Adilabad News: పుట్టిన నెలకే తల్లిని కోల్పోయిన చిన్నారి - ఆకలి తీరుస్తున్న ఆవు - ఈ గిరిజన శిశువుకు ఎన్ని కష్టాలో
Baby Milk: తల్లిని కోల్పోయిన శిశువుకు పాల కోసం ఆవును ఇచ్చారు దాతలు. మరుమూల అటవీ ప్రాంతంలో ఆకలితో అలమటించే శిశువు ఆకలి తీర్చారు.

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలోని మరుమూల గ్రామం. నిరుపేదల కుటుంబం. ఆ ఇంట్లో నెల రోజుల కిందట ఆడపిల్ల పుట్టింది. కానీ అనారోగ్యంతో తల్లి చనిపోయింది. ఆ పాప ఆకలితో ఏడుస్తూంటే పాలు ఎలా పట్టాలో తెలియక ఆ కుటుంబం విలవిల్లాడింది. కానీ దాతలు ఓ అవును ఆ కుటుంబానికి ఇచ్చారు.
ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తిప్పా కోలాంగూడ గ్రామంలో ఓ కుటుంబానికి నెలరోజుల పసిపాప సంరక్షణ భారంగా మారింది. అదే గ్రామంలో మినీ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న ఆత్రం రాణిబాయి (34) గత ఏప్రిల్ 18న అదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం గ్రామానికీ వెళ్ళింది. ఇటీవల అనారోగ్యానికి గురై ఈ నెల 15న ఆమే మృతి చెందింది. నెల రోజుల బాలింత మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమె భర్త కృష్ణ, ఆయన తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
వ్యవసాయమే ఆధారంగా జీవించే కృష్ణ ప్రస్తుతం ఆ పసిపాపకు డబ్బా పాలు తీసుకొచ్చేందుకు నానా తిప్పలు పడాల్సి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో తిప్పా కోలాంగూడ గ్రామం ఉంది. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. వ్యవసాయంలో ఏమీ పంట లేదు. బ్రతుకుడు భారంగా మారింది. ఆతన పాప భవితవ్యంపై ఆందోళన చెందుతున్నాడు. పాపను ప్రస్తుతం తిప్ప గ్రామంలోనే తన అమ్మ భూరిబాయి చూసుకుంటోంది. నానమ్మ భురిబాయి పాప ఆలనా పాలనా చూసుకుంటోంది. తండ్రి క్రిష్ణ ఎదైనా పని కోసం వెళ్ళాలన్న కృష్ణ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండడంతో పాప సంరక్షణ కొంత కష్టంగా మారింది.
ఆకలి తీర్చేందుకు తండ్రి పడే కష్టాల గురించి.. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకొని రెండు రోజుల క్రితం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరిబాయి.. పసిపాప పాలకోసం పడే కష్టాలను చూసీ.. చలించి.. ఆ పసిపాప ఆకలి తీర్చేందుకు ఓ పాలిచ్చే ఆవును అందజేశారు. తండ్రి ఆత్రం కృష్ణ, తాత నానమ్మలు ఆత్రం కటోడ-బూరిబాయిలకు మంగళవారం పాలిచ్చే ఆవును వారికీ అందజేశారు. పాప గోస, కుటుంబ సభ్యుల గోస చూసీ పాప ఆకలి తీర్చేందుకు తన ఆధ్వర్యంలో ఆవును అందించడం జరిగిందన్నారు. నెల రోజుల్లోనే పసికందు తల్లికి దూరమవ్వడం చాలా బాధాకరమని అన్నారు. మానవతా దృక్పధంతో స్పందించి పసిపాప పాలకోసం ఆవుని అందించిన మహిళ కమిషన్ సభ్యురాలు ఈశ్వరిబాయికి పాప కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. మానవసేవే మాధవసేవా అనీ ఇలా ఆపదలో ఉన్న వారికి ప్రతి ఒక్కరూ అండగా నిలిచి ఆదుకోవాలన్నారు.





















