By: ABP Desam | Updated at : 16 Feb 2023 04:08 PM (IST)
Edited By: jyothi
జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాళ్లు బుకింగ్స్
GHMC Function Halls: హైదరాబాద్ లోని బల్దియా ఆధ్వర్యంలో ఉన్న మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్ల బుకింగ్స్ ను త్వరలో ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్సుల తరహాలో జీహెచ్ఎంసీ పోర్టల్ ద్వారానే ఫంక్షన్ హాళ్లను బుకింగ్ చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మాన్యువల్ గా జరుగుతున్న బుకింగ్ లతో నెలలో ఎన్ని రోజులు బుక్ అవుతున్నాయని, ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో ఉన్నతాధికారులకు తెలియడం లేదు. మరోవైపు జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాళ్లకు సైతం ఇతర ఫంక్షన్ హాళ్ల మాదిరిగా భారీ ఫీజులు వసూళ్లు చేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆన్ లైన్ బుకింగ్ సదుపాయం ద్వారా అవకతవకలకు తావుండదని.. పారదర్శకత ఉంటుందని భావించిన అధికారులు ఈ ఏర్పాట్లుకు సిద్ధం అయ్యారు. వచ్చే నెల నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయని జీహెచ్ఎంసీ అధికారులు వివరిస్తున్నారు. పోర్టల్ లో ఫంక్షన్ హాళ్ల అద్దె ధరలు, అందుబాటులో ఉన్నదీ, లేనిదీ తదితర వివరాలు తెలుసుకొని బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీలో 25 మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లకు రూ.95.70 కోట్లు ముంజూరై ఏళ్లు గడుస్తుండగా... ఇప్పటి వరకు 9 ఫంక్షన్ హాళ్ల నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. మరో 9 పురోగతిలో ఉన్నాయి. మిగతా ఏడు ఫంక్షన్ హాళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది.
పురోగతిలో ఉన్న ఫంక్షన్ హాళ్లు..
నిర్మాణం పూర్తయిన ఫంక్షన్ హాళ్లు
అయితే ఈ మల్లీ పర్పస్ ఫంక్షన్ హాళ్లను పుట్టిన రోజు వేడుకల నుంచి వివిధ రకాల శుభకార్యాలకు అద్దెకు ఇస్తారు. పెద్ద ఫంక్షన్ హాళ్ల ఖర్చులు భరించలేని వారికి సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ ఈ మల్టీపర్సస్ పఫంక్షన్ హాళ్లను అందుబాటులోకి తెస్తుంది. అయితే రాజకీయ సంబంధమైన, పార్టీలు, మతాలకు సంబంధమైన కార్యక్రమాలను ఈ ఫంక్షన్ హాళ్లలో అనుమతించరు. అలాగే రోజు మొత్తం కాకుండా షిఫ్టుల వారీగా తీసుకునే సదుపాయం ఉంది. అందుకు సగం ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. మొదటి షిఫ్టు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. రెండో షిఫ్టు 4.30 నుంచి రాత్రి 11.30 గంటల వరకు.
హాల్ విస్తీర్ణం బట్టి అద్దెలు..
Mulugu Crime News: లైంగిక వేధింపులు తాళలేక యువకుడిని చంపిన యువతి
మోదీ మిత్రుల ఖజానా నింపేందుకు పెట్రోల్ ధరల పెంపు- మంత్రి కేటీఆర్
Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు
సీతమ్మవారి పెండ్లికి వెండి పీతాంబరం పంపిన సిరిసిల్ల నేతన్న
Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు
Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
IPL 2023: ఐపీఎల్ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్ ఫొటో! మరి రోహిత్ ఎక్కడా?
తమిళనాడులో ‘పెరుగు’ రచ్చ - తమిళం స్థానంలో హిందీ, సీఎం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ
అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు