ID Cards for Polling: ఓటు వేసేందుకు ఏదైనా ఒక ఐడీ కార్డు ఉంటే చాలు, పోలింగ్ కేంద్రాలకు అలా వెళ్లకూడదు
Alternative Documents to prove your Identity at Polling Station: ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పోలింగ్ కేంద్రం వద్దకు ఓటర్లు ఎలా రావాలి అని రూల్స్ పాటించాలి.
Telangana Election 2023: తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 నియోజకవర్గాలకు నవంబర్ 30వ తేదీన ఎన్నికల కమిషన్ పోలింగ్ నిర్వహిస్తోంది. అందుకు తగిన అన్ని ఏర్పాట్లు చేసింది. నవంబర్ 30వ తేదీన ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల ముగియనుంది. అయితే 5లోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. అయితే ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పోలింగ్ కేంద్రం వద్దకు ఓటర్లు ఎలా రావాలి, ఏం ధరించకూడదు అని ఎన్నికల రూల్స్ మనం తప్పనిసరిగా పాటించాలి.
పోలింగ్ కేంద్రానికి వెళ్లేవారు పార్టీలకు సంబంధించిన ఎన్నికల గుర్తులు ప్రదర్శించకూడదు. పార్టీల గుర్తులు కలిగి ఉండే దుస్తులు ధరించరాదు. పార్టీల రంగును సూచించే దుస్తులు సైతం వేసుకోకూడదు. టోపీలు ధరించకూడదు. మొబైల్ ఫోన్లు, కెమెరాలు, ఇతర గాడ్జెట్లను పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించరు. పార్టీల గుర్తులను సైతం చూపించడం లాంటి పనులు చేయకూడదు. ఓటు వేయడానికి వెళ్లేవారు ఏదైనా ఒక గుర్తింపు కార్డును పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలని ఈసీ సూచించింది. ఫొటో ఓటరు స్లిప్ ఓటింగ్ కోసం అవసరమయ్యే గుర్తింపు డాక్యుమెంట్ గా పరిగణించరు. ఓటర్లు దిగువ పేర్కొన్న గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి తీసుకెళితే చాలు.
(Voters can carry any of the below mentioned recognized ID cards for polling) ఏదైనా ఒక్క గుర్తింపు కార్డు మీతో ఉండాలి..
EPIC (ఓటర్ ID కార్డ్)
పాస్ పోర్ట్
డ్రైవింగ్ లైసెన్స్
పాన్ కార్డ్
ఆధార్ కార్డ్
NPR కింద RGI జారీ చేసిన స్మార్ట్ కార్డ్
MNREGA జాబ్ కార్డ్ (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ)
మీ ఫొటో కనిపించే పెన్షన్ డాక్యుమెంట్
బ్యాంక్/పోస్టాఫీసు జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్‌బుక్‌లు
కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/పీఎస్‌యూలు/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల ద్వారా ఉద్యోగులకు జారీ చేసిన ఫొటోతో కూడిన ఐడీ కార్డులు
కార్మిక మంత్రిత్వ శాఖ పథకం కింద జారీ అయిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్
ఎంపీలు/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు
సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: సీఈవో వికాస్ రాజ్..
నవంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజున అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ (Telangana CEO Vikas Raj) సూచించారు. ఎన్నికలు జరిగే రోజున తెలంగాణలోని అన్ని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని సీఈవో వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆ కంపెనీలు హాలిడే ప్రకటించాలన్నారు. సెలవు ఇవ్వని సంస్థలు, కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబరు 29, 30 తేదీల్లో పాఠశాలలకు (school holidays) ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply