అన్వేషించండి

Heavy Rains Alert: అల్పపీడనం ఎఫెక్ట్ - తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ

Rains In AP And Telangana: ఉపరితల ఆవర్తనం వాయువ్య, దానిని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిషా, ఉత్తర కోస్తాంధ్ర తీర ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉన్నది.

Southwest Monsoon:  ఉపరితల ఆవర్తనం వాయువ్య, దానిని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిషా, ఉత్తర కోస్తాంధ్ర తీర ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉన్నది. దీని ప్రభావంతో ఒడిశా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది సగటు సముద్ర మట్టానికి ఏడున్నర కి.మీ వరకు విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ ిది నైరుతి దిశకు వంగి ఉంటుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో ఏపీలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో రెడ్ అలర్ట్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

మరో రెండు నుంచి మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవన ద్రోణి ఇప్పుడు అనూప్ గఢ్, సికర్, గ్వాలియర్, సక్నా, పెండ్రా రోడ్, సెంటర్ గుండా వెళుతుంది. ఒడిషా, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం, ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి సగటున 1.5 కి.మీ వరకు విస్తరించి ఉంది. తూర్పు - పశ్చిమ గాలుల కోత దాదాపు ఉత్తర భారత ద్వీపకల్పమైన 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ వరకు విస్తరించి ఎత్తు వెళ్లేకొద్దీ దక్షిణం వైపు వంగి ఉంటుందని పేర్కొంది.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఉత్తర కోస్తాంధ్ర , యానాంలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు  వర్షాలు కురనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఈ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో నేటికి వర్షాలు మొదలుకాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు ఎప్పుడు మొదలుపెట్టాలో అర్థం కాని పరిస్థితి ఆ జిల్లాల రైతుల్లో నెలకొంది.

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి జల్లు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాటితో పాటు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుంది. ఈ జిల్లాలకు సైతం ఎల్లో అలర్ట్ జారీ అయింది. రేపు, ఎల్లుండి సైతం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొన్ని చోట్ల ఇంకా చినుకు కూడా పడలేదు. దీంతో వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

హెచ్చరిక: వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అన్నదాతలను హెచ్చరించింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

తెలంగాణలో వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. 
జగిత్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. మిగతా జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో పాటు ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sunita Williams: మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Vijayasai Reddy CID:  విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
Sunita Williams : 'మా మనసులు గెలుచుకున్నారు': సునీతా విలియమ్స్‌పై మోదీ ప్రశంస 
'మా మనసులు గెలుచుకున్నారు': సునీతా విలియమ్స్‌పై మోదీ ప్రశంస 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP DesamSunita Williams Crew 9 Dragon Capsule Splash Down | భూమిపైకి క్షేమంగా సునీతా విలియమ్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sunita Williams: మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Vijayasai Reddy CID:  విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
Sunita Williams : 'మా మనసులు గెలుచుకున్నారు': సునీతా విలియమ్స్‌పై మోదీ ప్రశంస 
'మా మనసులు గెలుచుకున్నారు': సునీతా విలియమ్స్‌పై మోదీ ప్రశంస 
Sunita Williams Returns: సునీతమ్మ వచ్చేసిందోచ్‌- సురక్షితంగా అంతరిక్షం నుంచి అమ్మ ఒడికి
సునీతమ్మ వచ్చేసిందోచ్‌- సురక్షితంగా అంతరిక్షం నుంచి అమ్మ ఒడికి
Voter Card: ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
Betting apps case: బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారికి మరో షాక్ - ఈడీ కూడా రంగంలోకి !
బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారికి మరో షాక్ - ఈడీ కూడా రంగంలోకి !
SC Classification Bill: ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం - రిజర్వేషన్లు పెంచుతామని సీఎం రేవంత్ హామీ
ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం - రిజర్వేషన్లు పెంచుతామని సీఎం రేవంత్ హామీ
Embed widget