IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB
IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
TBC
TBC

Huzurabad By Election: దమ్ముంటే ఆ పని చేయండి.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు ఈటల సవాల్

అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందిన ఈటల మళ్లీ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రి హరీశ్ రావుపై ఈటల రాజేందర్ కాస్త తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

FOLLOW US: 

హుజూరాబాద్‌లో గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రచారం సాగుతోంది. ఇటీవల అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొంది మళ్లీ ఆయన తన నియోజకవర్గంలో ప్రజల మధ్యలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రి హరీశ్ రావుపై ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను దిక్కులేని వాణ్ని కానని, హుజూరాబాద్ ప్రజల్లో ఉన్నానని వ్యాఖ్యానించారు. దమ్ముంటే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులలో ఎవరైనా ఒకరు తనపై పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు. తనను ఓడించేందుకు రూ.5 వేల కోట్లైనా ఖర్చుపెడతారని ఈటల ఆరోపించారు. ఎవరు గెలుస్తారో వచ్చే ఉప ఎన్నికల్లో చూసుకుందామంటూ సవాలు విసిరారు. తన విజయాన్ని ఎవరూ ఆపలేరని ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.  

‘‘నేను దిక్కులేని వాడ్ని కాదు. హుజూరాబాద్ ప్రజల హృదయాల్లో ఉన్న బిడ్డను. నేను ప్రజల గుండెల్లోనే ఉన్నా. హుజూరాబాద్‌లో నన్ను ఓడించేందుకు రూ.5 వేల కోట్లయినా ఖర్చు పెడతరంట. రేపు ఎన్నికల్లో చూసుకుందాం. కేసీఆర్‌, హరీశ్ రావుకు ఇదే నా సవాలు. దమ్ముంటే నా మీద పోటీ చేసి మీరు గెలవండి. పదేసి లక్షల రూపాయలు దళిత బంధు ఇచ్చినా, గొర్రెలిచ్చినా, కులాలవారిగా తాయిలాలిచ్చినా.. నేనే వాళ్ల గుండెల్లో ఎప్పటికీ ఉంటా.. ఎమైతదో ఎన్నికల తర్వాత చూసుకుందాం.’’ అని టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలపై ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

‘‘గతంలో ఏనాడు ఈ నియోజవర్గంలో కనిపించని మంత్రులు ఇప్పుడు ఎందుకు వస్తున్నట్లు. వాళ్ల ప్రేమంతా మీ ఓట్లపైనే. నన్ను కాపాడుకుంటరో.. చంపుకుంటరో ఇక మీ ఇష్టం.” అంటూ ఈటల రాజేందర్ హుజూరాబాద్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ఎక్కడ కష్టం ఉంటే తాను అక్కడ ఉన్నానని ఈటల గుర్తు చేసుకున్నారు. కేసీఆర్‌కు దళితుల ఓట్లపై తప్ప.. హుజూరాబాద్ దళితులపై అసలు ప్రేమ లేనే లేదని ఈటల అన్నారు. ‘‘హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు వాటిలో గెలిచేందుకు వరద సాయం కింద ఇంటికి రూ.10 వేలు ఇస్తామన్నారు. ఓట్లయ్యాక ఆ హామీనే మర్చిపోయారు.’’ అని ఈటల విమర్శించారు. టీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే ప్రలోభాలు ఆపేసి, పోలీసులను వెనక్కి రప్పించి నిజాయతీగా ఎన్నికల్లో గెలవాలని సవాలు విసిరారు. ‘‘టీఆర్ఎస్ వాళ్లతో జాగ్రత్తగా ఉండండి. ఏమిచ్చినా తీసుకోండి. ఓటు మాత్రం పువ్వు గుర్తుకు వేయండి.” అని ఈటల రాజేందర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

Also Read: Komatireddy Venkat Reddy Update: మా పదవులకు రాజీనామా చేస్తాం, ఇక పోటీ చేయం.. బాండ్ రాసిస్తా: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Also Read: Narayanpet Violence: మహిళకు ఫుల్లుగా మద్యం తాగించారు.. ఆపై ఊహించని దారుణం..

Published at : 08 Aug 2021 05:27 PM (IST) Tags: huzurabad news Eatala Rajender TRS Party news Minister Harish Rao Huzurabad By Election

సంబంధిత కథనాలు

AP Telangana Breaking News Live: జమ్ముకశ్మీర్‌ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌కు జీవిత ఖైదు

AP Telangana Breaking News Live: జమ్ముకశ్మీర్‌ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌కు జీవిత ఖైదు

Fish Prasadam: ఆస్తమా పేషెంట్లకు చేదువార్త, ఈ ఏడాది సైతం చేప ప్రసాదం పంపిణీ లేదు - హైదరాబాద్‌కు రావొద్దని సూచన

Fish Prasadam: ఆస్తమా పేషెంట్లకు చేదువార్త, ఈ ఏడాది సైతం చేప ప్రసాదం పంపిణీ లేదు - హైదరాబాద్‌కు రావొద్దని సూచన

Narayana On Amalapuram: అమలాపురం విధ్వంసం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం

Narayana On Amalapuram: అమలాపురం విధ్వంసం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం

KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా

KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా

Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్‌లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ

Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్‌లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Yasin Malik Case Verdict:కశ్మీర్ వేర్పాటువేద నేత యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు

Yasin Malik Case Verdict:కశ్మీర్ వేర్పాటువేద నేత యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు

AP As YSR Pradesh : వైఎస్ఆర్‌ ప్రదేశ్‌గా ఏపీ - సీఎం జగన్‌కు సలహా ఇచ్చిన రిటైర్డ్ ఐపీఎస్ !

AP As YSR Pradesh :   వైఎస్ఆర్‌ ప్రదేశ్‌గా ఏపీ - సీఎం జగన్‌కు సలహా ఇచ్చిన రిటైర్డ్ ఐపీఎస్ !

Karan Johar New Movie: రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ - 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2'  విజయాలే కారణమా?

Karan Johar New Movie: రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ - 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2'  విజయాలే కారణమా?