అన్వేషించండి

Ponguleti : రూ. వంద కూడా ఇవ్వలేదు - శ్రీరాముడ్నే కేసీఆర్ మభ్య పెట్టారు - మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు !

భద్రాద్రి రామయ్యకు కేసీఆర్ అన్యాయం చేశారని మాజీ ఎంపీ పొంగులేటి ఆరోపించారు.


Ponguleti :   భద్రాచలం రాముడ్ని కేసీఆర్ మోసం చేశారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.  ఎనిమిదిన్నరేళ్ళు గడిచినా భద్రాచల పుణ్యక్షేత్రం హుండీలో రూ.100 వేసిన పాపాన పోలేదన్నారు.  మైకు తీసుకుంటే ప్రజలను మభ్య పెట్టడంలో ఈ ముఖ్యమంత్రి దిట్ట... మాటలకే పరిమితం తప్ప... చేతలు అనేవి ఈ సీఎంలో లేవని విమర్శించారు. భద్రాచలం నియోజకవర్గంలో పర్యటించి.. తను చేరబోయే పార్టీ తరపున అభ్యర్థిగా తెల్లం వెంకట్రావును ప్రకటించారు. ఆయననే గెలిపించాలని ప్రజల్ని కోరారు. 

 తెలంగాణ బిడ్డలను అసత్యలతో కేసీఆర్ భ్రస్టు పట్టిస్తున్నారనేది నగ్న సత్యమన్నారు.    భద్రాచల పుణ్యక్షేత్రానికి వంద కోట్ల రూపాయల నిధులు ఇస్తానన్న మాట అటు ఉంచితే గడిచిన ఎనిమిదిన్నరేళ్ళలో వంద రూపాయలు కూడా హుండీలో వేసిన పాపాన పోలేదన్నారు. జెండా ఏదైనా ఎజెండా మాత్రం రాబోయే ఎన్నికల్లో సీఎం కేసిఆర్ ను గద్దె దించటమే తమ ఎజెండా అంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి భద్రాచలం ఆత్మీయ సమ్మేళనంలో నిప్పులు చెరిగారు.  ఆరు దశాబ్దాలు గా పోరాడి సంపాదించుకున్న రాష్ట్రం ఇప్పుడు సీఎం కేసిఆర్ వల్ల దగా పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

భద్రాచల నియోజకవర్గానికి వరద ముప్పు సమయంలో వేయి కోట్ల రూపాయలు నిధులు ఇస్తానని ప్రకటించి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. టీఎస్పీఎస్ఈ పేపర్ లీకేజీలో తెలంగాణ ప్రభుత్వ అధికారుల, ప్రజాప్రతినిధుల పాత్ర ఉందని ఆరోపించారు. ఈ తప్పిదానికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహిస్తూ పరీక్ష రాసిన ప్రతి నిరుద్యోగికి లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీళ్ళు, నిధులు, నియమాకాలన్ని కల్వకుంట్ల కుటుంబానికే చెందుతున్నాయి తప్పా అర్హులు అయిన ఏ ఒక్కరికి న్యాయం చేకూరలేదన్నారు. నియమాకాలకోసం పోరాడి సంపాదించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఇప్పుడు ఉద్యోగాలు లేక యువత దగా పడుతుందని ఆరోపించారు. 

రాష్ట్రాన్ని ఉద్దరించలేని ఈ సీఎం దేశాన్ని ఉద్దరిస్తాడట... అంటు ఎద్దేవా చేశారు. ఏళ్ళు గడుస్తున్న పోడు భూముల రైతుల సమస్యలకు పరిష్కారం చూపలేదని విమర్శించారు. ఒక్క పోడు భూమి పట్టాదారునికి కూడా పట్టా ఇచ్చిన దాఖలా లేదన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సిట్ కి కాకుండా సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జీచే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అతి త్వరలోనే తన జెండా ఎజెండాను ప్రకటిస్తానని జెండా ఏదైనా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రానివ్వకుండా ఇంటికి సాగనంపడమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ తెల్లం వెంకట్రావ్ బరిలో ఉంటారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మీ నియోజకవర్గ ప్రజలందరి దీవెనలతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం అంటూ పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. 

బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన పొంగులేటి ఇంత వరకూ ఏ పార్టీలో చేరలేదు. ఏ పార్టీలో చేరిన తన అనుచరులకు టిక్కెట్లు ఇప్పిస్తానని వారినే అభ్యర్థులుగా ప్రకటించి  ప్రచారం కూడా చేస్తున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget