అన్వేషించండి

Kishan Reddy On CM KCR : కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు త్వరలోనే విముక్తి - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy On CM KCR : తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నేతలు అరెస్టులతో ఆ పార్టీ నేతలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. బండి సంజయ్, రాజాసింగ్ అరెస్టులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు.

Kishan Reddy On CM KCR : తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ లోని పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్టు చేశారు. రాజాసింగ్ అరెస్టుకు నిరసనగా పాదయాత్ర చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు బండి సంజయ్ ను అదుపులోకి తీసుకుని ఆయనను కరీంనగర్ తరలించారు. బీజేపీ నేతల అరెస్టులతో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. నేతల ఇంటి వద్దకు భారీగా చేరుకుంటున్నారు. పోలీసుల తీరును బీజేపీ కార్యకర్తలు తప్పుబడుతున్నారు. 

అరెస్టులపై స్పందించిన కిషన్ రెడ్డి 

బీజేపీ నేతల అరెస్టులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.  సీఎం కేసీఆర్ కు  అధికారం చేజారిపోతుందన్న భయం పట్టుకుందని ఆరోపించారు. ఆ భయంతోనే బండి సంజయ్, రాజాసింగ్ లను అరెస్ట్ చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబo నుంచి అధికారం చేజారిపోతుందని, కొడుకు ముఖ్యమంత్రి కాడేమోనన్న నిరాషానిస్పృహలతో విష ప్రచారానికి దిగుకున్నారని, అక్రమ కేసులు పెట్టి బీజేపీ నేతలను నిర్బంధిస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడమని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే స్పష్టమైన ఆదేశాలు  వెళుతున్నాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

త్వరలోనే విముక్తి 

వినాశకాలే విపరీత బుద్ధి అనే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి  తెలంగాణ ప్రజలకు త్వరలోనే విముక్తి లభిస్తుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చే నెంబర్ ఫ్లైఓవర్ పనులను అధికారలతో కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు.  

దిల్లీ లిక్కర్ స్కామ్ 

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు, దీక్ష చేశారు. అలాగే బండి సంజయ్‌, రాజాసింగ్ సహా కొందరు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ నేతల అరెస్ట్‌లపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ... సీఎం కార్యాలయమే స్వయంగా టీఆర్‌ఎస్‌ మంత్రులు, ప్రజా ప్రతినిధులను రెచ్చగొట్టి బండి సంజయ్‌ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.  సీఎం కేసీఆర్‌ ఆదేశాలతోనే బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.  త్వరలోనే కేసీఆర్‌ కుటుంబ, ప్రజా వ్యతిరేక పాలన నుంచి తెలంగాణ ప్రజలకు త్వరలోనే విముక్తి కలుగుతుంద్నారు. 

నిరసనలకు పిలుపునిచ్చిన బీజేపీ 

బీజేపీ నేతల అరెస్టులపై ఆ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. మంగళవారం సాయంత్రం 5-6 గంటల వరకు అన్ని మండలాల్లోని పార్టీ ఆఫీసుల వద్ద నిరసనలు తెలపాలని   నిర్ణయించింది. నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చింది. మరోవైపు ఉప్పుగల్‌, కూనూర్‌ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.  బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆందోళన చేశారు.  ఈ క్రమంలో బీజేపీ ఫ్లెక్సీలకు కొందరు కార్యకర్తలు నిప్పు పెట్టారు.  

Also Read : Bandi Sanjay : బిస్తర్ పట్టుకుని పాదయాత్రకు వచ్చేయండి - తెలంగాణ యువతకు బండి సంజయ్ పిలుపు !

Also Read : Rajasingh Suspension : బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెన్షన్ - వీడియో రిలీజ్ చేయడమే కారణం !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget