Huzurabad Counting: ఈటలకు కాంగ్రెస్ పరోక్ష మద్దతు... గట్టి క్యాడెర్ ఉన్నా కాంగ్రెస్ విఫలం ... ఎంపీ కోమటిరెడ్డి సంచలన కామెంట్స్
ఈటల రాజేందర్ కు కాంగ్రెస్ పరోక్ష మద్దతు ఇచ్చిందని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు గట్టిపట్టున్నా తమ వైపు తిప్పుకోవడంలో విఫలమయ్యిందన్నారు.
హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్.. ఈటల రాజేందర్ ను పట్టించుకోలేదన్నారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 5 నెలలు అయిన కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కాంగ్రెస్ ఒక్క సభ పెట్టలేదన్నారు. దుబ్బాక, నాగార్జున సాగర్ లో పని చేసినట్లుగా హుజూరాబాద్ లో కాంగ్రెస్ పని చేయలేదన్నారు. కాంగ్రెస్ కు హుజూరాబాద్ లో గట్టి క్యాడర్ ఉన్నా, తమవైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ విఫలమయ్యిందన్నారు. హుజూరాబాద్ పై వాస్తవ పరిస్థితిని హైకమాండ్ కు విమరిస్తానని కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
Also Read: ఈటల రాజేందర్ ఆధిక్యం వెనుక ఎవరి ‘హస్తం’ ఉంది..? కౌంటింగ్ సరళి చెబుతోంది అదేనా ?
ఈటలకు కాంగ్రెస్ పరోక్ష మద్దతు
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి... భారీ మెజార్టీతో ఈటల రాజేందర్ గెలవబోతున్నారన్నారు. టీఆర్ఎస్‌కు ఈటల భారీ షాకివ్వబోతున్నారని జోస్యం చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ 5 నెలల్లో 5 వేల కోట్లను ఖర్చు పెట్టిందన్నారు. అంత డబ్బు పంచినా హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ కు దిమ్మతిరిగే తీర్పు ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తక్కువ ఓట్లు రావడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు ఈ ఎన్నికల్లో కేసీఆర్ శత్రువైన ఈటలకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వక తప్పలేదని కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ గట్టిగా పోరాడితే ఓట్లు చీలిపోయి టీఆర్ఎస్ పార్టీకే లబ్ది కలుగుతుందన్నారు. ప్రతిపక్షాల మధ్య ఓట్ల చీలికతో టీఆర్ఎస్ గెలిచి మళ్లీ ప్రజలను మభ్యపెడతారని అందుకే ఈసారి కాంగ్రెస్ కాస్త వెనక్కు తగ్గిందన్నారు. ఈటలకు పరోక్ష మద్దతును ఇవ్వాల్సి వచ్చిందని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు.
Also Read: "దళిత బంధు"గా కేసీఆర్‌ను దళితులు గుర్తించలేదా ? నమ్మలేకపోయారా ?
హైకమాండ్ కు వాస్తవ పరిస్థితి వివరిస్తా
ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ నేతల భేటీ అయ్యారని ఎంపీ కోమటిరెడ్డి గుర్తుచేశారు. అప్పుడు కాంగ్రెస్ ఈటలను పట్టించుకోలేదన్నారు. హజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చే వరకూ కాంగ్రెస్ ఒక్క సభ కూడా పెట్టలేదన్నారు. గత ఉపఎన్నికలు దుబ్బాక, నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ కేడర్ పనిచేసినట్లు హుజూరాబాద్‌లో పని చేయలేదన్నారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు గట్టిపట్టుందన్నారు. కాంగ్రెస్ తన ఓట్ బ్యాంకును నిలబెట్టుకోలేకపోయిందన్నారు. హుజూరాబాద్‌పై అసలేం జరిగిందో వాస్తవ పరిస్థితిని హైకమాండ్ కు వివరిస్తానని కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
Also Read: హుజురాబాద్‌లో గెలుపు ఈటలదా ? బీజేపీదా ?