Revanth Reddy : శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులే రెచ్చగొట్టారు- రేవంత్ రెడ్డి
Revanth Reddy : రాష్ట్రపతి ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు బీజేపీ డ్రామాలు ఆడుతుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మూసేసిన కేసుల్ని ఓపెన్ చేసి రాహుల్, సోనియా గాంధీలను వేధిస్తున్నారన్నారు.
Revanth Reddy : ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈడీ కేసులు పెడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. బొల్లారం పీఎస్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రాంతీయ పార్టీలను బెదిరించడానికే కాంగ్రెస్ అగ్రనాయకులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. రాజ్ భవన్ ముట్టడిలో అరెస్ట్ అయిన నేతలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పైచేయి కోసమే బీజేపీ డ్రామాలు అని ఆరోపించారు. మూసేసిన కేసుల్ని ఓపెన్ చేసి రాహుల్, సోనియా గాంధీలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. గత మూడు రోజులుగా చేసిన నిరసనల్లో చిన్న ఘటనలు కూడా జరగలేదన్నారు. తాను పీసీసీ హోదాలో చాలా ప్రోగ్రామ్స్ చేశానని ఒక్క చిన్న ఘటన కూడా జరగలేదన్నారు. గాంధీ సిద్ధాంతంలోనే నిరసనలు, ఆందోళనలు చేశామన్నారు.
పోలీసులే రెచ్చగొట్టారు
రాజ్ భవన్ ముందు శాంతి యుతంలో నిరసన తెలపాలని చూశాం. మా నాయకులు శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు రెచ్చగొట్టారు. లాఠీఛార్జ్ చేశారు. రేణుకా చౌదరిలను మగ పోలీసులు హ్యాండిల్ చేయడం వల్ల ఆమె ఆగ్రహానికి గురయ్యారు. మా నేతలకు, శ్రేణులకు పోలీసుల తోపులాటలో గాయాలయ్యాయి. గిట్లనే తెలంగాణ ఉద్యమంలో పోలీసులు వ్యవహరించి ఉంటే రాష్ట్రం వచ్చేదా.
టీఆర్ఎస్ వాళ్లు బీజేపీ అభ్యర్థిని రాష్ట్రపతిగా గెలిపించుకోండి. మాకు ఇబ్బంది లేదు. కానీ మా జోలికి వస్తే సహించేది లేదు. మా నేతలపై పెట్టిన అక్రమకేసులు ఎత్తివేయండి. రేపు జిల్లా కేంద్రాలలో కేంద్ర రంగ సంస్థల ముందు నిరసన తెలపండి. మోదీ దిష్టి బొమ్మ తగలబెట్టండి.- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఒక్క కలం పోటుతో కొట్టివేస్తాం
జిల్లాలోని రైల్వే స్టేషన్లు, టెలికామ్, ఎల్ఐసీ, పోస్టల్ డిపార్ట్ మెంట్ ల ముందు నిరసన తెలపాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చట్టపరంగా అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ శ్రేణులపై పెట్టిన కేసులు ఒక్క కలం పోటుతో కొట్టివేస్తామన్నారు. వెంటనే సోనియా, రాహుల్ లకు ఇచ్చిన ఈడీ నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులపై సర్కార్ విచారణ చేపట్టాలన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లకు ప్రగతి భవన్ లో స్వాగతం ఉంటుందన్నారు. నేరగాళ్లను రేపిస్ట్ లను అవినీతి పరులను కేసీఆర్ ఒక్కమాట అనరని ఆరోపించారు.
రాజ్ భవన్ ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణుల సహనానికి ప్రభుత్వాలు పరీక్షపెడుతున్నాయి. మా కార్యకర్తలు పై విచాక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారు.
— Revanth Reddy (@revanth_anumula) June 16, 2022
బీజేపీకి వత్తాసుగా కేసీఆర్ ప్రభుత్వం మా శ్రేణుల పైకి ఖాకీలను ఉసికొల్పింది.
ఐనా, రాష్ట్రంలో,దేశంలో నియంత పాలన అంతానికి కాంగ్రెస్ కదం తొక్కుతుంది. pic.twitter.com/XWIlKVaFcH