అన్వేషించండి

Kishan Reddy : కేసీఆర్ ఫిరాయింపుల గ్రేట్ మాస్టర్, ఆ స్వామీజీ ఎవరో తెలియదు- కిషన్ రెడ్డి

Kishan Reddy : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంతా ఓ డ్రామా అని కిషన్ రెడ్డి అన్నారు. రూ.100 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొనాల్సిన ఖర్మ తమకు లేదన్నారు.

Kishan Reddy : తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రోజు రోజుకూ ముదురుతోంది. ఈ ఘటనపై టీఆర్ఎస్ నేతలు స్పందించడం లేదు. కానీ బీజేపీ నేతలు వరుసగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెయినాబాద్ ఫాంహౌస్ ఘటనపై స్పందించారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన... కొనుగోలు వ్యవహారం ఏ పార్టీ కుట్రో తెలియాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫాంహౌస్ పట్టుబడిన స్వామీజీ ఎవరో తమకు తెలియదన్నారు. హుజురాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోవడంతో... మునుగోడు  ఎన్నికల్లో గెలవాలనే టీఆర్ఎస్ డ్రామా ఆడుతోందని ఆరోపించారు. కేసు పెట్టాలాంటే కేసీఆర్ కుటుంబం‌పై పెట్టాలన్నారు. ఎవరినైనా జైలుకు పంపాలంటే ముందుగా కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపాలన్నారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ పాలనను గద్దెదించుతామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 

ఫిరాయింపులను ప్రోత్సహించేదే కేసీఆర్ 

తెలంగాణలో బీజేపీకి వస్తున్న ఆదరణ టీఆర్ఎస్ కు భయం పట్టుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆ భయంతోనే టీఆర్ఎస్ డ్రామాలకు తెరలేపిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ లో  చేరిన వారితో రాజీనామాలు చేయించకుండా మంత్రి పదవులు కట్టబెట్టి వారిని కొనసాగించిన చరిత్ర సీఎం కేసీఆర్‌దేనని విమర్శించారు. కేసీఆర్ ఫిరాయింపుల గ్రేట్‌ మాస్టర్‌ అని ఆరోపించారు.  ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో ముందు రూ.100 కోట్లు అన్నారని, ఇప్పుడు రూ.15 కోట్లు అంటున్నారన్నారు. అసలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేది కేసీఆర్ అన్నారు. బీజేపీలో చేరడమంటే రాజ్యాంగ విరుద్ధమైనట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ఉన్న స్వామీజీ, ఇతర వ్యక్తులు ఎవరో తెలియదన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ నేతృత్వంలో బీజేపీ చేరికల కమిటీ పనిచేస్తుందన్నారు. బీజేపీలో ఎవరైనా చేరాలంటే తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే నేర్చుకోవాలనే నియమం ఉందన్నారు.  

ఆ కర్మ మాకు లేదు 

టీఆర్ఎస్ ఓ డ్రామా సృష్టించి ప్రజలను మభ్యపెట్టాలని చూశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అవసరం లేదన్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే ఏం లాభమని ప్రశ్నించారు. వారి వల్ల కేసీఆర్‌ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదుకదా అన్నారు. వాళ్లు చేరితే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందా? అని ప్రశ్నించారు. రూ.100 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన కర్మ తమకు లేదన్నారు. ఈ వ్యవహారం అంతా కల్పితమని కొట్టిపారేశారు. కేసీఆర్ కుటుంబంపైనే ముందు కేసులు పెట్టి జైలుకు పంపాలని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలి ఆయన డిమాండ్ చేశారు. మునుగోడు ఎన్నికకు ముందు ఏదో డ్రామా చేసి గెలవాలని టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని  కిషన్‌రెడ్డి ఆరోపించారు. 

Also Read : ఎమ్మెల్యేల కొనుగోలు వివాదం: ఫాం హౌస్‌కు అందుకే వెళ్లాం - నిందితుడు నంద కుమార్ కీలక వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Embed widget