Bollaram: రేపే హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, నేడు రాష్ట్రపతి భవన్‌ను పరిశీలించనున్న సీఎస్
ఈ నెల 26 నుంచి ఐదు రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో విడిది చేయనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. రాష్ట్రపతిగా పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆమె రాష్ట్రానికి వస్తున్నారు.
నేడు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ ను పరిశీలించనున్న సీఎస్, ఇతర అధికారులు
ఈ నెల 26 నుంచి ఐదు రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో విడిది చేయనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. రాష్ట్రపతిగా పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆమె రాష్ట్రానికి వస్తున్నారు. రేపు సాయంత్రం 4.15 నిమిషాలకు రాష్ట్రపతి హైదరాబాద్ రానున్నారు. గవర్నర్, ముఖ్యమంత్రి తో సహా అధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలకనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. నేడు ఏర్పాట్లను మరోసారి అధికారులు పరిశీలించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షాలు విధించనున్నారు.
హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు. ఎలా వచ్చాయో ఈ డ్రగ్స్ నేడు విచారణ.
హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టుచేశారు పోలీసులు. న్యూఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ సరఫరా చెన్నై కేంద్రంగా అంతర్జాతీయ డ్రగ్స్ దందా కొనసాగుతోంది. రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్కోటిక్, నార్త్‌జోన్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వీరి వద్ద మరింత సమచారాం రాబట్టేందుకు పోలీసులు విచారిస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది, దీనికి సూత్రదారులు ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. నేడు నిందితుల్ని పోలీసులు మరోసారి విచారించనున్నారు.
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం..గుండెపోటుతో సీనియర్ నటుడు చలపతి రావు కన్నుమూత..నేడు ఫిల్మ్ నగర్ లోనే అభిమానుల సందర్శనార్థం భౌతికకాయం.
టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మృతిని టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు చలపతిరావు (78) కన్నుమూశారు. తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మృతిని మరువక ముందే మరో సీనియర్ నటుడు మృతి చెందడంతో ఇండస్ట్రీలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఆడపిల్లలు అమెరికాలో ఉంటారు. వాళ్లు ఇండియా వచ్చినప్పుడు పిల్లలందరితో కలిసి బల్లిపర్రు వెళుతుంటారు. ఎన్నో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరిస్తోన్న సీనియర్ నటుడు చలపతిరావును సినిమా వాళ్లు బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. మహానటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో కలిసి పనిచేసిన దిగ్గజ నటుడు చలపతిరావు. ఇండస్ట్రీలో మంచి పేరున్న చలపతిరావు ఇమేజ్ రెండేళ్ల క్రితం మసకబారింది.
పన్నెండు వందల పైగా సినిమాల్లో పలు విభిన్న పాత్రల్లో నటించారు. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు. నాన్న మణియ్య. అమ్మ వియ్యమ్మ, 1944 మే 8న పుట్టిన చలపతిరావుకి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు..కుమారుడు రవిబాబు టాలీవుడ్ నటుడు, దర్శకుడు. ఈ రోజు మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం భౌతిక కాయాన్ని చలపతిరావు నివాసంలోనే ఉంచుతారు. ఆ తర్వాత పార్థీవ దేహాన్ని మహాప్రస్థానానికి తరలిస్తారు. అమెరికాలో ఉన్న చలపతిరావు కుమార్తె బుధవారం హైదరాబాద్ రానున్నారు.
346 ఇంటర్ కళాశాలలకు అగ్నిమాపక ఎన్‌ఓసీ మినహాయింపు
రాష్ట్రంలో దాదాపు 346 ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు రెండేళ్లపాటు అగ్నిమాపక శాఖ అనుమతి లేకున్నా ఇంటర్‌బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు పొందేలా ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా తాజాగా జీఓ 72 జారీ చేశారు. గృహ, వాణిజ్య సముదాయాల్లో కొనసాగుతున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలలను మిక్స్‌డ్ ఆక్యుపెన్సీగా పిలుస్తారు. అలాంటి వాటికి అగ్నిమాపక శాఖ ఎన్‌ఓసీ లేకుంటే ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు(అఫిలియేషన్) ఇవ్వదు. కరోనా కారణంగా 2020-21, 2021-22 విద్యాసంవత్సరాలకు అగ్నిమాపక శాఖ మినహాయింపు ఇచ్చింది. మరో రెండేళ్లపాటూ ఇవ్వాలని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యాల సంఘం ప్రభుత్వానికి విన్నవించింది. దీనిపై నవంబరు 11న జరిగిన ఇంటర్‌బోర్డు పాలకమండలి ఆమోదం తెలిపింది. దస్త్రం 15 రోజుల క్రితమే సీఎంఓకు వెళ్లింది. ఈ సంవత్సరంతో పాటు వచ్చే ఏడాది(2023-24)కీ మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వు విడుదల చేయడంతో యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు మహమూద్ అలీ, సబిత, అధికారులకు కళాశాల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీష్ కృతజ్ఞతలు తెలిపారు.