News
News
వీడియోలు ఆటలు
X

తెలంగాణలో కామ్రెడ్లు కలిసిపోయారా? BRSతో పొత్తు, సీట్ల పంపకాలే కీలకం!

రెండు ఎర్రజెండాలు గులాబీ జెండాకు జై కొడుతున్నాయా?

కాషాయానికి వ్యతిరేకంగానే కామ్రెడ్లు ఈ నిర్ణయం తీసుకున్నారా?

FOLLOW US: 
Share:

సీపీఐ, సీపీఎం మధ్య అవగాహన కుదిరిందా? భవిష్యత్‌లో ఆ రెండు పార్టీలు కలసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయా? రెండు ఎర్రజెండాలు కలిసి తెలంగాణలో గులాబీ జెండాకు జై కొడుతున్నాయా? కాషాయానికి వ్యతిరేకంగానే కామ్రెడ్లు ఈ నిర్ణయం తీసుకున్నారా? బీఆర్ఎస్‌తో పొత్తు, సీట్ల ఒడంబడికలే కీలకంగా మారనున్నాయా? ఏప్రిల్ 9న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండులో జరిగే సీపీఐ, సీపీఎం సంయుక్త బహిరంగ సభ ఎలాంటి సందేశం ఇవ్వబోతోంది?

BRSతో పొత్తు, సీట్ల పంపకాలే కీలకం

తెలంగాణలో ఆ రెండు ఎర్రజెండాలు భుజంభుజం కలిపాయి! సిద్ధాంతాలు రాద్ధాంతాలు పక్కన పెట్టి, వామపక్షాల ఐక్యత అనే పాత నినాదానికి బూజు దులిపారు. ఒక అవగాహనతో కలిసి పనిచేయాని సీపీఎం, సీపీఐ నిర్ణయించుకున్నాయి! బీజేపీకి వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయంలో గులాబీ జెండాకు ఇద్దరు కామ్రెడ్లు జై కొట్టారు. అ క్రమంలోనే మునుగోడులో బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చింది సీపీఎం. అధికార BRSతో పొత్తు, సీట్ల పంపకాలే ఈ నిర్ణయంలో కీలకంగా మారబోతున్నాయి! ఏప్రిల్ 9న ఎగ్జిబిషన్ గ్రౌండులో జరగబోయే వామపక్షాల సంయుక్త బహిరంగసభ కేడర్‌కు ఒక సందేశం ఇవ్వబోతోంది! ఈ మేరకు ఇరు పార్టీలు జాయింట్ ప్రెస్ మీట్ పెట్టాయి.

తెలంగాణలో బీజేపీని ఎదగనీయం- తమ్మినేని 
తెలంగాణలో బీజేపీకి స్థానం లేదన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. బీజేపీ దుస్సాహాసానికి పాల్పడుతోందని విమర్శించారు. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే దేశం విఛ్ఛినమవుతుందన్నారు. తెలంగాణో బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. అధికారపార్టీతో పొత్తు విషయంలో సీట్ల అంశమూ కీలకమే అన్నారాయన. రాహుల్ గాంధీపై అనర్హతవేటు పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందన్నారు. సీబీఐని బాగా పొగిడిన మోదీ ..గతంలో ఇదే సీబీఐని కాంగ్రెస్ జేబు సంస్థ అని విమర్శించింది మర్చిపోయారని తమ్మినేని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా పోరాడుదామని షర్మి తనతో మాట్లాడారనీ.. కానీ బీజేపీ వైఫల్యాల గురించి షర్మిల  మాట్లాడలేదని చెప్పుకొచ్చారు.  ఎప్రిల్ 9న ఎగ్జిబిషన్ గ్రౌండులో సీపీఐ, సీపీఎంల సంయుక్త బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభకు రెండు పార్టీల జాతీయ నేతలు, రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి నేతలు హాజరవుతారని తమ్మినేని వెల్లడించారు.

మోదీది ఫాసిస్టు పాలన- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని 
బీజేపీ తన ఎదుగుదల కోసం సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. రాహుల్ గాంధీ ఎంపీ అనర్హత అంశం చర్చకు రాకుండా ప్రధాని తనస్థాయి మరిచి బీసీలను విమర్శిస్తున్నారని అన్నారు. మోదీ తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు. ప్రధాని చదువు గురించి అడిగితే రూ. 25 వేల జరిమానా విధించడం ఏంటని అన్నారు. మోదీలను ప్రశ్నిస్తే అనర్హత వేటు, రెండేళ్ళ జైలు శిక్ష విధిస్తుంటే దేశం ఎటుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్కిస్ బానో కేసులో దోషులకు బీజేపీ నేతలు సాదర స్వాగతం పలికారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేతల పై వేధింపులు ఎక్కువ అయ్యాయని ఆరోపించారు. మోదీది ఫాసిస్టు పరిపాలన అన్నారాయన. మోదీ విధానాలే ప్రతిపక్షాలను ఓక్కటి చేస్తున్నాయని కూనంనేని పేర్కొన్నారు.

Published at : 04 Apr 2023 03:58 PM (IST) Tags: CPI BRS Telangana CPM Kunamneni thammineni

సంబంధిత కథనాలు

Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు లీగల్ నోటీసులు, రూ.1000 కోట్ల పరువునష్టం దావా

Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు లీగల్ నోటీసులు, రూ.1000 కోట్ల పరువునష్టం దావా

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్

Warangal CP: హోంగార్డుకు వరంగల్ సీపీ సత్కారం, అతను చేసిన పనికి సీపీ ఫిదా!

Warangal CP: హోంగార్డుకు వరంగల్ సీపీ సత్కారం, అతను చేసిన పనికి సీపీ ఫిదా!

టాప్ స్టోరీస్

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు'  - జక్కన్న ట్వీట్ వైరల్!

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా

లవ్ బూత్‌లో మెహ్రీన్ - హలో హనీ హార్ట్ మిస్సాయే అంటున్న ఫ్యాన్స్!

లవ్ బూత్‌లో మెహ్రీన్ - హలో హనీ హార్ట్ మిస్సాయే అంటున్న ఫ్యాన్స్!