అన్వేషించండి

Bandi Sanjay : సిట్ కేసీఆర్ జేబు సంస్థ, కేటీఆర్ కు నోటీసులిచ్చే దమ్ముందా? - బండి సంజయ్

Bandi Sanjay : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీలో ఆరోపణలు చేసిన మంత్రి కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చే దమ్ముందా అని బండి సంజయ్ ప్రశ్నించారు.

Bandi Sanjay : టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీలో నా పేరును ప్రస్తావించిన సీఎం కేసీఆర్ కొడుకుకు సిట్ నోటీసులిచ్చే దమ్ముందా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. నోటీసుల పేరుతో ప్రతిపక్షాలను, దాడులు, నిషేధం పేరుతో మీడియా సంస్థల నోరు నొక్కేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. హిట్లర్, ఇందిరాగాంధీ వంటివారే కాలగర్భంలో కలిసిపోయారనే సంగతిని గుర్తుంచుకుంటే బెటర్ అన్నారు. సిట్ కేసీఆర్ జేబు సంస్థ అని, ఆధారాలిచ్చే ప్రసక్తే లేదన్నారు. సిట్ విచారణకు భయపడే ప్రసక్తే లేదన్నారు. వాస్తవాలు బయటకొస్తే కొడుకు జైలుకు పోతాడనే భయంతోనే సిట్టింగ్ జడ్జి విచారణకు సీఎం కేసీఆర్ భయపడుతున్నారని ఆరోపించారు. కొడుకు తప్పు చేయలేదనుకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమైతే మావద్ద ఉన్న ఆధారాలు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.  

ప్రతిపక్ష పార్టీల నోరు నొక్కేసే కుట్ర

"TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ నోటీసుల జారీ పేరుతో ప్రతిపక్ష పార్టీల నేతల నోరు నొక్కేసే కుట్రకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెరదీశారు. కుట్రకు కారకులైన వారిని వదిలేసి ప్రతిపక్షాలకు నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటు. సిట్ నోటీసులకు, విచారణకు భయపడే ప్రసక్తే లేదు. నోటీసుల పేరుతో ప్రతిపక్షాలను దాడులు, నిషేధం పేరుతో ప్రశ్నించే మీడియా సంస్థల గొంతును అణిచివేసే కుట్ర జరుగుతోంది. గతంలో ఇదే పంథాతో రెచ్చిపోయిన  హిట్లర్, ఇందిరాగాంధీ వంటి నియంతలనే మట్టికరిపించిన చరిత్ర ప్రజలకుంది. కేసీఆర్ సర్కార్ కు సైతం అదే గతి పడతనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది.  ఆధారాలు సమర్పించాలని కోరేందుకే సిట్ నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. అదే నిజమైతే, సిట్ కు  నిబద్ధత ఉంటే.... పేపర్ లీకేజీ కుట్ర వెనుక బండి సంజయ్ పాత్ర ఉన్నట్లు కేసీఆర్ కొడుకు నాపై ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని కేసీఆర్ కొడుకుకు నోటీసులు జారీ చేసే దమ్ము సిట్ కు ఉందా? ఆయనను పిలిచి విచారించే ధైర్యముందా?’’ - బండి సంజయ్

సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్ 

సిట్ కేసీఆర్ జేబు సంస్థగా మారిందని బండి సంజయ్ విమర్శించారు. గతంలో డ్రగ్స్, నయీం డైరీ, మియాపూర్ భూములపై సిట్ జరిపిన విచారణలే ఇందుకు నిదర్శనం అన్నారు. ఆయా కేసులను నీరుగార్చడంతోపాటు కేసీఆర్ కు ప్రయోజనం చేకూర్చేలా సిట్ పనిచేసిందన్నారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి దోషులను కఠినంగా శిక్షిస్తుందనే నమ్మకాన్ని సిట్ ఎప్పుడో కోల్పోయిందని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా సరే, చివరకు తన కొడుకు, బిడ్డ ఉన్నా ఉపేక్షించబోనని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేవంత్ రెడ్డికి, ప్రతిపక్షాలకు నోటీసులు ఇవ్వడానికంటే ముందే ఆయన కొడుకుకు నోటీసులు ఇవ్వాలన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితేనే పేపర్ లీకేజీ కుట్రదారుల బండారం బయటపడే అవకాశం ఉందన్నారు. అదే జరిగితే తన కొడుకుసహా పలువురు బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లే ప్రమాదం ఉందని గ్రహించిన కేసీఆర్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి వెనుకంజ వేస్తున్నారని ఆరోపించారు. సిట్ విచారణ పేరుతో కిందిస్థాయి సిబ్బందిని ఇరికించి కేసును నీరుగార్చాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కారకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ తప్పు చేయలేదని భావిస్తే తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Animal Park Update : 'యానిమల్' సీక్వెల్​పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన రణబీర్ కపూర్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడో తెలుసా?
'యానిమల్' సీక్వెల్​పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన రణబీర్ కపూర్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడో తెలుసా?
Pushpa 2 First Weekend Collection: నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
Embed widget