అన్వేషించండి

Hyderabad News: కుమార్తెను కన్నతండ్రే కాటేశాడు - తప్పించుకునే క్రమంలో మరింత ప్రమాదంలోకి యువతి!

Telangana News: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే తన కుమార్తెను లైంగిక వేధింపులకు గురి చేస్తూ.. పలుమార్లు అత్యాచారం చేశాడు. హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Father Abused His Daughter in Hyderabad: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆ యువతి పాలిట మృగాడయ్యాడు. లైంగికంగా వేధిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. చివరికి భరించలేని బాధితురాలు, అమ్మా.. నన్ను నాన్న ఇలా చేస్తున్నాడంటూ తల్లికి చెప్పినా ఆమె పట్టించుకోలేదు. తండ్రిపై లేనిపోనివి చెప్పొద్దంటూ మందలించింది. ఇక దిక్కు తోచని స్థితిలో తండ్రి బారి నుంచి తప్పించుకునేందుకు ఆమె బయటకు రాగా.. అక్కడ కూడా మరో మృగాడు వేటాడాడు. తండ్రి నుంచి తప్పించుకునేందుకు ఆమె వేసిన అడుగులు మరింత ప్రమాదంలోకి నెట్టేశాయి. రైలులో పరిచయమైన ఓ యువకుడితో ప్రేమాయణం సాగినా, ఉపాధి ఆశతో మరో యువకుడి వెంట వెళ్లి మోసపోయింది. హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

పూర్తి వివరాలివే

బీహార్ కు చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం వలస వచ్చి కుత్బుల్లాపూర్ (Quthbullapur) లో నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. కుమార్తె (18) తొమ్మిదో తరగతి వరకూ చదువుకుంది. కుటుంబీకులు కరోనా కారణంగా చదువు మాన్పించడంతో ప్రస్తుతం ఆమె ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో కొంతకాలంగా తండ్రి లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పొద్దంటూ  కుమార్తెను బెదిరించాడు. అయితే, తండ్రి ఇలా చేస్తున్నాడంటూ కుమార్తె తన తల్లికి చెప్పగా ఆమె పట్టించుకోలేదు. తండ్రిపై లేనిపోనివి చెప్పొద్దంటూ కట్టడి చేసింది. దీంతో తండ్రి బారి నుంచి బయటపడాలని ఆమె అనుకుంది.

యువకుడితో పరిచయం

గతేడాది దీపావళికి వీరి కుటుంబం బీహార్ నుంచి నగరానికి  రైలులో వస్తున్న సమయంలో అదే రాష్ట్రానికి చెందిన సంతోష్ అనే యువకుడితో రైలులో ఆమెకు పరిచయం ఏర్పడింది. అదే సమయంలో ఇద్దరూ తమ సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను షేర్ చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఇద్దరూ ఇన్ స్టాలో చాట్ చేసుకునేవారు. ఈ క్రమంలోనే అతను బడంగ్ పేట గాంధీనగర్ (Gandhi Nagar)లో ఉన్నట్లు చెప్పాడు. పరిచయం కాస్త ప్రేమగా మారగా.. గత నెల 26న సంతోష్ కలవాలని కోరడంతో సదరు యువతి సికింద్రాబాద్ (Secunderabad) వెళ్లింది. ఇద్దరూ కలిసి ఎన్టీఆర్ గార్డెన్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో తిరిగారు. తర్వాత అతను కుత్బుల్లాపూర్ లోని ఆమె ఇంటి వద్దే యువతిని వదిలి వెళ్లిపోయాడు. చెప్పకుండా బయటకు వెళ్లినందుకు తనను కొడతారనే భయంతో ఆమె మళ్లీ తిరిగి సికింద్రాబాద్ స్టేషన్ కే వెళ్లిపోయింది. అక్కడ రవి అనే వ్యక్తి ఫోన్ తీసుకుని సంతోష్ కు కాల్ చేసింది. సంతోష్ ఆమెను తన ఇంటికి రమ్మని పిలిచాడు. రవి సాయంతో అతని ఇంటికి వెళ్లగా.. మరుసటి రోజు ఆమెను తన ఇంటికి వెళ్లిపోవాలని సంతోష్ చెప్పాడు. దీంతో వెంట వచ్చిన రవిని తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని యువతి అడిగింది. అతను సరేనంటూ అమీన్ పూర్ లోని తన గదికి తీసుకెళ్లాడు. రెండు రోజులు అక్కడే ఉన్న ఆమెపై గత నెల 29న మద్యం మత్తులో రవి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు మరుసటి రోజు కుటుంబీకులకు ఫోన్ చేసి సికింద్రాబాద్ స్టేషన్ కు రావాలని చెప్పింది. వారు అక్కడికి చేరుకున్న తర్వాత జరిగిన విషయాన్ని వివరించింది.

పోలీసులకు ఫిర్యాదు

దీంతో జరిగిన విషయాన్ని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిని ఆరా తీయగా.. రవితో పాటు తన తండ్రి చేసిన అఘాయిత్యంపై పోలీసులకు వివరించింది. దీంతో పోలీసులు రవితో పాటు బాధితురాలి తండ్రిపై కూడా అత్యాచారం కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ స్పెక్టర్ పవన్ తెలిపారు.

Also Read: Hyderabad News: ఘోర విషాదం - స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Shooting: వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
South Central Railway : ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
India Wedding Season: 44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
Raju Weds Rambai : హార్ట్ టచింగ్ 'రాజు వెడ్స్ రాంబాయి' - ఈ థియేటర్లలో ఫ్రీగా చూడొచ్చు
హార్ట్ టచింగ్ 'రాజు వెడ్స్ రాంబాయి' - ఈ థియేటర్లలో ఫ్రీగా చూడొచ్చు
Advertisement

వీడియోలు

South Africa whitewashed India | రెండో టెస్ట్ ఓడిపోయిన టీమ్ ఇండియా
Iceland Cricket Tweet on Gautam Gambhir | గంభీర్‌ను ట్రోల్ చేసిన ఐస్‌లాండ్ క్రికెట్
Ashwin Tweet on Ind vs SA Test Match | వైరల్ అవుతున్న అశ్విన్ పోస్ట్
Rohit as ambassador of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్‌ 2026 అంబాసిడర్‌గా రోహిత్
India vs South Africa Test Highlights | విజ‌యం దిశ‌గా సౌతాఫ్రికా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Shooting: వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
South Central Railway : ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
India Wedding Season: 44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
Raju Weds Rambai : హార్ట్ టచింగ్ 'రాజు వెడ్స్ రాంబాయి' - ఈ థియేటర్లలో ఫ్రీగా చూడొచ్చు
హార్ట్ టచింగ్ 'రాజు వెడ్స్ రాంబాయి' - ఈ థియేటర్లలో ఫ్రీగా చూడొచ్చు
Obesity Warning Signs : ఊబకాయం హెచ్చరిక సంకేతాలు.. బరువు పెరగడం నుంచి నిద్రలేమి వరకు.. జాగ్రత్త!
ఊబకాయం హెచ్చరిక సంకేతాలు.. బరువు పెరగడం నుంచి నిద్రలేమి వరకు.. జాగ్రత్త!
Thamma OTT: డిసెంబర్‌ మొదటి వారంలోకి ఓటీటీకి రష్మిక 'థామ'... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
డిసెంబర్‌ మొదటి వారంలోకి ఓటీటీకి రష్మిక 'థామ'... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Silver Benefits: వెండి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే బంగారం సంగతి మర్చిపోతారు!
వెండి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే బంగారం సంగతి మర్చిపోతారు!
December 2025: డిసెంబర్ 2025లో గ్రహాల భయంకర కదలిక! వాతావరణం, మార్కెట్, రాజకీయాల్లో పెను మార్పులు!
డిసెంబర్ 2025లో గ్రహాల భయంకర కదలిక! వాతావరణం, మార్కెట్, రాజకీయాల్లో పెను మార్పులు!
Embed widget