Tummala in Congress : కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల - కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే !
బీఆర్ఎస్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరారు. ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Tummala in Congress : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. ఇవాళ ఉదయం బీఆర్ఎస్ పార్టీకి తుమ్మల రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపించారు. 'తెలంగాణ రాష్ట్ర సమితిలో సహకరించినందుకు ధన్యవాదములు. పార్టీకి నా రాజీనామాను సమర్పిస్తున్నాను' అంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తనకు బీఆర్ఎస్ టికెట్‌ను కేసీఆర్ ఇవ్వకపోవడంపై తుమ్మల తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన తుమ్మలకు ఇటీవల కేసీఆర్ హ్యాండిచ్చారు. బీఆర్ఎస్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల లిస్టులో తుమ్మల నాగేశ్వర్ రావుకు టికెట్ ఇవ్వకుండా కందాల ఉపేందర్ రెడ్డికి ఇచ్చారు. అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న తుమ్మల తన నియోజకవర్గంలోని అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఖచ్చితంగా ఖమ్మం ప్రజల కోసం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. మాటతప్పబోనని.. జిల్లా ప్రజల కోసం ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని చెప్పారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి తుమ్మల పోటీ చేసే అవకాశముందని సమాచారం. తుమ్మల గతంలో ప్రాతినిధ్యం వహించిన పాలేరు టికెట్ కోసం పొంగులేటి ఇప్పటికే దరఖాస్తు చేశారు. ఈ రెండు స్థానాల విషయంలో వీరిద్దరి మధ్య సర్దుబాటు చేసేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా తుమ్మలతోపాటు రాష్ట్రంలోని పలువురు మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. వీరిని ఈ నెల 17న తుక్కుగూడ సభా వేదికగా పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించినప్ప టికీ అనివార్య కారణాల వల్ల దానిని మార్చారని తెలిసింది. శని, ఆదివారాల్లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల విరామ సమయంలోనే వీరిని సోనియా, రాహుల్, ఖర్గే సమక్షంలో పార్టీలో చేర్చుకోవా లని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
తుమ్మల నాగేశ్వర్ రావు 1985,1994,1999,2009, టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014,లో బీఆర్ఎస్ లో చేరి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఓడిపోవడంతో పార్టీలో పక్కన పెట్టారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరిపోయారు.