అన్వేషించండి

KTR UK Tour: లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

ప్రతిష్టాత్మక లండన్ కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

Telangana signs MoU with Kings College: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక లండన్ కింగ్స్ కాలేజ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ ఫార్మా సిటీ లో ఏర్పాటు కానున్న ఫార్మా యూనివర్సిటీకి సంబంధించిన పరిశోధన, అకాడమిక్ వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కింగ్ కాలేజ్ పనిచేయనుంది. యూకే పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ , సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (హెల్త్ & లైఫ్ సైన్సెస్) కింగ్స్ హెల్త్ పార్ట్‌నర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రిచర్డ్ ట్రెంబాత్‌లు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు. 

ఏప్రిల్ నెలలో బ్రిటిష్ కౌన్సిల్ నేతృత్వంలో కింగ్స్ కాలేజ్ లండన్ ప్రెసిడెంట్, ప్రిన్సిపాల్‌తో సహా కింగ్స్ ప్రతినిధులు భారతదేశంలో పర్యటించారు. దానికి కొనసాగింపుగా ఇవాళ లండన్ లోని కింగ్స్ కాలేజ్ క్యాంపస్ ను మంత్రి కేటీఆర్ సందర్శించారు. తాజా ఒప్పందంతో ఫార్మా రంగ ఉన్నత విద్యావకాశాలు, పరిశోధన, విద్యార్థుల బదలాయింపుతో పాటు పాఠ్యాంశాల తయారీలో తెలంగాణ ప్రభుత్వానికి కింగ్స్ కాలేజ్ తన సహకారాన్ని అందిస్తుంది. ఫార్మా సిటీ , లైఫ్ సైన్సెస్ అంశాల్లో తెలంగాణ ప్రభుత్వ విజన్ కు కింగ్స్ కాలేజ్ తోడ్పాటును అందిస్తుంది. 

ఈ సందర్భంగా కింగ్స్ కాలేజ్ లండన్ ప్రెసిడెంట్ & ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ షిట్జి కపూర్ మాట్లాడుతూ... టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాల్లో ఉన్నత విద్య అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తాజా ఒప్పందం దోహదపడుతుందన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన తమ యూనివర్సిటీ ఇప్పటికే ఇండియాలోని ప్రతిష్టాత్మక సంస్థలతో అకాడమిక్ అంశాల్లో కలిసి పనిచేస్తోందన్నారు. ముంబైలోని టాటా మోమోరియల్ సెంటర్ తో కలిసి ఆంథ్రోపాలజికల్  రీసెర్చ్ స్టడీ నిర్వహిస్తున్నామన్నారు. 

టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాల్లో ఉన్నత విద్య అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తాజా ఒప్పందం దోహద పడుతుందని కింగ్స్ కాలేజ్ లండన్ ప్రెసిడెంట్ & ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ షిట్జి కపూర్ అన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన తమ యూనివర్సిటీ ఇప్పటికే ఇండియాలోని ప్రతిష్టాత్మక సంస్థలతో అకాడమిక్ అంశాల్లో కలిసి పనిచేస్తోందని, ముంబైలోని టాటా మోమోరియల్ సెంటర్ తో కలిసి ఆంథ్రోపాలజికల్  రీసెర్చ్ స్టడీ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

భారత్, యూకే ఒప్పందాలు బలోపేతం..
ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్ తో తెలంగాణ ప్రభుత్వ ఒప్పందం భారత్, యూకే సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా మారబోతుందని, ఫార్మా సిటీ విజన్‌లో భాగంగానే  లైఫ్ సైన్సెస్ & ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు అని పేర్కొన్నారు.. తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఏకో సిస్టమ్ విలువ 50 బిలియన్ డాలర్ల కు చేరుతుందని దీమా వ్యక్తం చేశారు. ఫార్మా పరిశోధన, శిక్షణలో ప్రపంచంలోని అత్యంత్య నైపుణ్యం కల యూనివర్సిటీతో తమ ప్రభుత్వం కలిసి పనిచేయడంపై హర్షం వ్యక్తం చేశారు.  

కింగ్స్ కాలేజ్ , తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం యూకే, ఇండియా సంబంధాల్లో మైలురాయి అన్నారు యూకే గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ చాంపియన్ సర్ స్టీవ్ స్మిత్. తాజా ఒప్పందంతో ఫార్మా రంగంలో పరిశోధన, బోధన అంశాల్లో తెలంగాణకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం, సహకారం అందుతుందని చెప్పారు. 

కేటీఆర్ యూకే పర్యటన రెండో రోజు వివరాలు
మంత్రి కేటీఆర్ యూకే పర్యటన రెండో రోజు పలు కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. థామస్ లాయిడ్ గ్రూప్ ఎండి నందిత సెహగల్ తుల్లీ మరియు సీనియర్ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. పియర్సన్ కంపెనీ సీనియర్ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి కేటీఆర్, తెలంగాణలో నైపుణ్య శిక్షణ అభివృద్ధికి సంబంధించి చేపట్టిన పలు కార్యక్రమాల పైన వివరాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ - TASKతో పని చేసేందుకు రియల్ సంస్థ ముందుకు వచ్చిందన్నారు. . తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి ముందుకు వచ్చిన పియర్సన్ సంస్థకి ధన్యవాదాలు తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget