Nirmala Sitharaman : తాంత్రికుడు చెప్పడంతో మహిళలకు మంత్రి వర్గంలో నో ఛాన్స్, టీఆర్ఎస్ పై నిర్మలా సీతారామన్ ఫైర్
Nirmala Sitharaman : టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణకు రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు చేసి ప్రజలపై భారం మోపారని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు.
Nirmala Sitharaman : బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. తెలంగాణకు ఏంచేయలేకపోయిన కేసీఆర్ దేశానికి ఏంచేస్తారని ప్రశ్నించారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన నిర్మలా సీతారామన్ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణ సెంటిమెంట్‌తో పుట్టిన టీఆర్ఎస్ రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చి ప్రజలపై భారం మోపిందని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ పుట్టుకొచ్చిన టీఆర్ఎస్ వాటిని అమలుచేయలేదన్నారు. 2014 నుంచి 2018 వరకు మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదని విమర్శించారు. ప్రతిపక్షాలు ప్రశ్నించడంతో మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించారన్నారు.
Tantrik told KCR that women Ministers will bring bad luck, so he didn't appoint them in Cabinet
— BJP Telangana (@BJP4Telangana) October 8, 2022
- Union Minister @nsitharaman
This is Shameful and disrespect towards all Women #KCRPracticesBlackMagic pic.twitter.com/xvqZXC98vw
మంత్రాలు, తంత్రాలంటూ
ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. టీఆర్ఎస్ హయాంలో రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారని, కానీ చుక్కనీరు కూడా రాలేదన్నారు. నియామకాలు అంటూ గెలిచిన టీఆర్ఎస్ ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయట్లేదని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను మంత్రివర్గంలో పెట్టుకుంటే మంచిది కాదని తాంత్రికుడు చెప్పడంతో మహిళలకు అవకాశం కల్పించలేదని ఆరోపించారు. మంత్రాలు, తంత్రాలు అంటూ కేసీఆర్ సచివాలయానికి వెళ్లడంలేదని ఆరోపించారు. తెలంగాణను మర్చిపోతున్న టీఆర్ఎస్ కు దేశానికి ఏం చేస్తుందని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు.
బండి సంజయ్ ఆరోపణలు
సీఎం కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. తాంత్రికుడి సలహా మేరకే టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చారన్నారు. తాంత్రికుడి సూచనతోనే సచివాలయానికి వెళ్లడం లేదని, ఫాంహౌజ్ లో నిత్యం నల్ల పిల్లితో క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం తనకు ఓ స్వామిజీ తెలిపారని కేసీఆర్ చేస్తోన్న పనులు, వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ విషయం చెబుతున్నానన్నారు. స్వామిజీలు, వేద పండితులతోపాటు సమాజ హితం కోరే వాళ్లంతా కేసీఆర్ క్షుద్ర పూజల నుంచి తెలంగాణను కాపాడాలని వేడుకుంటున్నట్లు తెలిపారు.
Also Read : Bandi Sanjay : ఫాంహౌజ్ లో కేసీఆర్ క్షుద్ర పూజలు, బండి సంజయ్ సంచలన ఆరోపణలు
Also Read : బండి సంజయ్ తాంత్రిక పూజల విమర్శపై కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్