అన్వేషించండి

Postal ballot: పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి వద్దే ఓటు - అర్హులు వీరే, ఎన్నికల సంఘం విస్తృత అవగాహన

Postal ballot: ఈసారి ఎన్నికల్లో 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతానికి మించి వైకల్యం కలిగి ఉన్న దివ్యాంగులకు సైతం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.

తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. ఓటర్లు తమ ఓటు హక్కు ప్రశాంతంగా  వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో ఓటర్లకు పోలింగ్ పై పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. అయితే, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, సర్వీసు ఓటర్లు (సాయుధ బలగాలు), ప్రవాస ఓటర్లు మాత్రమే ఇప్పటివరకూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేవారు. ఈసారి వృద్ధులు, దివ్యాంగులు సైతం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పిస్తూ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

వీరే అర్హులు

రానున్న ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులతో పాటు తాజాగా 13 రకాల అత్యవసర సేవల సిబ్బందికి సైతం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది ఈసీ. వీరందరూ ఇంటి వద్దే ఓటెయ్యొచ్చు. ఈ అవకాశాన్ని ఎక్కువ మంది ఉపయోగించుకునేలా ఎన్నికల అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మొత్తం 5 విభాగాల వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటెయ్యొచ్చు. వీరు తగిన ధ్రువ పత్రాలతో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి (RO) దరఖాస్తు చేసుకోవాలి.

  • సర్వీసు ఓటర్లు అంటే సైన్యంలో పని చేసే ఉద్యోగులు, ప్రత్యేక ఓటర్లు అంటే రాష్ట్రపతి, ఇతరత్రా కార్యాలయాల్లో పని చేసే స్థానికులు
  • పీడీ యాక్టు కింద అరెస్టైన వారు, ఎన్నికల విధుల్లోని ఉద్యోగులు, సిబ్బంది
  • నోటిఫైడ్ ఓటర్లుగా 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతానికి మించి వైకల్యం కలిగిన 21 రకాల దివ్యాంగులు ఉన్నారు. వీరికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. 

వీరి ఇళ్లకు బీఎల్ఓలు వచ్చి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి ఇష్టపడే వారికి ఫారం - 12డీ ఇస్తారు. అయితే, ఒకసారి పోస్టల్ బ్యాలెట్ ఓటుకు ఆర్వో ఆమోదం తెలిపితే, సంబంధిత ఓటరు ఇక పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి అవకాశం లేదని ఈసీ స్పష్టం చేసింది.

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఇలా

పోలింగ్ కు ముందు, ఏవేని 2 తేదీల్లో తపాలా ఓటు వేసేందుకు ఆర్వో అవకాశమిస్తారు. అనుకూలమైన రోజును ఓటరు ఎంచుకోవచ్చు. రాజకీయ పార్టీలకు ఆయా తేదీలు, సమయం, పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల వివరాలు చేరతాయి. అవసరం అనుకుంటే ఏజెంట్లు కూడా రావొచ్చు. ఈ తతంగాన్నంతా వీడియోలో చిత్రీకరిస్తారు. ఓటరు ఇంట్లోనే పోలింగ్ కంపార్ట్ మెంట్ ఏర్పాటు చేసి, బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఎవరికీ కనిపించకుండా ఓటరు నచ్చిన అభ్యర్థికి ఓటు వేశాక ఆ బ్యాలెట్ పేపర్ ను చిన్నపాటి కవరు(ఫారం - 13సీ)లో ఉంచి సీల్ వేసి ఎన్నికల అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. తాము ఓటు వేసినట్లు ధ్రువీకరణ పత్రం (ఫారం - 13ఏ)పై ఓటరు సంతకం చేయాలి. ఈ రెండింటినీ ఎన్నికల అధికారి మరో కవరులో (ఫారం - 13సీ) పెట్టి ఓటరు సమక్షంలోనే సీల్ చేస్తారు. ఇలా సేకరించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సాయంత్రం రిటర్నింగ్ అధికారికి చేరుతాయి.

నోటిఫైడ్ ఓటర్ల జాబితా విస్తరణ

ఎన్నికల సంఘం ఈసారి నోటిఫైడ్ ఓటర్ల జాబితాను తాజాగా విస్తరించింది. ఈ జాబితాలో ఎన్నికల విధుల కారణంగా ఓటు వేయలేకపోయే అత్యవసర సేవల ఉద్యోగులకు తాజాగా స్థానం కల్పించింది. ఇటీవల కర్ణాటక ఎన్నికల టైంలో దేశంలోనే తొలిసారిగా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI), దూరదర్శన్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB), ఆల్ ఇండియా రేడియో (AIR), BSNL, భారతీయ రైల్వే, ఆర్టీసీ, విద్యుత్, ఆరోగ్యం - కుటుంబ సంక్షేమం, ఆహారం, పౌర సరఫరాలు, అగ్నిమాపక శాఖలు, కేంద్ర ఎన్నికల సంఘం ధ్రువీకరించే జర్నలిస్టులను ఈ విభాగంలో చేర్చారు. ఆయా సంస్థలు రిటర్నింగ్ అధికారుల ద్వారా ఉద్యోగులకు ఫారం - 12డీ ఇప్పింది, పోస్టల్ బ్యాలెట్ ఓటు సదుపాయాన్ని కల్పించొచ్చని ఈసీ అధికారులు స్పష్టం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
HYDRA Ranganath: హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Nara Rohith Birthday: హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
Brazil Match Kolkata: ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
Embed widget