News
News
X

Rain Alert: నేడు ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు - ఏపీ, తెలంగాణకు IMD ఎల్లో అలర్ట్

Heavy Rains in AP Telangana: ఉత్తర ఒడిశా దాని పరసర ప్రాంతాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

FOLLOW US: 

Southwest Monsoon: ఉత్తర ఒడిశా దాని పరసర ప్రాంతాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి సాధారణ వర్షపాతం నమోదైంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అదే సమయంలో నైరుతి బంగాళాఖాతం నుంచి సైతం 50 కిలోమీటర్ల వేగంతో తీరంలో బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఏపీలోని కోస్తాంధ్రలో నేడు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనుండగా, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. తెలంగాణలో హైదరాబాద్‌లో ప్రతిరోజూ మధ్యాహ్నం, రాత్రి వర్షం కురుస్తుండగా.. పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలకు, తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఉత్తర కోస్తాంధ్ర నేడు ఓ మోస్తరు నుంచి వర్షాలు కురనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. యానాంలలోనూ నేటి నుంచి మూడు రోజులపాటు వర్ష సూచన ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తూ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. జూలై రెండు, మూడు వారాల్లో రెండు నుంచి మూడు అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. వీటి ప్రభావంతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో నేటికి వర్షాలు మొదలుకాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు ఎప్పుడు మొదలుపెట్టాలో అర్థం కాని పరిస్థితి ఆ జిల్లాల రైతుల్లో నెలకొంది.

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో ఉమ్మడి జిల్లాలైన గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుంది. రాయలసీమలో మాత్రం తేలికపాటి జల్లులు పడతాయి. ఇక్కడ ఎలాంటి వర్ష హెచ్చరిక జారీ కాలేదు. కొన్ని చోట్ల ఇంకా చినుకు కూడా పడలేదు. దీంతో వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

హెచ్చరిక: వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అన్నదాతలను హెచ్చరించింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సరిసిల్ల, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం సాయంత్రం, రాత్రి హైదరాబాద్ లోని పంజాగుట్ట, బంజారాహిల్స్, అమీర్‌పేట, ఖైరతాబాద్, మణికొండ​, గచ్చిబౌలి, లింగంపల్లి, జూబ్లీ హిల్స్, కూకట్‌పల్లి, బేగంపేట, సికింద్రాబాద్, పలు ప్రాంతాల్లో రాత్రి వర్షం కురిసింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి రెండు రోజులపాటు ఆరెంజ్ అలర్ట్‌ కూడా జారీ చేశారు. 

Published at : 06 Jul 2022 07:00 AM (IST) Tags: rains in telangana Weather Updates ap rains rains in ap weather news today

సంబంధిత కథనాలు

Weather Updates: ఏపీలో మరో 24 గంటలు వర్షాలు - తెలంగాణలో వాతావరణం ఇలా

Weather Updates: ఏపీలో మరో 24 గంటలు వర్షాలు - తెలంగాణలో వాతావరణం ఇలా

Gold-Silver Price: బంగారం, వెండి కొనాలా? నేటి ధరలు ఇక్కడ తెలుసుకోండి, ప్లాటినం కూడా

Gold-Silver Price: బంగారం, వెండి కొనాలా? నేటి ధరలు ఇక్కడ తెలుసుకోండి, ప్లాటినం కూడా

Karnataka Accident : కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి

Karnataka Accident : కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి

Governor At Home : రాజ్ భవన్ ఎట్ హోమ్ కు సీఎం కేసీఆర్ గైర్హాజరు, ఆఖరి నిమిషంలో రద్దు

Governor At Home : రాజ్ భవన్ ఎట్ హోమ్ కు సీఎం కేసీఆర్ గైర్హాజరు, ఆఖరి నిమిషంలో రద్దు

Breaking News Telugu Live Updates: కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి 

Breaking News Telugu Live Updates: కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి 

టాప్ స్టోరీస్

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!

ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!

Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Tummmala Nageswararao :  హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల