(Source: ECI/ABP News/ABP Majha)
BJP Etala : పార్టీ నిర్ణయాన్ని కాదని ఇండిపెండెంట్లకు మద్దతు ...తెలంగాణ బీజేపీలో ఈటల కలకలం !
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని బీజేపీ నిర్ణయం తీసుకుంది. కానీ ఈ నిర్ణయంతో విభేదించిన ఈటల రాజేందర్ ఇద్దర్ని బరిలో నిలబెట్టారు. ఇప్పుడీ అంశం బీజేపీలో కలకలం రేపుతోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఏకగ్రీవం అవకూడదని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇండిపెండెంట్లను నిలబెట్టానని ఈటల రాజేందర్ ప్రకటించడం ఇప్పుడు ఆ పార్టీలో కలకలం రేపుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదనేది బీజేపీ అధికారిక నిర్ణయం. అందుకే ఆ పార్టీ తరపున ఎవరూ నామినేషన్లు వేయలేదు. కానీ హఠాత్తుగా ఈటల రాజేందర్ తాను ఇద్దరు స్వతంత్రుల చేత నామినేషన్లు వేయించానని.. వారిని గెలిపించుకుంటానని ప్రకటించారు. అంతే కాదు ఎలాంటి ఎన్నిక అయినా టీఆర్ఎస్‌కు ఏకగ్రీవం అయ్యే చాన్స్ ఇవ్వకూడదన్నారు. దీంతో తెలంగాణ బీజేపీలో కొత్త చర్చ ప్రారంభమయింది.
Also Read : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !
కరీంనగర్ జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్‌ఎస్ ఓడిపోతుందని ఈటల జోస్యం చెప్పారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మేయర్ రవీందర్‌సింగ్ అక్కడ గెలవబోతున్నారని చెప్పారు. ఆయన నిన్నామొన్నటి వరకూ టీఆర్ఎస్‌లో ఉన్నారు. కానీ అనూహ్యంగా నామినేషన్ వేసి.. అజ్ఞాతంలోకి వెళ్లారు. తర్వాత టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఉద్యమకారులకు మేలు చేయడం లేదని రాజీనామా లే్ఖలో ఆరోపించారు. ఆయనకు ఈటల మద్దతు ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. అదే సమయంలో ఆదిలాబాద్‌లోనూ తానే స్వతంత్ర అభ్యర్థిని పోటీలో నిలిపినట్లు ఈటల తెలిపారు.
Also Read : తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవు దినాలు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
ఎన్నికల్లో పోటీ చేయొద్దన్న పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈటల వ్యవహరించారా అన్న చర్చ ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్‌లో జరుగుతోంది. ఈటల రాజేందర్ ఇటీవలే పార్టీలోకి వచ్చారు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తర్వాత హుజురాబాద్ ఉపఎన్నికల్లో విజయం సాధించారు. అయితే అక్కడ గెలుపు బీజేపీది కాదని ఈటలదేనన్న ఓ ప్రచారం జరిగింది. దీంతో ఈటల విషయంలో బీజేపీలో భిన్నాబిప్రాయాలు ఏర్పడ్డాయి. ఆయన దూకుడు కొంత మంది సీనియర్ నేతలకు నచ్చడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈటల సొంతంగా ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని నిలబెట్టడం చర్చనీయాంశం అవుతోంది.
Also Read: Telangana Devolopment : తెలంగాణ ఆదాయం అదుర్స్.. ఏడేళ్ల వృద్ధిపై ఆర్బీఐ లెక్కలు ఇవిగో..!
బీజేపీ జాతీయ పార్టీ. తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా ఎవరు ఎలాంటి అడుగులు వేసినా ఫిర్యాదులు వెళ్తాయి. వారిపై ఓ కన్నేసి ఉంచారు. ప్రస్తుతం ఈటల విషయంలోనూ ఇలాంటి ఫిర్యాదులు పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనను నియంత్రించేందుకు బీజేపీలో ఓ వర్గం రెడీగా ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈటలకు ఇక నుంచి గడ్డు పరిస్థితులు ఎతదురు కావొచ్చన్న అభిప్రాయం ప్రారంభమయింది.
Also Read : కేంద్రం వడ్లు కొనదు... రైతులు వరి పండించొద్దు.. మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటన
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి