Banakacharla Issue: రేవంత్ రెడ్డిలో విషయం తక్కువ విషం ఎక్కువ - హరీష్ రావు తీవ్ర విమర్శలు
BRS: బనకచర్లపై రేవంత్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ లో విషయం తక్కువ..విషం ఎక్కువన్నారు.

Harish Rao: బనకచర్ల విషయంలో రేవంత్ రెడ్డి తీరును మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా తప్పు పట్టారు. బనకచర్లను అడ్డుకోండి అని మేము మాట్లాడితే బోడి గుండు కు మోకాలుకు లంకె పెట్టినట్లు నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడారని మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ ఆరు నెలల నుండి పనిచేస్తుంటే, కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాల రాస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిని కలుస్తూ కేంద్ర జల మంత్రిని కలుస్తూ ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంటే అమాయకంగా ముఖ్యమంత్రి అడుగుతారు బనకచర్ల ఏ బేసిన్లో ఉందని అడుగుతున్నారని మండిపడ్డారు.
నీకు ఎంత కమిట్మెంట్ ఉందో నీకు ఎంత సిన్సియార్టీ ఉందో ఆరు నెలల నుంచి నువ్వు ఎంత శ్రద్ధ పెట్టినావో నిన్న బయటపడ్డదని రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఆంధ్ర దోపిడీ అడ్డుకొని తెలంగాణ పొలాలకు నీళ్లు పారియ్యి ముఖ్యమంత్రి అంటే, అక్రమ ప్రాజెక్టును ఆపవయ్యా రేవంత్ రెడ్డి అంటే అది చేతగాక అడ్డు అదుపు లేకుండా అబద్దాల ప్రవాహాన్ని ముఖ్యమంత్రి గారు పారించారన్నారు. బనకచర్ల ఆపాలి అని ఎంపీ రవిచంద్ర అంటే అబద్ధాలు చెప్పారన్నారు.
దేవాదుల కూడా గోదావరి బేసిన్ కదా అని కొత్తగా అడుగుతున్నాడని.. రేవంత్ సలహాదారుడు ఆదిత్యా దాస్ బనకచర్ల ప్రకాశం జిల్లాలో ఉంది అంటాడన్నారు.కానీ అది ఉన్నది నంద్యాల జిల్లాలో ్ని.. ముఖ్యమంత్రి అట్లంటే ఆయన సలహాదారుడు అంతకంటే గొప్ప ఘనుడుగా ఉన్నాడని ఎద్దేవా చేశారు. నల్లమల్ల బిడ్డ కాదు వెకిలి మాటలే వెర్రిబిడ్డ రేవంత్ రెడ్డి...రేవంత్ రెడ్డిలో విషయం తక్కువ విషం ఎక్కువ అని మండిపడ్డారు. బనకచర్ల విషయంలో మొద్దునిద్ర లేపింది బిఆర్ఎస్ పార్టీనేనని..నేను రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టి వాయిస్తే పాత డేట్లు వేసి ఉత్తరాలు విడుదల చేశారని విమర్శఇంచారు. బనకచర్ల ను ఆపడానికి ప్రయత్నం చేయలేదు బనకచర్లను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. గోదావరిలో వెయ్యి, కృష్ణాలో 500 టిఎంసీలు ఇచ్చి ఎంతైనా తీసుకుపో అంటాడని..అలా ఎలా అంటారని ప్రశ్నించారు. మీ మూర్ఖత్వం వల్ల రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ముందు రేవంత్ రెడ్డి తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలన్నారు.
నిన్నటి ప్రెజెంటేషన్ లోనే సుబ్రమణ్య ప్రసాద్ స్పష్టంగా చెప్పాడని.. 968 టీఎంసీలకు తెలంగాణలో ప్రాజెక్టుగా రూపకల్పన జరిగింది, అందులో 946 Tmc CWC హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చింది అని చెప్పారన్నారు. చంద్రబాబును అడుక్కునే బుద్ధి పోతలేదు. చంద్రబాబు దయా దక్షిణాల మీద బతికే బుద్ధి పోతలేదదని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చేది ఏంది వెయ్యి టీఎంసీలు. తెలంగాణ రాష్ట్రానికి ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 968 టీఎంసీలు కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 968 లో 946 టీఎంసీలకు అన్ని అనుమతులు సాధించామమన్నారు.
కేసీఆర్ జల శక్తిమంత్రికి రాసిన లేఖలో.. గోదావరిలో 968 TMC మాకు కేటాయించారు, 3000 TMC నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి అందులో 1950 tmc మాకు కావాలి అని పేర్కొన్నారన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం వేయి ఇచ్చి మొత్తం తీసుకో అంటున్నాడని విమర్శించారు. కెసిఆర్ తెలంగాణ కోసం, నీళ్ల కోసం ఎంతో పోరాటం చేశారని .. కెసిఆర్ పాదయాత్ర తర్వాత అప్పటి దిగివచ్చి ఎడమ కాలువ లిఫ్టులు కూడా కుడి కాలువలే ప్రభుత్వమే మెయింటైన్ చేస్తున్నదని గుర్తు చేశారు.
గోదావరి నుండి ఎన్ని నీళ్లు సముద్రంలో కలుస్తాయని 60 ఏళ్ల లెక్కలు cwc చెప్పింది. దాని ప్రకారం ప్రతి ఏటా కనీసం 3000 tmc సముద్రములో కలుస్తున్నాయి. ఇదే విషయాన్ని కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో చెప్పారు. దీనికి కూడా రేవంత్ రెడ్డి వక్రీకరించారు. బనకచర్లనే ముచ్చట ఇక్కడ లేదన్నారు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు పది అబద్దాలు మాట్లాడడం రేవంత్ రెడ్డి అలవాటు అని మండిపడ్డారు. చాలా స్పష్టంగా గోదావరి కృష్ణ నదుల అనుసంధాన విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకూడదని ఒకవేళ వెళ్తే తెలంగాణ అందుకు అంగీకరించదు అని చెప్పారన్నారు.





















