అన్వేషించండి

PM Maandhan Yojana Scheme 2026: రైతులు, కార్మికులకు ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్.. పీఎం మాన్ ధన్ యోజన్ పథకం అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే?

PM Maandhan Yojana Scheme 2026: చిన్న, సన్నకారు రైతులు, అసంఘటిత రంగాల్లోని కార్మికులకు కేంద్ర ప్రభుత్వం పీఎం మాన్ ధన్ యోజన్ పథకం రూ. 3000 పెన్షన్ అందిస్తుంది. ఈ పథకం వివరాలు ఇలా ఉన్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 18-40 ఏళ్ల రైతులు, కార్మికులకు నెలకు ₹3000 పింఛన్.
  • అర్హులు: చిన్న రైతులు, తక్కువ జీతం కార్మికులు.
  • ఆధార్, ఈ-శ్రమ్ కార్డులతో CSC కేంద్రంలో నమోదు.
  • వయసును బట్టి నెలవారీ ప్రీమియం, 60 ఏళ్ల తర్వాత పింఛన్.

PM Maandhan Yojana Scheme 2026: కేంద్ర ప్రభుత్వం.. 18-40 ఏళ్ల వయసు గల రైతులు, అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రధానమంత్రి మాన్‌ధన్‌ యోజన పెన్షన్ పథకాన్ని అమలు చేస్తుంది. 60 సంవత్సరాలు నిండిన అసంఘటిత రంగ కార్మికులు, చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం కింద ప్రతినెలా రూ.3 వేల చొప్పున పింఛన్ అందిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల తరహాలో రైతులు, కార్మికులు కూడా పెన్షన్ పొందవచ్చు. రైతులకు పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన, అసంఘటిత రంగ కార్మికులకు పీఎం శ్రమ యోగి మాన్ ధన్ యోజన పథకాల కింద పెన్షన్ అందిస్తుంది. 

పీఎం మాన్ ధన్ యోజన అర్హతలు

  • 18- 40 మధ్య వయస్సు గల చిన్న సన్నకారు రైతులు, కార్మికులు 
  • రెండు హెక్టార్ల కన్నా తక్కువ భూమిని కలిగి ఉన్నవారు 
  • రూ.15 వేల లోపు ఉన్న నెల జీతం అసంఘటిత రంగ కార్మికులు 
  • EPFO, NPS, ESI పథకాల్లో లేని వారు అర్హులు 

దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్లు

  1. ఆధార్ కార్డు 
  2. ఇ-శ్రమ్ కార్డు 
  3. మొబైల్ నెంబర్ 
  4. నామినీ ఆధార్ కార్డు 
  5. ఆదాయపు ధ్రువీకరణ పత్రం 
  6. కుల ధ్రువీకరణ పత్రం 
  7. భూమి వివరాలు 
  8. వయసు నిర్థారణ సర్టిఫికెట్ 
  9. బ్యాంక్ పాసు పుస్తకం 

పీఎం మాన్ ధన్ యోజన పథకం దరఖాస్తు విధానం 

పీఎం మాన్ ధన్ యోజన స్కీమ్ కోసం ఆన్​లైన్​, ఆఫ్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా మీ-సేవా కేంద్రాలను సంప్రదించవచ్చు. లేదా లబ్ధిదారులు https://maandhan.in లోని మాన్‌ధన్ పోర్టల్‌ను ఉపయోగించి నేరుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఆఫ్​లైన్​లో దరఖాస్తుకు కూడా మీ సమీపంలోని సీఎస్సీ కేంద్రాన్ని సంప్రదించవచ్చు. అక్కడ దరఖాస్తు ఫారమ్​ నింపి ఇస్తే CSC ఆపరేటర్ రిజిస్ట్రేషన్​ ప్రక్రియను పూర్తి చేస్తారు. సీఎస్సీ కేంద్రంలో దరఖాస్తుదారుడి వివరాలు  పీఎంకేఎం పోర్టర్‌లో నమోదు చేస్తారు.   

