అన్వేషించండి

Rains Alert: వర్షాల ఎఫెక్ట్, తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ - ఏపీలో అక్కడ పిడుగులు పడతాయని వార్నింగ్

Rains In AP Telangana: ఏపీలో నేడు కోస్తాంధ్రలో తేలికపాటి జల్లులు పడనుండగా, రాయలసీమ జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణాలోనూ భారీ వర్షాలు కురుస్తాయి.

Rains In Telangana: తూర్పు రాజస్థాన్ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉత్తర మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్ గఢ్, ఏపీలోని కోస్తా ప్రాంతం మీదుగా ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల, 3.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగి బలహీనపడింది. ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీరంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు, నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా కొమొరిస్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర దక్షిణ ద్రోణి బలహీనపడింది. భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
తెలంగాణలో భారీ వర్షాలు 
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లో శుక్రవారం సైతం భారీ వర్షం కురిసింది. నేడు సైతం నగరాన్ని మబ్బులు కమ్మేశాయి. తూర్పు, ఈశాన్య దిశల నుంచి గంటకు 6 నుంచి 12 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపారు. భారీ వర్షాల సమయంలో వాగులు, వంకల ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించకూడదని ప్రజలను అధికారులు, మంత్రులు హెచ్చరించారు.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మరో రెండు రోజులపాటు తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలలో సైతం పలుచోట్ల తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.  

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో నేడు ఓ మోస్తరు వర్షాలు కురవనుడగా, రాయలసీమకు భారీ వర్ష సూచన ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. దక్షిణ కోస్తాంధ్రలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావం రాయలసీమపై అధికంగా ఉండటంతో  కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలలో ఈ ప్రాంతాల్లో కొన్నిచోట్ల పిడుగులు పడే పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget