By: ABP Desam | Updated at : 30 Dec 2021 09:43 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
పిల్లలపై నిర్వహించిన కొవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ ప్రకటించింది. దేశంలోని పలు ఆసుపత్రుల్లో భారత్ బయోటెక్ ట్రయల్స్ నిర్వహించింది. 2 నుంచి 18 ఏళ్ల వారిపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో కొవాగ్జిన్ ఉత్తమ ఫలితాలను కనబరిచిందని పేర్కొంది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ రెండో దశ, మూడో దశ ప్రయోగాల్లో ఉత్తమ ఫలితాలను కనబరిచినట్లు భారత్ బయోటెక్ సంస్థ తెలిపింది.
కొవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న పిల్లల్లో.. 1.7 రెట్లు యాంటీబాడీలు వృద్ధి చెందాయని భారత్ బయోటెక్ ప్రకటించింది. ఎలాంటి దుష్పరిణామాలు చూపలేదని చెప్పింది. టీకా వేసుకున్న వారిలో.. రోగనిరోధక శక్తి పెరుగుతున్న విషయం ఈ ప్రయోగాల్లో రుజువైందని చెప్పింది.
చిన్నారులకు టీకా ఇచ్చేందుకు ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో భారత్ బయోటెక్ పిల్లలపై కొవాగ్జిన్ ప్రయోగాలను జరిపింది. మొత్తం 525 మంది వాలంటీర్లను మూడు విభాగాలుగా విభజించి ప్రయోగాలు చేసింది. 12 నుంచి 18 ఏళ్లు, 6 నుంచి 12 ఏళ్లు, 2 నుంచి 6 ఏళ్ల మధ్య మూడు గ్రూపులుగా విభజించి ట్రయల్స్ చేపట్టారు. అందరిలోనూ రెండో డోస్ ఇచ్చిన నాలుగు వారాల తర్వాత యాంటీ బాడీలు ఉత్పత్తి అయినట్టు భారత్ బయోటెక్ ప్రకటించింది.
Immunogenicity and safety of an inactivated SARS-CoV-2 vaccine (BBV152) in children from 2 to 18 years of age: an open-label, age-de-escalation phase 2/3 studyhttps://t.co/9uSjIsWplS#covaxin #covaxinapproval #childrensafety #covid #COVID19 #covid19vaccine #BharatBiotech pic.twitter.com/5PTvY3gThe
— BharatBiotech (@BharatBiotech) December 30, 2021
'పిల్లలపై కొవాగ్జిన్ టీకా జరిపిన ప్రయోగ ఫలితాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. చిన్నారులకు టీకా సురక్షితం, రోగనిరోధకశక్తి పెంచుతుందనే నిరూపితమైంది. ఈ విషయాన్నీ పంచుకోవడం సంతోషంగా ఉంది. పెద్దవారితోపాటు చిన్నారులకు కూడా సురక్షిత, సమర్థమైన టీకాను అభివృద్ధి చేసే లక్ష్యాన్ని సాధించాం. 2- 18 ఏళ్ల వయసు పిల్లల కోసం ప్రపంచవ్యాప్తంగా తయారైన ఏకైక టీకా కొవాగ్జిన్ కావటం సంతోషకరం.' అని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా చెప్పారు.
ఇటీవలే.. భారత్ బయోటెక్ కొవిడ్ టీకా కొవాగ్జిన్.. పిల్లల కోసం అత్యవసర వినియోగానికి డీసీజీఐ(భారత ఔషధ నియంత్రణ మండలి) అనుమతినిచ్చింది. అధికారిక వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. 12 నుంచి 18 ఏళ్లలోపు వారికి భారత్ బయోటెక్ కొవిడ్ టీకాను త్వరలో వేయనున్నారు. పిల్లలకు ఇండియాలో మొదటి టీకా కొవాగ్జిన్ అవనుంది. అంతకుముందు భారత్ బయోటెక్.. 2 నుంచి 18 ఏళ్ల వారికి.. వ్యాక్సినేషన్ కోసం క్లినికల్ ట్రయల్స్ డేటాను..సెంట్రల్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కి సమర్పించింది.
Also Read: Omicron Updates: తెలంగాణలో కొత్తగా 5 ఒమిక్రాన్ కేసులు... కొత్తగా 280 కరోనా కేసులు, ఒకరు మృతి
BRS News : కారును పోలిన గుర్తులు ఎవరికీ కేటాయించవద్దు - ఈసీని కోరిన బీఆర్ఎస్ !
Mallareddy on Congress: మల్కాజిగిరిలో మామ అల్లుళ్ల భారీ ప్రదర్శన - కాంగ్రెస్‌కి సినిమా చూపిస్తామన్న మల్లారెడ్డి
PM Modi: మోదీ తెలంగాణ టూర్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు
Telangana Group 1 : గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు ఖాయం - ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు !
Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌కు పోలీసుల నుంచి నోటీసులు
Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో
Ram Skanda Movie : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?
TS TET 2023 Results: తెలంగాణ 'టెట్' ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు
/body>