  •  ఆధార్, బ్యాంక్ అకౌంట్ ఖాతా పత్రాలతో CSC కేంద్రాన్ని సందర్శించండి.
  • ఆధార్ నెంబర్ ఉపయోగించి బయోమెట్రిక్ ధృవీకరణ చేస్తారు.
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్‌ను పూరించండి.
  • ఈ పథకంలో చేరేందుకు మొదటి చందాను నగదు రూపంలో చెల్లించాలి.
  • అనంతరం మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆటో డెబిట్ సౌకర్యాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.  
  • నమోదు ప్రక్రియ పూర్తైన తర్వాత PM SYM కార్డు జారీ చేస్తారు. 

ప్రీమియం ఎంత? 

పీఎం మాన్ ధన్ యోజన స్కీమ్ లో చేరాలనుకునే వారు ప్రతి నెలా కొంత ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. 60 ఏళ్లు పూర్తయ్యే వరకు ప్రీమియం కట్టాలి. 18 ఏళ్లు ఉన్న వారు తన వాటాగా నెలకు రూ.55 చెల్లిస్తే, కేంద్ర ప్రభుత్వం కూడా రూ.55 చెల్లిస్తుంది. వయస్సును బట్టి ప్రతీ సంవత్సరం 3 నుంచి 10 రూపాయల వరకు ప్రీమియం పెరుగుతుంది. 40 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.200 ప్రీమియం చెల్లించాలి. ఇలా ప్రీమియం చెల్లించిన సభ్యులకు 60 ఏళ్లు పూర్తైన తర్వాత ప్రతి నెలా రూ.3 వేలు పెన్షన్ పొందుతారు. ఈ స్కీమ్​ కోసం నమోదు చేసుకున్న వారు 60 ఏళ్ల నిండకుండానే మరణిస్తే.. నామినీకి పెన్షన్ మొత్తంలో సగం రూ.1500 ప్రతి నెలా చెల్లిస్తారు.    

లబ్దిదారుడు ముందే మరణిస్తే?

లబ్దిదారుడు ఈ పథకంలో చేరిన 10 సంవత్సరాల లోపు మరణిస్తే పెన్షన్ కోసం చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తారు. ఒకవేళ లబ్ధిదారుడు 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ప్రీమియం చెల్లిస్తే, 60 ఏళ్లు నిండక ముందే మరణిస్తే.. ప్రీమియం మొత్తం, దానిపై వచ్చిన వడ్డీ, ఫండ్ ద్వారా వచ్చిన వడ్డీ లేదా సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటు ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.  చందాదారుడు 60 ఏళ్ల తర్వాత మరణిస్తే, వారి జీవిత భాగస్వామి పింఛన్ లో 50 శాతాన్ని కుటుంబ పింఛన్ గా పొందుతారు. 

Frequently Asked Questions

ప్రధానమంత్రి మాన్ ధన్ యోజన పథకం ఎవరి కోసం?

18-40 ఏళ్ల వయసు గల రైతులు, అసంఘటిత రంగ కార్మికుల కోసం ఈ పథకం అమలు చేయబడుతుంది.

ఈ పథకం కింద ఎంత పెన్షన్ వస్తుంది?

60 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి నెలా రూ.3 వేల చొప్పున పింఛన్ అందిస్తుంది.

పథకంలో చేరడానికి అర్హతలు ఏమిటి?

18-40 ఏళ్ల లోపు, రెండు హెక్టార్ల కన్నా తక్కువ భూమి ఉన్న రైతులు, రూ.15 వేలలోపు జీతం పొందే కార్మికులు అర్హులు.

దరఖాస్తు చేసుకోవడానికి ఏయే పత్రాలు అవసరం?

ఆధార్ కార్డు, ఇ-శ్రమ్ కార్డు, మొబైల్ నెంబర్, బ్యాంక్ పాసు పుస్తకం వంటివి అవసరం.

పథకంలో ప్రీమియం ఎంత చెల్లించాలి?

18 ఏళ్ల వారు నెలకు రూ.55 చెల్లిస్తే, కేంద్ర ప్రభుత్వం కూడా అంతే చెల్లిస్తుంది. వయసును బట్టి ప్రీమియం పెరుగుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Hyderabad Traffic Chaos: ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Embed widget