OLA EV Showroom: ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
Telangana News: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఓ కస్టమర్ వినూత్నంగా నిరసన తెలిపారు. బైక్ సర్వీసింగ్‌కు ఇచ్చి రోజులు గడుస్తున్నా ఇంతవరకూ ఇవ్వడం లేదని ఓలా ఈవీ షోరూంకు చెప్పుల దండ వేశారు.
Customer Innovative Protest Infront Of OLA Showroom In Ramachandrapuram: ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్న ఓ కస్టమర్ బైక్ సర్వీస్ కోసం రోజుల తరబడి షోరూం చుట్టూ తిరిగారు. అయినా షోరూం సిబ్బంది నుంచి సరైన స్పందన లేదు. ఇక విసిగి వేసారిన ఆయన.. వినూత్నంగా షోరూంకు చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో (Sangareddy District) వైరల్‌గా మారింది. సదరు వినియోగదారుడు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రాపురం (Ramachandrapuram) ఓలా ఈవో షోరూంలో ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నారు. బ్యాటరీ రేంజ్ పడిపోవడంతో కొద్ది రోజుల క్రితం తన వాహనాన్ని షోరూంలో ఇచ్చారు. అయితే, బైక్ సర్వీస్ కోసం సిబ్బంది నెలల తరబడి తిప్పించుకుంటున్నారని మండిపడ్డారు. నెల రోజులు గడిచినా షోరూం నుంచి ఎలాంటి స్పందన లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ ఫోన్ చేసి వాహనం గురించి అడిగినా సిబ్బంది మాత్రం కాల్స్‌కు స్పందించడం లేదని తెలిపారు. శుక్రవారం షోరూం వద్దకు వచ్చి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వారు స్పందించకపోవడంతో వినూత్నంగా నిరసన తెలిపాడు. తనతో పాటు తెచ్చిన చెప్పులదండను షోరూంకు వేశాడు. దీన్ని చూసిన సిబ్బంది, స్థానికులు షాక్ అయ్యారు.
కస్టమర్ స్ట్రాంగ్ వార్నింగ్
'ఓలా ఈవీ షోరాంలో కొద్ది రోజుల క్రితం బైక్ తీసుకున్నాను. బ్యాటరీ రేంజ్ పడిపోవడంతో షోరూంలో సర్వీసింగ్‌కు ఇచ్చాను. అయితే నెల రోజులైనా షోరూం సిబ్బంది స్పందించడం లేదు. కాల్ చేసినా ఎవరూ స్పందించడం లేదు. రోజూ షోరూంకు వచ్చి వెళ్తున్నాను. అందుకే చెప్పుల దండతో వినూత్నంగా నిరసన తెలిపాను. ఇంత జరుగుతున్నా బైక్ గురించి యాజమాన్యం ఎలాంటి వివరాలు ఇవ్వడం లేదు. ఇప్పటికైనా నా బైక్ సర్వీసింగ్ చేసి తిరిగి ఇవ్వాలి. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.' అంటూ సదరు కస్టమర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Also Read: Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్