అన్వేషించండి

Women Safety T-services: ఆడపిల్లలు సేఫ్ గా బయటకు వెళ్లి రావొచ్చు, ఇల్లు చేరే వరకు అండగా టీ-సర్వీసెస్

ఏ సమయంలోనైనా సరే ఆడవారి భద్రత కోసం పోలీసు యంత్రాంగం రక్షణ కలిపిస్తుందని చెప్పటానికి తెలంగాణ స్టేట్ పోలీస్ 'టీ-సేఫ్ సర్వీసెస్' అనే ఒక మంచి పనిని ఇనిషియేట్ చేశారు.

Telangana Women Safety News: ఈ 21 వ శతాబ్దంలోనూ ఆడపిల్లలు కాస్త లేట్ అయిందంటే ఇంటికెళ్లటానికి భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ట్రాఫిక్ లో చిక్కుకోవచ్చు. బస్ లేట్ అయి ఉండొచ్చు. తెలియని చోటుకి వెళ్లాల్సి వచ్చి, ఇంటికి రావటం లేట్ అవొచ్చు. నైట్ షిఫ్ట్ కి ఆఫీస్ కు వెళ్లాల్సి రావొచ్చు. అన్ని పరిస్థితులు ఒకేలా ఉండవు. లారీలు, క్యాబులు, ఆటోలే కాదు. ఎంతో చదువుకున్న వారిలా హుందాగా కనిపించి, ఆడపిల్లలను మోసం చేసేవారు ఈ సమాజంలో ఉన్నారు.

ఏ సమయంలోనైనా సరే ఆడవారి భద్రత కోసం పోలీసు యంత్రాంగం రక్షణ కలిపిస్తుందని చెప్పటానికి తెలంగాణ స్టేట్ పోలీస్ 'టీ-సేఫ్ సర్వీసెస్' అనే ఒక మంచి పనిని ఇనిషియేట్ చేసారు. దానికి సంబంధించి ఒక ప్రకటన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇంతకీ ఆ యాడ్‌లో ఏముంది.. 
ఆ యాడ్ లోని విషయమేమిటంటే.. ఒక అమ్మాయి రాత్రిపూట బస్ నుంచి బస్టాండ్ లో దిగుతుంది. ఆ సమయంలో అందుబాటులో ఒక్క వెహికిల్ కూడా కనిపించదు. బస్టాండ్ లో కుర్చీలో కూర్చొని, మంచి ఆహార్యంతో, చదువుకున్న వ్యక్తిలా ఉన్న ఒక పెద్దావిడ కనపడుతుంది. ఈ అమ్మాయిని చూసి, 'ఎక్కడికి వెళ్తున్నావ్ బేటా' అని పలకరిస్తుంది. అపుడు ఆ అమ్మాయి 'విద్యానగర్ ఆంటీ' అని బదులిస్తుంది. అపుడు ఆ పెద్దావిడ నేనూ అక్కడికే వెళ్లాలి. నా కార్ పికప్ చేసుకోవటానికి వస్తుంది. అభ్యంతరం లేకపోతే నువ్వూ నాతో రావొచ్చు ' అని అంటుంది. ఆ అమ్మాయి మర్యాదగా తిరస్కరిస్తుంది. పెద్దావిడ వెళ్ళిపోబోతూ ' లిఫ్ట్ వద్దనుకుంటున్నావా లేట్ అయింది కదా' అంటూ మళ్లీ అడుగుతుంది.  వేరే దారి కూడా కనపడకపోవటంతో ఆ అమ్మాయి ' రెండు నిమిషాలు టైం ఇస్తారా వాష్ రూం కి వెళ్లొస్తాను ' అని అటు వైపుకి వెళ్లి తన ఫోన్ తీసి 100 కి డయల్ చేస్తుంది. ఎమర్జెన్సీ అయితే 1 నొక్కమని, టీ-సేఫ్ సర్వీసెస్ కోసం 8 నొక్కమని కంప్యూటర్ వాయిస్ వినిపిస్తుంది. 100 కి డయల్ చేసి, టీ-సర్వీసెస్ ఆప్షన్ ఎంచుకోవటం వల్ల మీ రక్షణ బాధ్యత అంతా పోలీసులే చూసుకుంటారు అని ఈ యాడ్ సారాంశం.

టీ-సర్వీసెస్ ఎలా పనిచేస్తుంది?

'డయల్ 100' కి ఫోన్ చేసి టీ-సర్వీసీస్ కోసం 8 నొక్కిన తర్వాత, మీరు వెళ్తున్న లొకేషన్ పోలీసులు ట్రాక్ చేస్తారు. మీరు మీ సేఫ్టీని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండటానికి ఒక సీక్రెట్ పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. కొద్దిసేపటికి మళ్ళీ కాల్ చేసి, మీరు సేఫ్ గా ఉన్నట్లైతే ఆ సేఫ్టీ పాస్ వర్డ్ నంబర్ నొక్కమని కంప్యూటర్ అడుగుతుంది. ఏదైనా జరిగి మీరు రెస్పాండ్ అవకపోతే, పోలీసులు క్షణాల్లో ఆ లొకేషన్ కు వచ్చి కాపాడుతారు. 

ఏమవుతుందిలే అని అన్నిసార్లు తీసిపారేయలేం. ఆడపిల్లలు బయటకు వెళ్లినపుడు సేఫ్టీకి ప్రయారిటీ ఇవ్వాలి. లేట్ అయి వాహనాలు, క్యాబ్ లు కూడా అందుబాటులో లేని నిర్మానుష్య ప్రాంతంలో చిక్కుకుపోయే సందర్భాలు దురదృష్టవశాత్తు ఎదురైతే ధైర్యంగా ఈ చిన్న సేఫ్టీ టెక్నిక్ పాటిస్తే సురక్షితంగా ఇల్లు చేరుకోవచ్చు. మహిళా రక్షణ కోసం ఇంత మంచి సర్వీస్ తీసుకొచ్చిన తెలంగాణ పోలీసులకు సెల్యూట్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Embed widget