Etala Rajender : కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా చెప్పని ఈటల - కాళేశ్వరం కమిషన్ విచారణ జరిగిన తీరు ఇదే
Kaleshwaram Commission: ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణ గంట పాటు సాగింది. నిర్ణయాలన్నీ కేబినెట్ ఆమోదంతో జరిగాయని ఈటల చెప్పారు.

Etala Rajendar On Kaleshwaram : క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాతే మూడు బ్యారేజీల నిర్మాణం ప్రారంభించామని.. నిధుల విడుదల తప్ప ఇతర విషయాల్లో ఆర్థిక శాఖ ప్రమేయం లేదని కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి,మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు 113వ సాక్షిగా హాజరైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో మొదట అంతా నిజమే చెప్తానని ప్రమాణం చేయించిన తర్వాత పలు ప్రశ్నలు అడిగారు.
మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు చేయాలని టెక్నికల్ టీం రిపోర్టుల ఆధారంగా సబ్ కమిటీ సిఫారసు చేసుందని తెలిపారు. ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని ఆ తర్వాత . మూడు బ్యారేజీల నిర్మాణం మొదలుపెట్టామని ఈటల తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదని.. అందుకే 150 నుంచి 148 కుదించామన్నారు. మూడు బ్యారేజీలు ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారన్న కాళేశ్వరం కమిషన్ మరోసారి అడదడంతో.. క్యాబినెట్ నిర్ణయం తీసుకుందనిచెప్పారు. ప్రాజెక్టు రీ డిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చిందో ఈటల చెప్పారు. మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో సీఎం కేసీఆర్ సబ్ కమిటీ వేశారని ..హరీష్ రావు చైర్మన్‌గా సబ్ కమిటీలో నేను, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నామమన్నారు.
ఎక్స్‌పర్ట్ కమిటీ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ నిర్ణయం మేరకు రీ డిజైన్ జరిగిందని తెలిపారు. రీ డిజైన్ చేయడానికి సబ్ కమిటీ సంతకం చేసిందని తెలిపారు. మూడు బ్యారేజీలు అక్కడ కట్టకూడదని టెక్నికల్ కమిటీ రిపోర్టు ఇచ్చిందా అని కమిషన్ ప్రశ్నించడంతో.. టెక్నికల్ కమిటీ చాలా రిపోర్టులు ఇచ్చాయి.. ఫైనల్‌గా మూడు బ్యారేజీల నిర్మాణం నిర్ణయం క్యాబినెట్ తీసుకుందని స్పష్టం చేశారు. DPR కోసం 597. 45 లక్షలు వ్యాప్కోస్ సంస్థకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన విషయం తనకు తెలియదన్నారు. డిపిఆర్ అప్రూవల్ సహా అన్ని అనుమతులు క్యాబినెట్లో తీసుకున్నామని నిధుల సమీకరణ, లోన్స్ కోసం కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. ఫైనాన్సు పరిధిలోకి కార్పొరేషన్ రాదని ఈటల తెలిపారు. కార్పొరేషన్ నుంచి నిధులను కలెక్షన్ చేసి లోన్స్ రీపెమంట్ చేయాలని అనుకున్నాంమన్నారు. కానీ కార్పొరేషన్ ద్వారా నిధుల కలెక్షన్ కాలేదన్నారు.
నిధుల విడుదల అంతా కార్పొరేషన్ ద్వారానే జరిగాయి ఆర్థిక శాఖకు సంబంధం లేదని తెలిపారు. 2016 తమ్మిడిహట్టి ప్రాజెక్ట్ అంచనా రూ.16,500 కోట్లు.. ఆ తర్వాత తమ్మిడిహట్టి అంచనా రూ.38 వేల కోట్లకు పెరిగిందన్నారు. రూ.63 వేల కోట్లతో మొదట కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదన పెట్టారు. ఆ తర్వాత కాళేశ్వరం అంచనా రూ.82 వేల కోట్లకు పెరిగిందని.. తుమ్మడిహట్టి ద్వారా నీటి అవసరాలు తీరవని CWC రిపోర్టుతో.. ప్రత్యామ్నాయం చూడాలని ప్రభుత్వం కోరడంతోనే కాళేశ్వరం ఎంపిక జరిగిందన్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయవద్దు.. విచారణ పూర్తి చేయాలని.. ఇప్పటికే ఏడాదిన్న కాలం వృదా చేశారు...కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగా ఎక్కడ అవినీతి జరిగిందో బయటపెట్టాలని ఈటల డిమాండ్ చేశారు.





















