News
News
X

PM Modi : తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని కూలదోస్తాం, ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

PM Modi : తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని కూలదోస్తామని ప్రధాని మోదీ సంచలన కామెంట్స్ చేశారు.

FOLLOW US: 

PM Modi : తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బేగంపేటలో బీజేపీ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన... తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని కూలదోస్తామన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని టీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. అవినీతి పాలనపై బీజేపీ కార్యకర్తలు పోరాటం చేస్తున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకోవడం సంతోషకరంగా ఉందన్నారు.  బీజేపీ కార్యకర్తలు పోరాటం చేస్తున్నారని, వారిని చూసి తానేంతో ప్రభావితం అయ్యానన్నారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు ఒక యుద్ధం చేస్తున్నారన్నారు.  తెలంగాణ పేరుతో కొందరు అధికారం పొంది తమ జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో త్వరలోనే అంధకారం పోతుందని హామీ ఇచ్చారు. కొత్త సూర్యోదయం రాబోతుందన్నారు.  తెలంగాణ ప్రజలకు కొందరు నాయకులు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. 

తెలంగాణ ప్రజకు మాటిస్తున్నా

"ఎప్పుడు చీకటి కమ్ముకుంటుందో, నలుదిక్కులా చిమ్మచీకట్లు ముసురుకుంటాయో అప్పుడు కమలం వికసిస్తుంది. బీజేపీ కార్యకర్తల పోరాటంతో తెలంగాణలో చీకట్లు తొలగిపోతున్నాయి.  మునుగోడులో బీజేపీ కార్యకర్తలు ఎంతో వీరోచితంగా పోరాడారు. కష్టకాలంలో బీజేపీని తెలంగాణ ప్రజలు వదిలిపెట్టలేదు. 1984లో బీజేపీ కేవలం ఇద్దరు ఎంపీలే ఉన్నప్పుడు, హన్మకొండ నుంచి జంగారెడ్డిని గెలిపించారు.  రాష్ట్ర ప్రభుత్వమే మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తుంది. తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నాను.. అవినీతి ప్రభుత్వాన్ని కూలదోస్తాం. కొందరు భయంతో మోదీని బూతులు తిడుతున్నారు, ఆ బూతులను నేను పట్టించుకోను. నన్ను తిట్టినా పట్టించుకోను కానీ తెలంగాణ ప్రజలను తిడితే ఊరుకునేది లేదు."- ప్రధాని మోదీ 

పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్ 

News Reels

తెలంగాణ ప్రజలకు ఎవరైనా అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించనని ప్రధాని మోదీ అన్నారు. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలతో ఆడుకుంటే ప్రతిఫలం తప్పదన్నారు. తెలంగాణలో ప్రధానిమంత్రి ఆవాస్‌ యోజన కింద ఇళ్లు నిర్మించకుండా అడ్డుకున్నారని మోదీ అన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ పేరుతో ఇళ్లు ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు. బీజేపీ యువకుల పార్టీ అని, పేదలకు అండగా నిలబడి మంచి పాలన అందిస్తుందన్నారు. తెలంగాణను కుటుంబ పాలన, అవినీతి నుంచి విముక్తి చేయడం బీజేపీ ధ్యేయమని ప్రధాని మోదీ అన్నారు. 

ఆ తిట్లే న్యూట్రిషన్ 

"రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ జాతికి అంకితం చేయడంతో పాటు పలు జాతీయ రహదారుల ప్రారంభానికి తెలంగాణ వచ్చాను. నేను బీజేపీలో చిన్న కార్యకర్తను. హైదరాబాద్ లో బీజేపీ కార్యకర్తలను కలవాలని బండి సంజయ్ నన్ను కోరారు. అందుకే నేను వచ్చాను. తెలంగాణ ప్రజలు ఇక్కడి అవినీతి, కుటుంబ పాలనపై పోరాడుతున్నారు. బీజేపీ కార్యకర్తలు ఎవరికీ తల వంచకుండా పోరాడుతున్నారు. తెలంగాణ ప్రజలు వెనుకబడ్డారు.. కానీ ఒక్క కుటుంబం మాత్రం బాగుపడింది. ఆ ఒక్క కుటుంబం మాత్రమే బాగుపడింది. బీజేపీ కార్యకర్తలు మొత్తం తెలంగాణ ప్రభుత్వాన్ని మునుగోడులో మోకారిల్లేలా చేసింది. మీ కృషి అసాధారణం. తెలంగాణలో సూర్యోదయానికి సమయం దగ్గర్లోనే ఉంది. తెలంగాణ మొత్తం ఒక కుటుంబంలా మా వెంట రండి. బీజేపీకి కుటుంబం ముఖ్యం కాదు.. ప్రజలు ముఖ్యం. తెలంగాణ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి. కేసీఆర్ కుటుంబంపై తెలంగాణ ప్రజలు, యువత, సబ్బండ వర్గాల ప్రజలు మొత్తం వ్యతిరేకంగా ఉన్నారు. పేదలను నమ్మించి మోసం చేసే వారిని ఊరికే వదిలిపెట్టబోం. అవినీతి, కుటుంబ పాలన వల్ల జరుగుతున్న నష్టాన్ని తెలంగాణ, దేశ ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటున్నారు. ఇతరులు మోదీని విమర్శలు చేస్తారు.  కానీ మీరు పరేషాన్ కావొద్దు. వారు విమర్శలు, తిట్టేందుకు చేసేందుకే కొందరిని ప్రత్యేకంగా నియమించుకున్నారు. సాయంత్రం చాయ్ తాగి ఆ విమర్శలను, తిట్లను మరిచిపోండి.  నేను ప్రతిరోజూ కిలోల కొద్దీ తిట్లు తింటాను. ఆ తిట్లే నాకు న్యూట్రిషన్ గా పనిచేస్తాయి. "- ప్రధాని మోదీ 

Published at : 12 Nov 2022 02:19 PM (IST) Tags: BJP Hyderabad PM Modi TS News TRS CM KCR

సంబంధిత కథనాలు

TS Kanti Velugu Jobs:  'కంటి వెలుగు' ఆఫీసర్ల నియామకానికి మార్గదర్శకాలు విడుదల, వివరాలు ఇలా!

TS Kanti Velugu Jobs: 'కంటి వెలుగు' ఆఫీసర్ల నియామకానికి మార్గదర్శకాలు విడుదల, వివరాలు ఇలా!

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తుషార్‌కు ఊరట

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తుషార్‌కు ఊరట

Medaram Mini Jathara: ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం  మినీ జాతర, ఏర్పాట్లు చేస్తున్న అధికారులు!

Medaram Mini Jathara: ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం  మినీ జాతర, ఏర్పాట్లు చేస్తున్న అధికారులు!

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

V Rama Subramaniyan: తెలంగాణలో ఎన్నికలు జ్యోతిష్యం ప్రకారం వస్తాయి- సుప్రీంకోర్టు న్యాయమూర్తి కామెంట్స్

V Rama Subramaniyan: తెలంగాణలో ఎన్నికలు జ్యోతిష్యం ప్రకారం వస్తాయి- సుప్రీంకోర్టు న్యాయమూర్తి కామెంట్స్

టాప్ స్టోరీస్

వాహనాల కుంభకోణం కేసులో జేసీ బ్రదర్శ్‌కు ఈడీ షాక్- 22.10 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్

వాహనాల కుంభకోణం కేసులో జేసీ బ్రదర్శ్‌కు ఈడీ షాక్-  22.10 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్

Kavitha Satires: తాము వదిలిన బాణం, తామరపువ్వుల తానా తందానా! ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

Kavitha Satires: తాము వదిలిన బాణం, తామరపువ్వుల తానా తందానా! ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్

Bilkis Bano: సుప్రీం తీర్పుని సవాల్ చేసిన బిల్కిస్ బానో, రిట్ పిటిషన్ దాఖలు

Bilkis Bano: సుప్రీం తీర్పుని సవాల్ చేసిన బిల్కిస్ బానో, రిట్ పిటిషన్ దాఖలు