News
News
X

CM KCR : సీఎం కేసీఆర్ కు స్వల్ప అస్వస్థత, గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు!

CM KCR : సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం ఆయన గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వచ్చారు.

FOLLOW US: 
Share:

CM KCR :   తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ప్రగతిభవన్‌ నుంచి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించారు వైద్యులు. సీఎం కేసీఆర్‌ వెంట ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కూడా ఆస్పత్రికి వెళ్లారు. ముఖ్యమంత్రి ఏఐజీ ఆసుపత్రిలో చేరికపై ఆసుపత్రి వర్గాల ప్రకటన చేశాయి. సీఎం కేసీఆర్ కు ఆదివారం ఉదయం పొత్తికడుపులో అసౌకర్యం ఏర్పడిందని, దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఏఐజీ హాస్పిటల్ కు తీసుకువచ్చారని వైద్యులు తెలిపారు. ఏఐజీ హాస్పిటల్ ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి వైద్య పరీక్షలు చేశారు. సీఎం కేసీఆర్ కు సీటీ ఎండోస్కోపీ టెస్టులు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం కడుపులో చిన్న పుండు ఉన్నట్టు గుర్తించారు వైద్యులు.  సీఎం ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థాయిలోనే ఉందని, ప్రాథమికంగా కొన్ని మందులు రిఫర్ చేశామని వైద్యులు తెలిపారు. 

అంతకుముందు ప్రగతిభవన్‌లో ఎమ్మెల్సీ కవిత సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. శనివారం దిల్లీలో జరిగిన ఈడీ విచారణ, ఈ నెల 16న మరోసారి విచారణ గురించి ఈ భేటీలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా పాల్గొన్నారు. దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ జరిగిన తీరు గురించి కవిత కేసీఆర్ కు వివరించారు. ఈడీ విచారణ జరిగిన తీరును కేసీఆర్‌కు కవిత సుదీర్ఘంగా తెలియజేశారు. ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరవ్వాల్సి ఉండడంతో పలు అంశాలు చర్చించారు. విచారణలో ఎలా వ్యవహరించాలనే దానిపై సీఎం కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు సమాచారం.  

Published at : 12 Mar 2023 02:55 PM (IST) Tags: Hyderabad MLC Kavitha CM KCR AIG Hospital Mlc Kavitha

సంబంధిత కథనాలు

Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!

Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!

Breaking News Live Telugu Updates: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై ఎటాక్ - మందడంలో తీవ్ర ఉద్రిక్తత !

Breaking News Live Telugu Updates: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై ఎటాక్ - మందడంలో తీవ్ర ఉద్రిక్తత !

Karimnagar Accident : హెల్మెట్ ధరించినా దక్కని ప్రాణం, రోడ్డు ప్రమాదంలో మహిళా టీచర్ మృతి

Karimnagar Accident : హెల్మెట్ ధరించినా దక్కని ప్రాణం, రోడ్డు ప్రమాదంలో మహిళా టీచర్ మృతి

TSPSC పేపర్ లీకేజీలో మొత్తం హవాలా మార్గమేనా?  నిందితులు ఆర్థిక లావాదేవీలు ఎలా జరిపారు?

TSPSC పేపర్ లీకేజీలో మొత్తం హవాలా మార్గమేనా?  నిందితులు ఆర్థిక లావాదేవీలు ఎలా జరిపారు?

Adilabad News: హనుమాన్ దీక్షలో వచ్చాడని బడిలోకి రానివ్వని ప్రిన్సిపాల్ - దీక్షాపరుల ఆందోళన

Adilabad News: హనుమాన్ దీక్షలో వచ్చాడని బడిలోకి రానివ్వని ప్రిన్సిపాల్ - దీక్షాపరుల ఆందోళన

టాప్ స్టోరీస్

Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్‌ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా- ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు

PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్‌ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా-  ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత