Hyderabad Crime News: మెరిడియన్ రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్
Hyderabad Crime News: మెరిడియన్ హోటల్ సిబ్బంది దాడితో వ్యక్తి చనిపోవడంపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. రెస్టారెంట్ ను తాత్కాలికంగా మూసేయడంతో పాటు ఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.
Hyderabad Crime News: బిర్యానీ తినేందుకని హోటల్ కు వెళ్లిన ఓ వ్యక్తి... ఎక్స్ ట్రా పెరుగు తీసుకు రమ్మని సిబ్బందిని అడగడంతో వారు దాడి చేయగా.. సదరు వ్యక్తి చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనపై హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు. మెరిడియన్ రెస్టారెంట్ ను తాత్కాలికంగా మూసేశారు. అలాగే తమముందే దాడి చేస్తున్నా నిర్లక్ష్యం వహించిన పంజాగుట్ట సబ్ ఇన్స్ పెక్టర్, శివ శంకర్, హెడ్ కానిస్టేబుల్ రమేష్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే విషయాన్ని ఆయన వెల్లడించారు.
మెరిడియన్ రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత
— Telugu Scribe (@TeluguScribe) September 12, 2023
తమ ముందే దాడి చేస్తున్నా నిర్లక్ష్యం వహించిన పంజాగుట్ట సబ్ ఇన్స్పెక్టర్, శివ శంకర్, హెడ్ కానిస్టేబుల్ రమేష్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవి ఆనంద్ https://t.co/SsCSrzSqU3 pic.twitter.com/GujDSVtNrf
అసలేం జరిగిందంటే..?
చాంద్రాయణగుట్టకు చెందిన లియాకత్ అనే వ్యక్తి.. సోమవారం రోజు బిర్యానీ తినేందుకు స్థానికంగా ఉన్న హోటల్ కు వెళ్లాడు. అక్కడే బిర్యానీ ఆర్డర్ చేసి తిన్నాడు. అయితే తనకు పెరుగు చాలకపోవడంతో.. ఎక్స్ ట్రా పెరుగు కావాలని సిబ్బందిని కోరాడు. ఈక్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చినికి చినికి గాలి వానలా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే స్థానికుల సాయంతో గొడవ జరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు.. హోటల్ కు చేరుకున్నారు. లియాకత్ తో పాటు హోటల్ సిబ్బందిని కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఇంతలోనే లియాకత్ స్పృహ తప్పి పడిపోయాడు.
ఎక్స్‌ట్రా పెరుగు కోసం గొడవలో పోలీసుల ముందే దాడి చేసిన మెరిడియన్ రెస్టారెంట్ సిబ్బంది#MeridianRestaurant #Meridian https://t.co/LK7vQi5rWc pic.twitter.com/HbO8GZgVqQ
— Telugu Scribe (@TeluguScribe) September 11, 2023
దీంతో పోలీసులు వెంటనే లియాకత్ ను స్థానిక డెక్కన్ హాస్పిటల్ కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. లియాకత్ మృతి చెందాడు. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకొని లియాకత్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. అనంతరం లియాకత్ కుటుంబ సభ్యులతో పాటు అతడి స్నేహితులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన అతడి స్నేహితులు.. డెక్కన్ హాస్పిటల్ వద్ద ఆందోళన చేశారు. దాడి జరిగిన తర్వాత ఆసుపత్రికి తరలించకుండా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లడంతోనే లియకత్ మృతి చెందాడని ఆరోపించారు. పోలీసులతోపాటు హోటల్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న ఎంఐఎం ఎమ్మెల్సీకి మీర్జా రెహమత్ బేగ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వచ్చి ఘటన తాలూకు వివరాలు తెలుసుకున్నారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. అయితే లియాకత్ పై దాడికి పాల్పిడన సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు.