News
News
X

Telangana:తెలంగాణ వ్యాప్తంగా కుంభృష్టి...జిల్లాలను ముంచెత్తిన వానలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొట్టాయి. జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్‌, భైంసా పట్టణాలు నీటమునిగాయ్. భారీగా పంటలు నీటమునిగాయి.

FOLLOW US: 

జులై ఆఖరివారంలో తెలంగాణ వ్యాప్తంగా కుంభవృష్టి కురిసింది. కుమురం భీం జిల్లా వాంకిడిలో 27.30 సెంటీమీటర్ల వాన పడి వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరిలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి. శ్రీరామసాగర్‌ నుంచి మేడిగడ్డ వరకు నీటిని దిగువకు వదులుతున్నారు. 


రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో జులై ఆఖరి వారంలో కురిసిన అతి భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది.  ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి వరద వచ్చి చేరడంతో నిండుకుండల్లా మారాయి. నగరాలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు జిల్లాల్లో వాగులు, కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వందల గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.  నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమురం భీం జిల్లాల్లోని పలు మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లాలో 35 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో వరద ఉద్ధృతితో నిర్మల్‌, భైంసా పట్టణాలు నీట మునిగాయి.  

News Reels


కామారెడ్డి జిల్లాలో 22 ఇళ్లు పూర్తిగా, 111 ఇళ్లు పాక్షికంగా నేలకూలాయి. 17,198 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో 7 ఇళ్లు పూర్తిగా, 48 పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆరు రోడ్లు కొట్టుకుపోయాయి. ఉమ్మడి వరంగల్‌ పరిధిలోని ఆరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు చెరువులు నిండుకుండల్లా మారాయి. వరంగల్‌ నగరంలో పలు కాలనీలు జలమయం కావడంతో బల్దియా అప్రమత్తమైంది. ఖానాపూర్‌ మండలంలోని పాకాల సరస్సు 19 అడుగులకు చేరింది. ములుగు జిల్లా లక్నవరం సరస్సులో నీటిమట్టం 27 అడుగులకు, రామప్ప చెరువులో 31 అడుగులకు చేరింది.  


ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో  పర్ణశాల వద్ద సీతవాగు ప్రాంతం, సీతమ్మ నారచీరల ప్రాంతం, స్వామివారి సింహాసనం, ఇనుప వంతెన, సీతమ్మ విగ్రహం వరద నీటిలో మునిగిపోయాయి. ఖమ్మం మున్నేరు నది 14 అడుగులకు చేరింది. ఖమ్మం మార్గంలో కొత్తలంకపల్లి వద్ద వరద ఉద్ధృతికి రైల్వే పనుల్లో రోడ్లు కోతకు గురయ్యాయి. వైరా, బేతుపల్లి జలాశయాలు నీటిమట్టం దాటాయి. కిన్నెరసాని పరవళ్లు తొక్కుతోంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 16 అడుగులకు చేరింది. భద్రాద్రి జిల్లాలో వాగులు పొంగి ప్రవహించడం వల్ల 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 


ఉమ్మడి పాలమూరు జిల్లాలో దుంధుబి, ఊకచెట్టు, మన్నెవాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సంగారెడ్డిలోని నల్లవాగు అలుగుపారుతోంది. ధర్మపురి నేరేళ్లగుట్ట 64వ నంబరు జాతీయ రహదారిపై వరద నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. జగిత్యాల- నిజామాబాద్‌ జాతీయ రహదారిపై గాంధీనగర్‌ వద్ద సైతం రాకపోకలు స్తంభించాయి. వేములవాడ మూలవాగులో చేపల కోసం వెళ్లిన ఆరుగురు జాలర్లు చిక్కుకున్నారు. తాళ్ల సాయంతో వారిని పోలీసులు ఒడ్డుకు చేర్చారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని జోగన్‌పల్లి పెద్ద చెరువు మత్తడి దూకడంతో వరినాట్ల కోసం వెళ్లిన 21 మంది కూలీలు అందులో చిక్కుకున్నారు. ఎస్సై సతీష్‌ గ్రామస్థుల సహకారంతో వంతెనకు ఇరువైపుల తాళ్లు కట్టి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.


