Free License Fairs: ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా - తెలంగాణలో యువతను ఆకర్షిస్తున్న రాజకీయ పార్టీలు
Free License Fairs: యువతను ఆకర్షించి వారికి ఉచిత డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నాయకులు వివిధ జిల్లాల్లో ‘ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా’ నిర్వహిస్తున్నారు.
Free Driving License Fairs: ఎన్నికల ముందు యువతను ఆకర్షించి వారికి ఉచిత డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించేందుకు రాష్ట్రం లోని బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నాయకులు వివిధ జిల్లాల్లో ‘ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా’ నిర్వహిస్తున్నారు. దీనివల్ల యువతకు నేరుగా ప్రయోజనం చేకూర్చడమే కాకుండా చట్టబద్ధంగా డ్రైవింగ్ లైసెన్స్‌లను పొందేలా ప్రోత్సహించడంతో పాటు సరైన పత్రాలు, ట్రాఫిక్ చలాన్ల నుండి తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ప్రమాదాలను నివారించడానికి ఇది దోహదపడుతుంది. అయితే హైదరాబాద్ నగరంలోని యువత జిల్లాలు, నియోజకవర్గాల్లోని అధికార పార్టీ నాయకులు ఈ ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాలను విస్తరిస్తే, లైసెన్స్ పొందిన డ్రైవర్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
డ్రైవింగ్ లైసెన్స్ ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే... అహ్మద్ అలీ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. డెలివరీ బాయ్ ఉద్యోగాని కోసం జొమాటోకు వెళ్ళాడు. డ్రైవింగ్ లైసెన్స్ లేనందున జొమాటో అతనిని తిరస్కరించింది. "ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు ఉచిత లైసెన్స్ మేళాలు ఏర్పాటు చేయడం ద్వారా యువకులు చట్టబద్ధంగా లైసెన్స్ లు పొందే అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ చేయడానికి వారి చట్టపరమైన అర్హత లభించడంతోపాటు భవిష్యత్తులో ట్రాఫిక్ చలాన్‌ల బారిన పడకుండా కాపాడుతుంది" అని చెప్పాడు. తన జిల్లాలో యువత దృష్టిని ఆకర్షించడానికి ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాను స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇటీవల ఉచిత లైసెన్స్ మేళాను నిర్వహించారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు కూడా తన ట్రస్ట్ ద్వారా ఉచిత డ్రైవింగ్ మేళాను నిర్వహించి యువతకు లైసెన్సులు అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఉచిత లైసెన్స్‌లను అందించడం వల్ల లైసెన్స్ పొందడం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రభుత్వం యువతలో అవగాహన కల్పించాలి. యువత డ్రైవింగ్ లైసెన్స్‌ను పొందడం వల్ల ప్రమాదాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. యువతలో ఉచిత లైసెన్స్ మేళాలు వివిధ జిల్లాల్లో చాలా ఆదరణ పొందుతున్నాయి. రాష్ట్రంలో చట్టపరమైన డ్రైవింగ్ పద్ధతులను ప్రోత్సహించడంతో పాటు రహదారి భద్రతకు భరోసా కల్పించే దిశగా దోహదపడనుంది.
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రాజకీయ నాయకులు, ప్రముఖులు పోటాపోటీగా ఎన్నికల ముందు యువతను ఆకర్షించేందుకు డ్రైవింగ్ లైసెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. యువత దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వాలు దీనిపై మరింత దృష్టి సారించి, అవగాహన కల్పిస్తే చాలా వరకు రోడ్డు ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. కొన్ని జిల్లాల్లో డ్రైవింగ్ లైసెన్స్ ల భారీగా దరఖాస్తులు తెలుస్తోంది. మరి కొన్ని చోట్ల తక్కువగా నమోదు అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు రాజకీయ నాయకులు తమ దృష్టి వైపు యువకులను ఆకర్షించడానికి ఇలాంటి మేళాలను ఏర్పాటు చేస్తున్నారు.
మొదట దుబ్బాకలో బీజేపీ ఈ ప్రోగ్రాం చేపట్టగా, వెంటనే తేరుకున్న బీఆర్ఎస్ సైతం అక్కడ యువతకు డ్రైవింగ్ లైసెన్స్ ఉచితంగా ఇప్పిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ డ్రైవ్ కొనసాగుతోంది. యువతను ఆకర్షించేందుకు, వారి వివరాలు సేకరించేందుకు సైతం ఫ్రీ డ్రైవింగ్ లైసెన్స్ తమకు మేలు చేస్తుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.