News
News
X

CM KCR : అసెంబ్లీ రద్దు చేస్తా, ఎన్నికల తేదీ ఖరారు చేసే దమ్ముందా? - సీఎం కేసీఆర్

CM KCR : కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని అది నాన్ బీజేపీది కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ డబ్బులను బీజేపీ రాష్ట్రాలకు పంచిపెడుతున్నారని మండిపడ్డారు.

FOLLOW US: 

CM KCR : కేంద్రంలో నాన్ బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ కేంద్రప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్రంలో స్పీడ్ తగ్గిందని అందుకే నాన్ బీజేపీ సర్కార్ రావాలన్నారు. తెలంగాణ కేంద్రం కన్నా డబుల్ స్పీడ్ తో దూసుకుపోతుందన్నారు. నాన్ బీజేపీ రాష్ట్రాల్లో తలసరి ఆదాయం ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కన్నా ఎక్కువ అన్నారు.

కట్టప్ప లేదు కాకరకాయ లేదు

'దేశంలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. కర్ణాటక పోలీసు నియామకాల్లో అక్రమాలు జరిగితే ఆ కేసు విచారణ చేసిన జడ్జిని బదిలీ చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి వేరే మతాలను కించపరిస్తే ఇతర దేశాలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. సుప్రీంకోర్టు ఆమె వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. న్యాయవ్యవస్థపై ఎటాక్ చేస్తున్నారు.   దీనిని ఓ నలుగురు మాజీ జడ్జిలను పోగుచేసి సుప్రీంకోర్టు లక్ష్మణ రేఖ దాటిందని విమర్శలు చేయిస్తారు. కట్టప్ప వస్తారు. కాకరకాయలు వస్తారని అంటున్నారు. తెలంగాణలో మీ నాటకాలు కుదరవు'.- సీఎం కేసీఆర్ 

గోల్ మాల్ గోయల్ 

'బీజేపీ సర్కార్ వల్ల దేశానికి ఏం జరిగింది. రూపాయి మారకం విలువ పడిపోతుంది. విదేశీ మారక విలువలు తరిగిపోతాయి. నిరుద్యోగ రేటు భారీగా పెరిగిపోతుంది. కేంద్ర మంత్రి పీయాష్ గోయల్ కాదు గోల్ మాల్. రైతులను అవమానిస్తారు. తెలంగాణలో నూకలు పండుతాయి. అంటే మీరు అదే తినండి అని అవమానిస్తారు. తెలంగాణ డబ్బులు తీసుకెళ్లి బీజేపీ రాష్ట్రాలకు పంచిపెడతారు. తమిళనాడులో బీజేపీ నాయకులు ఏక్ నాథ్ షిండేలు వస్తారు అంటారు. వస్తే ఏంచేస్తారండి. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే వచ్చారు రాగానే కరెంట్ ఛార్జీలు 20 శాతం పెంచారు. ఆర్ఆర్ఎస్ వాళ్లే చెబుతున్నారు కేంద్రంలో వాణిజ్య, వ్యవసాయ శాఖకు సమన్వయం లేదని అంటున్నారు. ' -సీఎం కేసీఆర్ 

ఆర్థిక నేరగాళ్లకు బీజేపీ కొమ్ముగాస్తోంది 

'2014లో దేశంలో రూ.4 లక్షల కోట్ల ఎన్పీఏలు ఉన్నాయి. ఇప్పుడు ఇంత ఎందుకు పెరిగాయి. బీజేపీ ఆర్థిక నేరస్థులకు దోచిపెడుతోంది. ప్రధాని మోదీ నాకు వ్యక్తిగత విరోధి కాదు. ఆయన విధానాలపై నేను విమర్శిస్తారు. దేశంలో పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరలు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి. బ్యాంకుల దోచేస్తున్నారు. వాళ్లందరికీ బీజేపీ అండగా ఉంటుంది. ఇటీవల దొరికిన ఓ ఆర్థిక నేరస్థుడు బీజేపీకి రూ.20 కోట్లు చందా ఇచ్చారు. తెలంగాణకు చేతగాని బీజేపీ అవసరం లేదు. దేశ చరిత్రలో అత్యంత అసమర్థ ప్రధాని నరేంద్రమోదీ. ఒకప్పుడు కాంగ్రెస్ వల్ల బ్రెయిన్ డ్రెన్ అయితే ఇప్పుడు విదేశీ మారక నిల్వలు డ్రెయిన్ అవుతున్నాయి. ఇవి నేను చెప్తున్న మాటలు కాదు. ఆర్థిక వేత్తలు రఘురామరాజన్, అమర్త్యసేన్ చెప్తున్న మాటలు.'- సీఎం కేసీఆర్ 

నోటీసుల పథకం 

"వ్యాపార వేత్తలను, రాజకీయ నాయకులను వేధించి వెంటాడి బీజేపీలోకి జాయిన్ చేసుకుంటున్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, ఈటల రాజేందర్ ఇలా వాళ్లందరీ ఈడీ నోటీసులు వస్తాయి. బీజేపీలో జాయిన్ అవ్వగానే ఈడీ ఉండదు సీబీఐ ఉండదు. మేక్ ఇన్ ఇండియా పథకం పెద్ద బోగస్. మన జాతీయ పతకాలు చైనా నుంచి ఇంపోర్టు చేసుకోవాలా?. అగ్నిపథ్ పై నేను మాజీ ఆర్మీ అధికారులతో మాట్లాడారు. వాళ్లు దేశం గురించి ప్రేమ ఉన్న ఏ ప్రధాని  ఇలాంటి పథకాలు తీసుకురారన్నారు. ఇదొక అర్థం లేని పథకం అన్నారు. దేశంతో ఆటలు ఆడుతున్నారు. అగ్నిపథ్ వద్దంటే దేశ దోహ్రులు అంటారు. ఇండో చైనా బోర్డర్ ప్రయోగశాల కాదు. దాని వల్ల దేశ భద్రతకు పెద్ద ముప్పు. పాకిస్తాన్ కాదు మన సమస్య. చైనాతో అసలు సమస్య. ఇప్పుడు ఆర్మీపై ప్రయోగాలు చేస్తారా? " అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. 

ఇండియా రియాక్ట్స్ 

" భారత ప్రధాని మంత్రిపై శ్రీలంకలో నిరసనలు జరుగుతున్నాయి. ఇది దేశం పరువు పోవడంకాదా? ప్రధాని మోదీ ఒత్తిడి వల్ల ఓ వ్యాపారవేత్తతో ఒప్పందం చేసుకున్నామని శ్రీలంక విద్యుత్ బోర్డు చెప్పంది. ఓ పోర్టును కూడా ఆయనకే కట్టబెట్టారు. దేశ ప్రగతికి ఏ ప్రధాని అయినా అడ్డుపడతారా?. యువకుల్లారా రియాక్ట్ అవ్వండి. ఇండియా రియాక్ట్ అవుతోంది. ఎల్ఐసీతో సహా అన్ని పాలసీలో రివర్స్ చేస్తా. మోదీకి దమ్ముంటే తెలంగాణలో ఏక్ నాథ్ షిండేను తీసుకురండి చూస్తాం. యువత మైండ్ ను నాశనం చేసే పాలన మారాలి. బీజేపీ మారకపోతే ఇండియా ఓ శతాబ్దకాలం నష్టపోతుంది. విపక్షాలకు సవాల్ విసురుతున్నా అసెంబ్లీ రద్దు చేస్తా. దమ్ముంటే ఎన్నికల తేదీ ఖరారు చేయండి. "
-సీఎం కేసీఆర్

Published at : 10 Jul 2022 07:05 PM (IST) Tags: BJP Hyderabad cm kcr PM Modi TS News double engine

సంబంధిత కథనాలు

TS Constable Exam : తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా, ఎగ్జామ్ ఎప్పుడంటే?

TS Constable Exam : తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా, ఎగ్జామ్ ఎప్పుడంటే?

Breaking News Telugu Live Updates: తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ మార్పు 

Breaking News Telugu Live Updates: తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ మార్పు 

Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!

Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!

CM KCR : మహాత్ముడిని కించపరిచే ఘటనలు జరగడం దురదృష్టకరం - సీఎం కేసీఆర్

CM KCR : మహాత్ముడిని కించపరిచే ఘటనలు జరగడం దురదృష్టకరం - సీఎం కేసీఆర్

Power Bill Protests : విద్యుత్ బిల్లుపై ఉద్యోగుల సమ్మె, కేంద్రమంత్రుల ఆఫీసులకు కరెంట్ కట్ చేస్తామని హెచ్చరికలు!

Power Bill Protests : విద్యుత్ బిల్లుపై ఉద్యోగుల సమ్మె, కేంద్రమంత్రుల ఆఫీసులకు కరెంట్ కట్ చేస్తామని హెచ్చరికలు!

టాప్ స్టోరీస్

SitaRamam: 'సీతారామం' కథ ఫస్ట్ విజయ్ దేవరకొండకి చెప్పా - హను రాఘవపూడి కామెంట్స్!

SitaRamam: 'సీతారామం' కథ ఫస్ట్ విజయ్ దేవరకొండకి చెప్పా - హను రాఘవపూడి కామెంట్స్!

Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!

Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!

Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్‌

Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్‌

108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?

108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?