Rains In AP Telangana: అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలతో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ
పశ్చిమ మధ్య, దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
Rains in Telangana AP: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీతో పాటు తెలంగాణలో కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసింది.
పశ్చిమ మధ్య, దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. ఈ అల్పపీడనం క్రమంగా కదులుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరానికి చేరుకుని మరికొన్ని గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో విస్తారంగా వర్షాలు పడతాయి. మిగతా చోట్ల చల్లని గాలులు వేగంగా వీస్తాయి. భారీ వర్ష సూచనతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
Press Release on Increase in rainfall activity over Andhra Pradesh on 09th and 10th September, 2022 due to formation of a Low Pressure Area over Westcentral and adjoining Northwest Bay of Bengal off north Andhra Pradesh- South Odisha Coasts dated:- 09.09.2022. pic.twitter.com/1mEDYm3Z46
— MC Amaravati (@AmaravatiMc) September 9, 2022
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
నేడు రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనుండగా, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గుంటూరు, ప్రకాశం క్రిష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాతో పాటు రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 9, 2022
తెలంగాణలో వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో మరో 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్ష సూచనతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నిన్న ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి.
నేడు (సెప్టెంబర్ 10న) నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ వార్నింగ్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని సెప్టెంబర్ 10న ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నైరుతి దిశ నుంచి గంటకు 12 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి.
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.