అన్వేషించండి

Palamuru Rangareddy Lift Irrigation: 50 శాతం కూడా ఖర్చు చేయకుండా 90 శాతం పనులెలా పూర్తి చేశారు - పాలమూరు ప్రాజెక్టులపై రేవంత్ కీలక వ్యాఖ్యలు

Revanth Reddy Slams KCR BRS: పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వివరాలు వెల్లడించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో నిధుల దుర్వినియోగం, కమీషన్ల దందాపై గణాంకాలతో పాలమూరులో వివరించారు.

CM Revanth Reddy Palamuru Projects:  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పురోగతి , గత ప్రభుత్వ వైఫల్యాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జిల్లా ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడమే లక్ష్యంగా తాము కంకణం కట్టుకున్నామని స్పష్టం చేస్తూ, ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తోన్న విమర్శలను గణాంకాలతో సహా తిప్పికొట్టారు.
   
 పదేళ్ల కేసీఆర్ పాలనలో నిధుల దుర్వినియోగం 

తెలంగాణ వస్తే పాలమూరు ప్రాజెక్టులు పూర్తవుతాయని ప్రజలు ఆశించారని, కానీ గత పదేళ్ల కేసీఆర్ పాలనలో జిల్లాకు ఘోర అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల కోసం మొత్తం రూ. 1 లక్ష 81 వేల కోట్లు ఖర్చు పెడితే, అందులో అక్షరాలా లక్ష కోట్లు కేవలం ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే తగలేశారని మండిపడ్డారు. అత్యంత కీలకమైన, జిల్లాకు జీవనాడి లాంటి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. 

 కమీషన్ల కోసమే పంపులు, లిఫ్టులు.. భూసేకరణ సున్నా 

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా 90 టీఎంసీల నీటిని అందించే అవకాశం ఉందని, జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులతో పాటు దీనిని పూర్తి చేసి ఉంటే జిల్లాలో 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని రేవంత్ రెడ్డి వివరించారు. పదేళ్లలో కేసీఆర్ ఈ ప్రాజెక్టుపై రూ. 27 వేల కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ, ఆ ధనమంతా కేవలం పంపులు, లిఫ్టుల కాంట్రాక్టుల బిల్లుల రూపంలో కమీషన్లు కొల్లగొట్టడానికే సరిపోయిందని ఆరోపించారు. ఏ ప్రాజెక్టుకైనా ముందస్తుగా కావాల్సిన భూసేకరణను అసలు పూర్తి చేయకుండానే ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని కేసీఆర్ భావించారని ప్రశ్నించారు. ఒక్క ఎకరాకు కూడా నీరివ్వకుండా ఎక్కడిదక్కడే వదిలేసి వెళ్లారని, దీనిపై నాగం జనార్దన్ రెడ్డి ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారని గుర్తుచేశారు.  

 అప్పుల భారం - 30 నెలల్లో కాంగ్రెస్ సాధించింది ఇదే 

గత పదేళ్లలో కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల పేరుతో రూ. 84,503 కోట్ల భారీ అప్పును మిగిల్చారని సీఎం వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన ఈ 30 నెలల కాలంలోనే ఆ అప్పుల కింద రూ. 52,120 కోట్లు కట్టాల్సి వచ్చిందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనప్పటికీ, ఎంతో ఓపికతో తాము 30 నెలల్లో కాంట్రాక్టర్లకు రూ. 22 వేల కోట్లు చెల్లించామని, అందులో రూ. 8 వేల కోట్లు కేవలం పాలమూరు ప్రాజెక్టుల కోసమే ఖర్చు పెట్టామని గణాంకాలను సభ ముందుంచారు. పాలమూరు కోసం తాము ఎంతగా కట్టుబడి ఉన్నామో చెప్పడానికి ఈ నిధులే నిదర్శనమన్నారు.

 బీఆర్ఎస్ 90 శాతం అబద్ధాలు - ఆ సైన్స్ నాకు అర్థం కాదు 

పాలమూరు ప్రాజెక్టులు 90 శాతం పూర్తయ్యాయంటూ బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్ధాలు చెపుతున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రాజెక్టు అంచనా వ్యయంలో 50 శాతం కూడా ఖర్చు చేయకుండా 90 శాతం పనులు ఎలా పూర్తవుతాయో ఆ సైన్స్, మ్యాథ్స్ తనకు అర్థం కావడం లేదంటూ ఎద్దేవా చేశారు.  నేనేం కేసీఆర్ లాగా 80 వేల పుస్తకాలు చదవలేదు  అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉన్నదంతా దోచుకుపోయి, ఇప్పుడు తాము ప్రాజెక్టులను ఒక కొలిక్కి తెస్తుంటే, ప్రజల్లో తమను దోషులుగా చూపేందుకు బీఆర్ఎస్ రాజకీయ డ్రామాలు ఆడుతోందని, కానీ ప్రజలు అమాయకులు కారని, వారికి అంతా తెలుసని అన్నారు.

 రెండేళ్లలో పూర్తి చేస్తాం - సహకరించండి 

ప్రజలు ఛీదరించుకుంటున్నా సోయి లేకుండా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ నేతలు, తిన్నది అరిగేలా పాదయాత్రలు చేసే బదులు కాశీ వరకు నడిస్తే వారి పాపాలు కొన్నికైనా పోతాయని హితవు పలికారు. ఇప్పటికీ ప్రాజెక్టుల కోసం ఇంకా 4 వేల ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉందని, రాబోయే రెండేళ్లలో జిల్లాలోని ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలని తాము కంకణం కట్టుకున్నామని సీఎం స్పష్టం చేశారు. ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికే తాను స్వయంగా జిల్లాలో పర్యటిస్తున్నానని, భూసేకరణకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ ఈ పనులు పూర్తి కావని, అలా వదిలేస్తే చరిత్ర మనల్ని క్షమించదని రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. చివరగా, జిల్లా బీఆర్ఎస్ నేతలు మాకు ఎలాంటి సాయం చేయనక్కర్లేదు.. ఈ రాబోయే రెండేళ్లు నోరు మూసుకుని ఏమీ మాట్లాడకుండా ఉండటమే వాళ్ళు మాకు చేసే అతిపెద్ద సాయం అని రేవంత్ విజ్ఞప్తిచేశారు.  

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
KBR Park Elevated Corridors: కేబీఆర్‌ పార్కు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్.. బాలకృష్ణ సహా ప్రముఖుల స్థలాలు సేకరణ
కేబీఆర్‌ పార్కు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్.. బాలకృష్ణ సహా ప్రముఖుల స్థలాలు సేకరణ
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Hyderabad PRT: హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Vijayawada Road Accident: విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
Windies Duo Penalised: విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Embed widget