అన్వేషించండి

Sirpurkar Commission Report: దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకమా - కేసుపై సంచలన విషయాలు వెల్లడించిన సిర్పూర్కర్ రిపోర్ట్‌లో ఏముందంటే !

Sirpurkar Commission Report: దిశా కేసులో నిందితుల ఎన్ కౌంటర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన సిర్పూర్కర్ కమిషన్ నివేదికను సర్వోన్నత న్యాయస్థానికి సమర్పించింది. రిపోర్ట్‌లో పేర్కొన్న వివరాలు ఇవే.

Disha Rape and Murder Case: దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme Court) నియమించిన సిర్పూర్కర్ కమిషన్ నివేదిక (Sirpurkar Commission Report) ను సర్వోన్నత న్యాయస్థానికి సమర్పించింది.  అసలు ఆ రిపోర్ట్ లో ఏముంది. మూకదాడి ఎంత అంగీకారం కాదో... చట్ట విరుద్దంగా లేదా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సత్వర న్యాయం చేయాలి అనే భావన కూడా కరెక్ట్ కాదు. విచారణ జరగాలి. సమన్యాయం చేయాలి. చట్ట ప్రకారమే నిందితులకు శిక్షలు పడాలి. ఇదీ జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ దిశ నిందితుల ఎన్ కౌంటర్ దర్యాప్తు నివేదికలో సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.

బూటకపు ఎన్ కౌంటరా !
దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ బూటకపు ఎన్ కౌంటరా.... ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ప్రశ్న. ఎందుకంటే దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసిన ఘటనపై సుప్రీం కోర్టు నియమించిన సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికను సర్వోన్నత న్యాయనస్థానం సుప్రీంకోర్టు బయటపెట్టింది. కేసును తదుపరి హైకోర్టు విచారణ చేస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు కమిషన్ నివేదకగా ఆధారంగా ఎన్ కౌంటర్ వ్యవహారంపై తేల్చాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. మరోసారి కమిషన్ నివేదికపై పరిశీలన అవసరం లేదని కూడా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ (CJI NV Ramana) నేతృత్వంలోని ధర్మాసం కీలక నిర్ణయం వెల్లడించింది.

జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ దర్యాప్తులో వెల్లడైన కీలక అంశాలు ఇవే..
దిశ హత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న  ఎన్ కౌంటర్ జరిగిన రోజు నుంచి కమిషన్ దర్యాప్తులో వెల్లడైన అంశాలు పరిశీలిస్తే.. నిందితులు దాడి చేస్తుంటే ఆత్మరక్షణ కోసం పోలీసులు... సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, శంషాబాద్ మాజీ డీసీపీ ప్రకాష్ రెడ్డి, షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ ఆదేశాలతో డిసెంబర్ 6, 2019న ఎన్ కౌంటర్ జరిగింది.

అయితే ఈ ఎన్ కౌంటర్ బూటకమంటూ  నిందితుల కుటుంబసభ్యులు కొన్ని పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలుచేశారు. వాటిని విచారించిన సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల కమిషన్‌ను నియమించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్డి జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్, జస్టిస్ రేఖా సుందర్, సీబీఐ మాజీ డైరెక్టర్ డీఆర్ కార్తికేయన్‌లను కమిషన్‌లో సభ్యులుగా సుప్రీంకోర్టు నియమించింది. ఈ కమిషన్‌ను సుప్రీంకోర్టు డిసెంబర్ 12, 2019న నియమించింది. అంటే ఎన్ కౌంటర్ జరిగిన ఆరు రోజులకే ఈ దర్యాప్తు కమిషన్ ఏర్పాటైంది. ఆరునెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించినా దాన్ని మరో మూడుసార్లు పొడిగించింది. దర్యాప్తులో భాగంగా తెలంగాణ హైకోర్టు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (National Human Rights Commission) లో ఉన్న కేసులను కూడా పరిగణనలోకి తీసుకోమని ఆదేశాలు ఇచ్చింది. కమిషన్ నివేదిక ఇచ్చేవరకూ ఈ కేసులో ఇంకెవ్వరూ జోక్యం చేసుకోకూడదని కూడా సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది.

అది ఫేక్ ఎన్ కౌంటర్ ఆ లేదా పోలీసులు చెబుతున్నది నిజమా.. నిజానిజాలు తేల్చటానికి ఈ కమిషన్ పని ప్రారంభించింది. 47 రోజుల పాటు వాదనలు విన్న కమిషన్.. 57 మందిని సాక్షులను విచారించింది. ఎన్‌కౌంటర్ ముందు రోజు అంటే డిసెంబర్ 5, 2019 డేట్ తో సంబంధం ఉన్న అన్ని అంశాలను కమిషన్ పరిశీలించింది. వేరియస్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఇన్విస్టెగేషన్ రికార్డులు, ఫోరెన్సిక్ అండ్ పోస్ట్ మార్టం రిపోర్టులు, ఫోటో గ్రాఫ్స్ వీడియోస్ అన్నింటినీ పరిశీలిస్తూ నివేదికను తయారు చేసింది. 

