపిస్తాయి. ఒకవేళ, మీ ఫొటో ఓటరు గుర్తింపు కార్డు నెంబర్ తెలియకపోతే.. అడ్వాన్స్ సెర్చ్ కాలంలోకి వెళ్లి... మీ పేరు, మీ తండ్రి పేరు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం వివరాలను ఎంటర్ చేయడం ద్వారా కూడా ఓటరు లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు.