అన్వేషించండి

Kalvakuntla Kavita Bail Petition : కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సోమవారం తీర్పు - రౌస్ అవెన్యూ కోర్టులో సుదీర్ఘ వాదనలు

Telangana News : కవితకు మధ్యంతర బెయిల్ వస్తుందా రాదా అన్నది సోమవారం స్పష్టత రానుంది. వాదనల తర్వాత కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

Delhi court reserves verdict on BRS leader K Kavitha's interim bail plea :  ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పు సోమవారం రానుంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సుదీర్ఘంగా ఈడీ, కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. పూర్తి వాదనల తర్వాత తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లుగా జడ్జి తెలిపారు. సోమవారం తీర్పు వెలువరిస్తామన్నరు. 

కోర్టులో సుదీర్ఘ వాదనలు  

 కుమారుడి పరీక్షల కారణంగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని దాఖలైన రెండో పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది.  కవిత తరపున కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.  కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, అందుకే బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు.  పరీక్షల సమయంలో పిల్లలకు తల్లి మోరల్ సపోర్ట్ ఉండాలని అన్నారు. ప్రధాని మోదీ చాలా సందర్భాల్లో పిల్లల పరీక్షల సన్నద్ధతపై లెక్చర్ ఇచ్చారని ప్రస్తావించారు.  తల్లి అరెస్ట్ తనయుడిపై ప్రభావం ఉంటుందన్నారు. తండ్రి ఉన్నాడు కానీ న్యాయ పోరాటంలో ఉన్నాడని తెలిపారు. కవిత కొడుకు భయాందోళన చెందుతున్నాడని, అతనికి తన తల్లి సపోర్ట్‌ అవసరమని చెప్పారు. కవిత ఒక మహిళగా, ప్రజా ప్రతినిధిగా బెయిల్‌ పొందవచ్చని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ మేరకు ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ జడ్జిమెంట్‌ను కూడా అభిషేక్‌ సింఘ్వీ కోర్టుకు చూపించారు. 

కవిత బెయిల్ ను తీవ్రంగా వ్యతిరేకించిన ఈడీ 
  
కవితకు బెయిల్‌ ఇవ్వొదని ఈడీ కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. కవిత లిక్కర్ కేసులో కీలకంగా ఉన్నారని.. ఇండో స్పిరిట్ ద్వారా వ్యాపారంలో భాగస్వామ్యమయ్యారని తెలిపింది. కవిత తన ఫోన్లలో డేటాను ఫార్మాట్ చేశారని ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాతే డేటా ఫార్మాట్‌ చేశారని కోర్టుకు తెలిపింది.  డిజిటల్ ఆధారాలు లేకుండా చేశారని పేర్కొంది. ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని ఈడీ ఆరోపిస్తుంది. ఈ కేసులో మరికొంతమందిని ప్రశ్నిస్తున్నామని.. ఈ సమయంలో బెయిల్‌ ఇవ్వొద్దని కోర్టుకు వాదించింది. 
 
మార్చి 15వ తేదీన కవిత అరెస్ట్  

లిక్కర్‌ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈడీ అరెస్ట్‌ చేసింది.  మార్చి 16న ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. ఈడీ 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరగా, ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఆ తర్వాత మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. మూడురోజులకే అనుమతించింది. కస్టడీ ముగియడంతో కవితను మార్చి 26వ తేదీన ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఆపై కోర్టు కవితకు ఏప్రిల్‌ 9వ తేదీ వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించడంతో ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్నారు. 

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్ లభించడంతో కవితకు కూడా మధ్యంతర బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆశిస్తున్నారు.  అయితే బెయిల్ ను ఈడీ తీవ్రంగా వ్యతిరికించడంతో కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ ఏర్పడింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Karnataka:  సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం  - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
Consumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam
Consumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav on Rohit Sharma Fitness | నాలుగేళ్లలో నాలుసార్లు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ కి తీసుకువెళ్లాడు | ABP DesamMinister Atchannaidu Special Bike | కార్లు తిరగలేని చోట కూడా తిరగాలని అచ్చెన్న బైక్ ను ఇలా మార్చేశారు | ABP DesamSVSC Re Release Fans Craze | శ్రీకాంత్ అడ్డాల కల నిజమైంది..SVSC రీరిలీజ్ కు బ్రహ్మరథం | ABP DesamConsumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Karnataka:  సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం  - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
Consumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam
Consumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam
TGPSC: టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
Tesla: ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
Sitara Ghattamaneni: మహేష్ ఇంటికి కొత్తగా వచ్చిన బుజ్జి కుక్క పిల్ల... పరిచయం చేసిన సూపర్ స్టార్ ముద్దుల కూతురు సితార
మహేష్ ఇంటికి కొత్తగా వచ్చిన బుజ్జి కుక్క పిల్ల... పరిచయం చేసిన సూపర్ స్టార్ ముద్దుల కూతురు సితార
Telangana Latest News: వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి- రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?
వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి - రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?
Embed widget