అన్వేషించండి

PM Internship Scheme 2026: పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్‌తో నెలకు రూ.5 వేల స్టైఫండ్! ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేయాలి?

PM Internship Scheme 2026: పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్యాలతో పాటు ఇంటర్న్ షిష్ కల్పిస్తుంది కేంద్రం ప్రభుత్వం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పీఎం ఇంటర్న్‌షిప్ 2026: రూ.5,000 స్టైపెండ్, రూ.6,000 గ్రాంటుతో వేతన ఇంటర్న్‌షిప్‌లు.
  • దేశంలోని టాప్ 500 కంపెనీలలో 1.10 లక్షల ఇంటర్న్‌షిప్‌లు, డిసెంబర్ 2026 వరకు అమలు.
  • 21,700 పైగా అవకాశాలు, 20+ రంగాలలో, 32 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో అందుబాటులో.
  • 18-25 ఏళ్లలోపు, నిర్దిష్ట విద్యార్హతలు, రూ.8 లక్షల లోపు కుటుంబ ఆదాయం అవసరం.

PM Internship Scheme 2026: పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ ద్వారా దేశంలోని టాప్ 500 కంపెనీలలో యువతకు వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్‌లను అందిస్తుంది. ఈ పథకం కింద విద్యార్థులు స్కిల్స్ నేర్చుకోవడంతో పాటు  నెలకు రూ.5,000 స్టైపెండ్,  రూ.6,000 వన్ టైమ్ గ్రాంటును ఒక సంవత్సరం పాటు అందిస్తారు. పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని 2024లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలలో రెండు విడతలుగా అమలు చేశారు. మొత్తంగా 1.10 లక్షల ఇంటర్న్‌షిప్ లు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ ప్రాజెక్టును డిసెంబర్ 2026 వరకు పొడిగించారు. ఇంటర్న్‌షిప్ కాల పరిమితి ఆయా సంస్థల అవసరాలను బట్టి 6 లేదా 9 నెలలు ఉంటుంది. ఇప్పటికే ఉన్న వారికి 12 నెలల ఇంటర్న్ షిప్ అందిస్తున్నారు. కొన్ని సంస్థలు ఇంటర్న్‌లకు నెలకు రూ.9,000 వేతనం అందిస్తున్నాయి. 

PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2026 దరఖాస్తు విధానం 

1. అధికారిక వెబ్‌సైట్‌ https://pminternship.mca.gov.in/login/  ను సందర్శించండి. 
2. హోమ్‌పేజీలో 'టాప్ కంపెనీల ఇంటర్న్‌షిప్‌లు' కోసం సెర్చ్ చేయండి.  
3. ఏదైనా కంపెనీ లోగోపై క్లిక్ చేయండి.
4. ఆ కంపెనీ అందిస్తున్న ఇంటర్న్‌షిప్‌లు స్క్రీన్ పై కనిపిస్తాయి. 
5. హోమ్‌పేజీలోని లాగిన్/రిజిస్టర్ బటన్‌పై క్లిక్ చేయండి.
6. మీ యూజర్‌నేమ్/మొబైల్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, లాగిన్‌పై క్లిక్ చేయండి.
7. మీరు ఎంచుకున్న ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి. 

PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ కొత్త దరఖాస్తులు

ప్రస్తుతం 21,700కు పైగా ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు pminternship.mca.gov.in అధికారిక పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఐటీ, హెల్త్ సెక్టార్, రిటైల్, లాజిస్టిక్స్, తయారీ, హాస్పిటాలిటీతో సహా 20కి పైగా రంగాలలో ఇంటర్న్ షిప్ లు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 380కి పైగా జిల్లాలలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.  

దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు?

18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు
ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా, BA, BSC, B.Com, BCA, BBA, B.Pharma, B.E, B.Tech చేసిన అభ్యర్థులు లేదా 
ఎంఏ, ఎంఎస్సీ, ఎం.కామ్, ఎంసీఏ, ఎం.టెక్ డిగ్రీలు పొందిన పోస్ట్ గ్రాడ్యుయేట్లు   
నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (NAPS) లేదా నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) కింద ఇప్పటికే అప్రెంటిస్‌షిప్ పూర్తి చేయాలి. 
కుటుంబ సభ్యులలో ఎవరి ఆదాయం అయినా రూ.8 లక్షలకు మించి ఉండకూడదు. 

Also Read: 

PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2026 ఎంతకాలం?

పీఎం ఇంటర్న్‌షిప్ ఎంత కాలం అనేది ఇంటర్న్‌షిప్ అందిస్తున్న కంపెనీ అవసరాన్ని బట్టి ఉంటుంది. సాధారణంగా 6 లేదా 9 నెలలు ఉంటుంది. ఇంటర్న్‌షిప్ లో ఎక్కువ సమయం వర్క్ ఫీల్డ్ లో ఉంటారు.   

అవసరమయ్యే డాక్యుమెంట్స్ 

  • ఆధార్ కార్డు
  • వయస్సు ధ్రువీకరణ పత్రం
  • ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు  
  • ఆధార్‌తో లింక్ చేసిన బ్యాంకు అకౌంట్ 
  • ఇతర ముఖ్యమైన పత్రాలు

Frequently Asked Questions

పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2026 ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

దేశంలోని టాప్ 500 కంపెనీలలో యువతకు వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్‌లను అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. దీని ద్వారా విద్యార్థులు నైపుణ్యాలను నేర్చుకోవడంతో పాటు స్టైపెండ్ కూడా పొందుతారు.

ఈ పథకం కింద ఎంత స్టైపెండ్ లభిస్తుంది?

పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ కింద నెలకు రూ.5,000 స్టైపెండ్ అందిస్తారు. కొన్ని సంస్థలు రూ.9,000 వరకు కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌కు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి, వివిధ విద్యా అర్హతలు పొందినవారు, NAPS లేదా NATS కింద అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసినవారు, మరియు కుటుంబ ఆదాయం రూ.8 లక్షలకు మించనివారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటర్న్‌షిప్‌లు ఏయే రంగాలలో అందుబాటులో ఉన్నాయి?

ఐటీ, హెల్త్ సెక్టార్, రిటైల్, లాజిస్టిక్స్, తయారీ, హాస్పిటాలిటీతో సహా 20కి పైగా రంగాలలో ఇంటర్న్ షిప్ లు కల్పిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: సొంత మనుషులపై మరిగే నీళ్లు! నమ్మినోళ్లను నట్టేట ముంచడం కేటీఆర్‌ నైజం: కవిత
సొంత మనుషులపై మరిగే నీళ్లు! నమ్మినోళ్లను నట్టేట ముంచడం కేటీఆర్‌ నైజం: కవిత
Special Trains: విజయవాడ - విశాఖ మధ్య సహా పలు ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ – నహర్లగూన్ స్పెషల్ సర్వీస్
విజయవాడ - విశాఖ మధ్య సహా పలు ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ – నహర్లగూన్ స్పెషల్ సర్వీస్
Kavya Maran and Anirudh Wedding: కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం
కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
King 100 Tabu : కింగ్ 100లో టబు పవర్ ఫుల్ రోల్ - ఆ రోజున నాగ్ మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్
కింగ్ 100లో టబు పవర్ ఫుల్ రోల్ - ఆ రోజున నాగ్ మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్
TDP First List: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
Embed widget