Cyberabad Traffic Police: అప్పుడు కూడా లేన్ డిసిప్లిన్ పాటించరా? - కల్కీ 2898ఏడీపై పోలీసులు ఆశ్చర్యం!, సెటైరికల్ ట్వీట్
Telangana News: సైబరాబాద్ పోలీసులు 'కల్కి 2898AD' సినిమాలోని 'బుజ్జి' వాహనం ట్రెండ్ వాడుకుంటూ వాహనదారులకు అవగాహన కల్పించారు. లేన్ డిసిప్లీన్ పాటించాలంటూ ట్వీట్ చేశారు.
![Cyberabad Traffic Police: అప్పుడు కూడా లేన్ డిసిప్లిన్ పాటించరా? - కల్కీ 2898ఏడీపై పోలీసులు ఆశ్చర్యం!, సెటైరికల్ ట్వీట్ cyberabad traffic police awareness with kalki bujji vehicle through satirical twitter latest updates Cyberabad Traffic Police: అప్పుడు కూడా లేన్ డిసిప్లిన్ పాటించరా? - కల్కీ 2898ఏడీపై పోలీసులు ఆశ్చర్యం!, సెటైరికల్ ట్వీట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/eb81690631655374248b9aa1df99bcfa1720270494085876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Cyberabad Traffic Police Awareness: ట్రాఫిక్ నిబంధనలపై సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) వాహనదారులకు ఎప్పటికప్పుడు వినూత్నంగా అవగాహన కల్పిస్తుంటారు. రాష్ట్రంతో పాటు దేశంలో జరిగిన చిన్న చిన్న ఘటనలను ఉదాహరణగా తీసుకుంటూ ట్విట్టర్ ద్వారా ప్రజలను అలర్ట్ చేస్తుంటారు. తాజాగా, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898AD' సినిమాలోని బుజ్జి వాహనం ఎంత క్రేజ్ సంపాదించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా క్రేజ్‌తో సైబరాబాద్ పోలీసులు వాహనదారులకు డిఫరెంట్‌గా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సినిమాలోని బుజ్జి వాహనం తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సెటైరికల్ ట్వీట్ చేశారు. రోడ్డుపై వెళ్తున్న బుజ్జి వాహనం ఫోటో షేర్ చేస్తూ.. 'బుజ్జికార్ రెండు లేన్స్‌లో వెళ్తుంది అంటే 2898 ADలో కూడా లేన్ డిసిప్లిన్ పాటించడం లేదా?' అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. 'రేపటి కోసం లేన్ డిసిప్లిన్ పాటించండి' అంటూ వాహనదారులకు సూచిస్తూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
లేన్ డిసిప్లిన్ పాటించండి. రేపటి కోసం...#RoadSafety #Kalki28989AD #Prabhas
— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) July 6, 2024
Issued in the public interest to raise awareness pic.twitter.com/HrY1qfBqKW
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)