Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన - ఏపీలో తాజా వెదర్ రిపోర్ట్ ఏంటంటే?
Weather News: తూర్పు, మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని దీని ప్రభావంతో తెలంగాణలో ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 2 వరకూ అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.
Rains In AP And Telangana: తూర్పు మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని.. దీని ప్రభావంతో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణలో ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ నెల 30న పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.
అలాగే, ఈ నెల 31న పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ఖమ్మం, హన్మకొండ, సిద్ధిపేట జిల్లాల్లో అక్కడక్కడ అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని.. అటు, సెప్టెంబర్ 1న ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో, అలాగే సెప్టెంబర్ 2న సైతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఏపీలో ఇదీ పరిస్థితి
రాబోయే 2 రోజుల్లో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో రాబోయే 3 రోజుల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. గంటకు 30 - 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అటు, రాయలసీమలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వివరించింది.
Also Read: Kavitha Arrives in Hyderabad: శంషాబాద్ చేరుకున్న కవిత, గజమాలతో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు