News
News
X

CM KCR : సంస్కార‌వంత‌మైన పోలీసు వ్యవ‌స్థ నిర్మాణం కావాలి -సీఎం కేసీఆర్

CM KCR : పోలీసు వ్యవస్థకు కమాండ్ కంట్రోల్ సెంటర్ మూలస్తంభం లాంటిందని సీఎం కేసీఆర్ అన్నారు. సీసీసీని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించామని తెలిపారు.

FOLLOW US: 

CM KCR : హైదరాబాద్ లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ) ను సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. పోలీస్ వ్యవస్థకు కమాండ్ కంట్రోల్ సెంటర్ మూలస్తంభం లాంటిందన్నారు. డీజీపీ మహేంద్రరెడ్డి ఈ సెంటర్ కు రూపకర్త అని కేసీఆర్ అన్నారు. సీసీసీని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించినట్లు తెలిపారు. 

పోలీసులందరికీ సెల్యూట్ 

"పోలీసు వ్యవస్థ ఎంత పటిష్ఠంగా ఉంటే పౌర సమాజం అంత భరోసాగా ఉంటుంది. పోలీసు అధికారులందరికీ నా సెల్యూట్. ప్రభుత్వపరంగా పోలీసు వ్యవస్థకు అన్ని విధాలుగా సహకరిస్తాం. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ రావాలనేది నా కోరిక. వీటితో పాటు సంస్కారవంతమైన పోలీసు వ్యవస్థ నిర్మాణం కావాలి. సైబర్ క్రైమ్స్ ప్రపంచానికి సవాల్ మారాయి. వీటిని అరికట్టేందుకు పోలీసు వ్యవస్థ కృషి చేయాలని కోరుతున్నాను. దేశంలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ అత్యుత్తమంగా పనిచేస్తుందన్నారు." -సీఎం కేసీఆర్ 

సాధ్యం కానిది ఏదీ లేదు 

" కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. చేయదుల్చుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. ఆర్టీసీని నేను మంత్రిగా ఉన్నప్పుడు నష్టాల నుంచి లాభాల్లోకి తెచ్చాము. ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయాలి. హైదరాబాద్ లో నేరాలు చాలా వరకు తగ్గాయి.  ఇంకా నేరస్థులు కొత్త పద్ధతిలో నేరాలకు పాల్పడుతున్నారు. వాటిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించాలి. భారతదేశ పోలీసు వ్యవస్థకే తెలంగాణ ఆదర్శం కావాలి. పేకాట వంటి జూదాలను నిర్ములించగలిగాం. "
-- సీఎం కేసీఆర్ 

అద్భుత ఫలితాలు సాధించాలి 

హైద‌రాబాద్ లో పోలీస్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నెల‌కొల్పడం ప్రభుత్వ సంక‌ల్ప బ‌లానికి ప్రతీక అని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన‌ప్పటి నుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవ‌స్థ రావాల‌ని చెప్పేవాడినని, అది నెరవేరిందన్నారు. ఇప్పుడు సంస్కార‌వంత‌మైన పోలీసు వ్యవ‌స్థ నిర్మాణం కావాలని కోరిక ఉందన్నారు. ఎంత చ‌దువుకున్నా సంస్కారం లేక‌పోతే క‌ష్టమని సీఎం కేసీఆర్ అన్నారు. హైద‌రాబాద్‌లో ఇంత మంచి క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ వస్తుందని ఎవ‌రూ ఊహించి ఉండ‌రన్నారు. ప్రభుత్వ సంక‌ల్పంతో దీన్ని నిర్మించామన్నారు. రాష్ట్రంలో గుడుంబా నిర్మూలన కోసం అనేక చ‌ర్యలు తీసుకున్నామన్నారు. పేకాట క్లబ్బుల‌ను మూసివేశామన్నారు. రాబోయే రోజుల్లో పోలీసులు మ‌రింత చురుకుగా ప‌నిచేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. మంచి సాధించ‌డానికి సంక‌ల్పంతో ప‌నిచేస్తే స‌త్ఫలితాలు వ‌స్తాయ‌న్నారు. తెలంగాణ పోలీసు శాఖ అద్భుత ఫ‌లితాలు సాధించాలని సీఎం కేసీఆర్ అభిలాషించారు. ప్రజ‌ల‌కు సేవ అందించే సంస్థలా పోలీసు వ్యవస్థ మారిందన్నారు. సంస్కార‌వంత‌మైన పోలీసుగా త‌యారు కావాలన్నారు. 

Published at : 04 Aug 2022 03:53 PM (IST) Tags: Hyderabad cm kcr TS News TS police Police command control center

సంబంధిత కథనాలు

Breaking News Telugu Live Updates: యూజీసీ నెట్ పరీక్ష వాయిదా

Breaking News Telugu Live Updates: యూజీసీ నెట్ పరీక్ష వాయిదా

TS Constable Exam : తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా, ఎగ్జామ్ ఎప్పుడంటే?

TS Constable Exam : తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా, ఎగ్జామ్ ఎప్పుడంటే?

Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!

Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!

CM KCR : మహాత్ముడిని కించపరిచే ఘటనలు జరగడం దురదృష్టకరం - సీఎం కేసీఆర్

CM KCR : మహాత్ముడిని కించపరిచే ఘటనలు జరగడం దురదృష్టకరం - సీఎం కేసీఆర్

Power Bill Protests : విద్యుత్ బిల్లుపై ఉద్యోగుల సమ్మె, కేంద్రమంత్రుల ఆఫీసులకు కరెంట్ కట్ చేస్తామని హెచ్చరికలు!

Power Bill Protests : విద్యుత్ బిల్లుపై ఉద్యోగుల సమ్మె, కేంద్రమంత్రుల ఆఫీసులకు కరెంట్ కట్ చేస్తామని హెచ్చరికలు!

టాప్ స్టోరీస్

CWG 2022: నిమిషాల వ్యవధిలో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం - గెలిచిందెవరంటే?

CWG 2022: నిమిషాల వ్యవధిలో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం - గెలిచిందెవరంటే?

SitaRamam: 'సీతారామం' కథ ఫస్ట్ విజయ్ దేవరకొండకి చెప్పా - హను రాఘవపూడి కామెంట్స్!

SitaRamam: 'సీతారామం' కథ ఫస్ట్ విజయ్ దేవరకొండకి చెప్పా - హను రాఘవపూడి కామెంట్స్!

Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!

Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!

Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్‌

Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్‌