జగిత్యాల జిల్లా అనంతారం వాగులో నీటి ప్రవాహానికి కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. నిజామాబాద్‌ జిల్లా మెండోరాలో భారీ వర్షాలకు ఓ ఆశ్రమాన్ని వరద చుట్టేసింది.  జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది.హైదరాబాద్‌లో హిమాయత్‌సాగర్‌ ఐదు గేట్లు ఎత్తి మూసీలోకి వరదను వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్‌కు భారీగా వరద రావడంతో రెండు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. 


జులై ఆఖరివారంలో కురిసిన భారీ వర్షాలకు సింగరేణిలో బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిపేశారు. 19 ఉపరితల గనుల్లో పనులు పూర్తిగా నిలిపివేయడంతో 1,95,765 టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టపోయింది. గడ్డెన్నవాగు జలాశయం నుంచి విడుదలైన వరద నీటితో భైంసా పట్టణంలోని సుద్దవాగు తీరంలో నిర్మించిన వైకుంఠధామం పూర్తిగా నీట మునగగా.. అందులో ఏర్పాటు చేసిన 15 అడుగుల మహాశివుడిని గంగమ్మ చుట్టేసింది. యాదాద్రి ఆలయ దారులు పాక్షికంగా దెబ్బతినడంతో  రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వానలకు ఆలయ రెండో ఘాట్ రోడ్డులో కొండపై నుంచి రాళ్లు జారిపడ్డాయి. ఆ సమయంలో యాత్రికులు ఎవరూ లేకపోవడంతో ప్రాఅణాపాయం తప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మూలవాగు అడుగు భాగంలో ఇసుక, సిమెంట్‌ దిమ్మెలు కొట్టుకుపోయాయి.

Published at : 23 Jul 2021 12:22 PM (IST) Tags: telangana rain news today telangana flood telangana rain updates telangana heavy rains

సంబంధిత కథనాలు

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

BJP MP Dharmapuri Arvind : చంపుతానని బెదిరించిన ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోండి, హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అర్వింద్

BJP MP Dharmapuri Arvind :  చంపుతానని బెదిరించిన ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోండి, హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అర్వింద్

Rangareddy Crime News: రాజేంద్రనగర్ లో దారుణం, పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై అత్యాచారం!

Rangareddy Crime News: రాజేంద్రనగర్ లో దారుణం, పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై అత్యాచారం!

Sharmila Arrest : కారులో షర్మిల - క్రేన్‌తో తరలించిన పోలీసులు ! సోమాజిగూడలో హైడ్రామా

Sharmila Arrest : కారులో షర్మిల - క్రేన్‌తో తరలించిన పోలీసులు ! సోమాజిగూడలో హైడ్రామా

Gadwal News : సెల్ ఫోన్ ఛార్జింగ్ తీస్తుండగా విద్యుత్ షాక్, పదేళ్ల బాలిక మృతి!

Gadwal News : సెల్ ఫోన్ ఛార్జింగ్ తీస్తుండగా విద్యుత్ షాక్, పదేళ్ల బాలిక మృతి!

టాప్ స్టోరీస్

Somu Letter To Jagan : విశాఖ భూదందాలపై సీబీఐ విచారణ చేయాల్సిందే - సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ !

Somu Letter To Jagan : విశాఖ భూదందాలపై సీబీఐ విచారణ చేయాల్సిందే  - సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ !

Hyderabad News: పదో తరగతి విద్యార్థినిపై క్లాస్‌మేట్స్ అత్యాచారం- వైరల్‌ వీడియో చూసి తల్లిదండ్రులు షాక్!

Hyderabad News: పదో తరగతి విద్యార్థినిపై క్లాస్‌మేట్స్ అత్యాచారం-  వైరల్‌ వీడియో చూసి తల్లిదండ్రులు షాక్!

Nara Lokesh: ‘బాబాయ్ కేసు పక్క రాష్ట్రానికి, అబ్బాయ్ చంచల్ గూడ జైలుకి’ నారా లోకేష్

Nara Lokesh: ‘బాబాయ్ కేసు పక్క రాష్ట్రానికి, అబ్బాయ్ చంచల్ గూడ జైలుకి’ నారా లోకేష్

Jio Network Outage: యూజర్లకు జియో షాక్‌! ఆగిపోయిన కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా సేవలు!

Jio Network Outage: యూజర్లకు జియో షాక్‌! ఆగిపోయిన కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా సేవలు!