News
News
X

Attack On Bairi Naresh : హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు, భైరి నరేష్ పై మరోసారి దాడి!

Attack On Bairi Naresh : హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్ పై మరోసారి దాడి జరిగింది.

FOLLOW US: 
Share:

Attack On Bairi Naresh :  అయ్యప్ప స్వామి, హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు భైరి నరేష్ పై మరోసారి దాడి జరిగింది. హనుమకొండ జిల్లా గోపాల్ పూర్ లో భైరి నరేష్ పై అయ్యప్ప భక్తులు దాడి చేశారు. పోలీస్ వెహికిల్ లో ప్రొటెక్షన్ తో వెళ్తున్న నరేష్ ని కిందకు లాగి దాడి చేశారు. గతంలో అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుకెళ్లాడు భైరి నరేష్. జైలు నుంచి బయటకు వచ్చాక మరోసారి వివాస్పద వాఖ్యలు చేశాడు నరేష్. తీరు మార్చుకోకుండా నేనింతే అన్నట్టు వ్యవహరిస్తున్నాడన్న ఆగ్రహంతో దాడి చేసినట్లు అయ్యప్ప భక్తులు అంటున్నారు. దాడి అనంతరం భైరి నరేష్ మాట్లాడారు. నాపై దాడి చేస్తారనే పోలీసులను రక్షణ అడిగానన్నారు. పోలీసులు వాహనంలో ఉండగానే నాపై దాడి చేశారన్నారు. ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలని కోరారు. నాకు గన్ లైసెన్స్ కావాలని భైరి నరేష్ కోరారు. పోలీసుల వానహంలో వెళ్తుంటే వెంబడించి దాడి చేశారని వాపోయారు. 

ఇటీవల బెయిల్ 

దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్ కి ఇటీవల బెయిల్ మంజూరు అయింది. చర్లపల్లి జైలు నుంచి భైరి నరేష్ బెయిల్ పై విడుదల అయ్యారు. భైరి నరేష్ కు కోడంగల్ కోర్టు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.  దాదాపు 45 రోజుల పాటు నరేష్ జైల్లో ఉండి ఫిబ్రవరి 16న విడుదలయ్యారు. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‭కి కోడంగల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కొడంగల్ కోర్టు తెలిపింది.  దాదాపు 45 రోజుల పాటు జైలులో ఉన్న నరేష్‭ను చర్లపల్లి జైలు నుంచి పోలీసులు విడుదల చేశారు. అయ్యప్ప స్వాములపై భైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. భైరి నరేష్ వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి భక్తులు, హిందూ సంఘాలు నిరసనకు దిగాయి. అతడిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కొడంగల్‌ పోలీసులు భైరి నరేష్‌తో పాటు అంబేడ్కర్‌ జాతర కార్యక్రమ నిర్వాహకుడు డోలు హనుమంతును ఇటీవల అరెస్టు చేశారు. 

ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు 

అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి భైరి నరేష్ ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అయ్యాడు. అయితే విచారణలో తాను ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులకు తెలిపాడు. అతడు నేరం అంగీకరించినట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌ లో పేర్కొన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశంతోనే భైరి నరేష్ ఈ వ్యాఖ్యలు చేశాడని కొడంగల్ పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో తెలిపారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించిన హనుమంతు ఉద్దేశపూర్వకంగానే భైరి నరేష్‌ ఈ కార్యక్రమానికి పిలిచినట్లు పోలీసులకు తెలిపాడు. భైరి నరేష్‌పై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. హనుమకొండలో రెండు, నవాబ్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఒక కేసు అతడిపై నమోదు అయినట్లు కోర్టుకు తెలిపారు. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యల కేసుపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.  

దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు 

గత ఏడాది డిసెంబర్ నెలఖారులో కొడంగల్‌లో నిర్వహించిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అయ్యప్పస్వామిపై భైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయ్యప్ప నువ్వు నా కొంప ముంచావంటూ బహిరంగ సభలో అయ్యప్పస్వామిని కించపరుస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడిపై హిందూ సంఘాలు, అయ్యప్ప మాలధారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప మాలధారులు ఆందోళనలు చేపట్టి భైరి నరేష్ పై ఫిర్యాదు చేశారు.  దీంతో అనేక పోలీస్ స్టేషన్‌లలో భైరి నరేష్ పై కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి పరారీలో ఉన్న భైరి నరేష్‌ను రెండ్రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. కరీంనగర్ వెళ్తుండగా వరంగల్‌లో అతడిని అరెస్టు చేశారు.  బైరి నరేష్‌కు చట్ట ప్రకారం శిక్ష పడేటట్లు చూస్తామని అప్పట్లో పోలీసులు తెలిపారు. అతడిపై FIR No. 185/2022 U/s 153-A, 295-A, 298, 505(2) IPC of PS Kodangal సెక్షన్ల కింద కేసులు పెట్టామన్నారు. ఎక్కడైనా మీటింగ్ లు నిర్వహించేటప్పుడు మీటింగ్ నిర్వాహకులు  ఇలాంటి వారిని ప్రోత్సహించకూడదని పోలీసులు కోరారు. అలాంటి వారిని ప్రోత్సహించి శాంతికి విఘాతం కలుగ చేసిన నిర్వాహకులపైన కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Published at : 27 Feb 2023 07:35 PM (IST) Tags: Hindu gods Ayyappa devotees Police Bairi Naresh Hanamkonad contraversial comments

సంబంధిత కథనాలు

Medical Seats: కొత్తగా పది మెడికల్‌ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!

Medical Seats: కొత్తగా పది మెడికల్‌ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

నెల గడువిస్తే 24 గంటల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయమే: కేంద్ర మాజీ మంత్రి

నెల గడువిస్తే 24 గంటల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయమే: కేంద్ర మాజీ మంత్రి

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Dial 100 Saves Life : డయల్ 100కు కాల్ చేసి, ఆత్మహత్యాయత్నం చేసిన యువతి- చాకచక్యంగా కాపాడిన కానిస్టేబుల్

Dial 100 Saves Life : డయల్ 100కు కాల్ చేసి, ఆత్మహత్యాయత్నం చేసిన యువతి- చాకచక్యంగా కాపాడిన కానిస్టేబుల్

టాప్ స్టోరీస్

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?