కమిషన్ రిపోర్ట్‌లో తేలిన విషయాలు ఏంటంటే... 
దిశ నిందితులపై ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపినట్లు కమిషన్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. కమిషన్ అభిప్రాయం ప్రకారం నిందితులను చంపేయాలనే ఉద్దేశంతోనే పోలీసులు ఉన్నట్లు రిపోర్ట్ చెబుతోంది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం దగ్గర నుంచి మిగిలిన దర్యాప్తు విషయంలో జరిగిన ఆలస్యానికి పోలీసులు కారణాలు చెప్పలేదు. ఎన్ కౌంటర్ పై ఏమని చెప్పాలనే పోలీసుల్లో చర్చలు జరిగినట్లు కమిషన్ దృష్టికి వచ్చింది. అసలు నిందితులపై దర్యాప్తు ప్రారంభించటంలోనూ సరైన ఆలోచన లేదు. కేసు సంబంధించినంత వరకూ ఏ విషయంలోనూ నిలకడ లేదని కమిషన్ పేర్కొంది. 

ఎన్ కౌంటర్ చేసిన తర్వాత జరగాల్సిన ప్రొసీజర్స్ లోనూ చాలా లాప్సెస్ ఉన్నాయి. ఎన్ కౌంటర్‌లో వాడిన పిస్తోళ్లు వాటికి సంబంధించిన వివరాలు సరిగా లేవు. పంచనామాకు, పోలీసులు ఇచ్చిన రిపోర్టుకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. హత్యాచారానికి గురైన దిశకు సంబంధించిన వస్తువులను కూడా సీజ్ చేయటంలో వ్యత్యాసం ఉంది. సీసీటీవీ ఫుటేజ్‌ను కమిషన్ కు ఇవ్వలేదు.
అంతే కాదు అన్ని చోట్లా సీసీ టీవీ కెమెరాలున్నాయి అని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. సైంటిఫిక్ ఎవిడెన్స్‌తోనే నిందితులు పట్టుకున్నామని అప్పట్లో పోలీసులు కూడా చెప్పారు. అదే ఎన్‌కౌంటర్ దర్యాప్తులో మాత్రం అలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్‌ను పోలీసులు సమర్పించలేకపోయారని కమిషన్ పేర్కొంది. 

సేఫ్ హోస్ అనేది నిజం కాదా ?
ఎన్‌కౌంటర్ విట్ నెస్‌‌లుగా ఉన్న పదిమంది పోలీసు అధికారులు కూడా వాళ్ల స్టేట్మెంట్స్ కూడా సరిగా రికార్డవలేదని కమిషన్ దృష్టికి వచ్చింది. కేవలం తప్పుడు దర్యాప్తు చేయటమే కాదు ఆధారాలు దొరక్కుండా కూడా చేసి దర్యాప్తునకు ఆస్కారమే లేకుండా చేశారని కమిషన్ భావిస్తున్నట్లు నివేదికలో రాసింది. ఎన్ కౌంటర్‌లో నిందితులందరినీ సేఫ్ హౌస్ లో పెట్టామని కమిషన్ కు చెప్పారు. దానికి రెంట్ కట్టామని కూడా రాశారు. సీన్ రికనస్ట్రక్షన్ కోసమే దిశను హత్యాచారం చేసిన స్పాట్‌కు తీసుకెళ్లామని చెప్పారు. కానీ అందుకు సంబంధించిన ఆధారాలు లేవు. సో సేఫ్ హోస్ లో పెట్టాం అని పోలీసులు చెబుతున్న విషయాలు అవాస్తమని కమిషన్ తేల్చింది.

దిశకు సంబంధించిన వస్తువులను కనిపెట్టేందుకు నిందితులను తీసుకువచ్చారు. ఫస్ట్ కన్ఫెషన్ లో ఆర్టికల్స్ అన్నీ పొదల్లో దొరికాయి అని చెప్పారు. సెకండ్ కన్పెషన్ లో కరెంట్ పోల్ దగ్గర దొరికాయన్నారు. ప్రెస్ మీట్ లో అప్పటి కమిషనర్ సజ్జనార్ కూడా పొదల్లోనే ఉన్నాయన్నారు. మళ్లీ కమిషన్ అడిగినప్పుడు అసలు ఆ విషయం తప్పని సజ్జనార్ అన్నట్లు కమిషన్ దర్యాప్తు నివేదికలో తెలిపింది.

దిశకు సంబంధించిన వస్తువులు ఏవైతే దొరికాయో... ఐడింటిఫై చేసేందుకు ఫ్యామిలీ మెంబర్స్‌ను పిలవలేదు. వాళ్లకి చూపించలేదు. ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ కు కూడా పంపించలేదు. మట్టి కొట్టి పిస్తోళ్లు లాక్కునేందుకు నిందితులు ప్రయత్నించారని పోలీసులు చెప్పారు. కానీ ఇంత మంది సాయుధులైన పోలీసులు ఉన్నప్పుడు నిందితులు ఇలా ఎందుకు చేస్తారో అర్థం కాలేదని కమిషన్ తెలిపింది. 

నిజంగానే మట్టి కొట్టారా, అక్కడ సాధ్యమేనా !
పైగా ఎన్‌కౌంటర్ జరిగిన సీన్‌లో మొత్తం పచ్చగడ్డి ఉంది అసలు పచ్చగడ్డి అంత ఉన్న చోట మట్టిని లాగటం ఎంత కష్టం. అది కూడా పదకొండు మంది పోలీసుల కళ్లల్లో కొట్టేంత మట్టి లాగటం అనేది అసలు అసంబద్ధమైన విషయమని కమిషన్ తేల్చింది. ఇద్దరు పోలీసులు ఇంజ్యూర్ అయ్యారు అని ప్రెస్ మీట్ లో చెప్పారు. కానీ వాళ్లను కూడా ఎన్ కౌంటర్ సాక్షుల్లో పెట్టారు. పోలీసుల మీద కాల్పులు జరిపారు అనేది నమ్మటానికి వీల్లేకుండా ఉంది. 41 రౌండ్లు ఫైర్ చేశామని పోలీసులు చెబుతున్నారు. కానీ దానికి సంబంధించిన ఆనవాళ్లు దొరకలేదని కమిషన్ చెప్పింది. ఇవన్నీ విచారించిన తర్వాత పోలీసులు ఆత్మరక్షణ కోసమే ఎన్ కౌంటర్ చేశారని కమిషన్ నమ్మటం లేదని నివేదికలో పేర్కొన్నారు. కనుక సేఫ్ హౌస్ అని పోలీసులు చెబుతున్న ఏరియా నుంచి చటాన్ పల్లిలో ఎన్ కౌంటర్ జరిగిన స్పాట్ వరకూ పోలీసులు చెబుతున్న ఘటనలన్నీ బూటకం అని కమిషన్ భావిస్తోందని నివేదికలో పేర్కొంది. 

సీసీటీవీ కెమెరాలు, పోస్ట్ మార్టానికి సంబంధించిన ఆధారాలు, క్రైమ్ సీన్‌కు సంబంధించిన అంశాలన్నీ కమిషన్ ముందు పోలీసులు దాచిపెట్టే ప్రయత్నం చేసినట్లు కమిషన్‌కు నమ్మకముందన్నారు. నిందితులు ప్రాణాలతో ఉండకూడదని పోలీసులు బలంగా భావించినట్లు కమిషన్ అభిప్రాయపడింది. నలుగురు నిందితుల్లో ముగ్గురు నిందితులు మైనర్లని కమిషన్ నిర్థారించింది. ఇక్కడే ఇంకో విషయం ఏంటంటే... దిశ ఇన్సిడెంట్ జరిగిన మూడు రోజుల తర్వాత నిందితుల్లో ఇద్దరు చదువుకుంటున్న స్కూల్ హెడ్మాస్టర్‌కు ఎంఈవో నుంచి ఫోన్ కాల్ వెళ్లింది. పోలీసులు వస్తారు నిందితుల వయస్సుకు సంబంధించి ఆధారాలు చూపించండి అని. ఈ విషయం కూడా కమిషన్ దర్యాప్తులో వెల్లడైంది పోలీసులకు నిందితుల్లో ఇద్దరు మైనర్లు అని తెలిసినా దాన్ని కప్పిపెట్టేందుకు ప్రయత్నించారని కమిషన్ నమ్ముతోందని రాశారు. అసలు దిశ హత్యాచార ఘటనల్లో నిందితులు మైనర్లు కాదు అని నమ్మించేందుకు వాళ్ల వయస్సును దాచి పెట్టేందుకు యత్నించారని కమిషన్ నమ్ముతున్నట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది.

సిర్పూర్కర్ కమిషన్ రిపోర్టును బయటపెట్టాలని ఆదేశించింది. కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతే కాదు మళ్లీ ఈ రిపోర్టు విషయంలో ఎవరూ పరిశీలన చేయాల్సిన అవసరం లేదని కూడా తేల్చింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Vangalapudi Anitha: 'సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం' - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
'సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం' - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP DesamUSA White House Special Features | వైట్ హౌస్ గురించి ఈ సంగతులు మీకు తెలుసా..? | ABP DesamUS Election Results 5 Reasons for Kamala Harris Defeat

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Vangalapudi Anitha: 'సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం' - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
'సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం' - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Mancherial News: మద్యం తాగి వాహనం నడుపుతున్నారా? - ఇకపై ఆస్పత్రిలో శుభ్రత పనులు చేయాల్సిందే!, మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు
మద్యం తాగి వాహనం నడుపుతున్నారా? - ఇకపై ఆస్పత్రిలో శుభ్రత పనులు చేయాల్సిందే!, మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు
Ghaati Glimpse: తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
YS Sharmila: 'సోషల్ మీడియా బాధితుల్లో నేనూ ఉన్నా' - తాను వైఎస్‌కే పుట్టలేదని అవమానించారంటూ షర్మిల సంచలన ట్వీట్
'సోషల్ మీడియా బాధితుల్లో నేనూ ఉన్నా' - తాను వైఎస్‌కే పుట్టలేదని అవమానించారంటూ షర్మిల సంచలన ట్వీట్
Embed widget