Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నుంచి సమన్లు, విచారణకు రావాలని ఆదేశాలు
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. సిద్దిపేట సభలో మార్ఫింగ్ చేసిన అమిత్ షా వీడియో ఒకటి వైరల్ కావడంపై విచారణకు ఆదేశించింది.
Amit Shah Viral Video: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పోలీసులు సమన్లు ఇచ్చారు. సోమవారం (ఏప్రిల్ 29) హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు వచ్చి కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జికి, రేవంత్ రెడ్డికి సమన్లు అందించారు. సీఆర్పీసీ 91 ప్రకారం ఢిల్లీలో పోలీసులు ఈ నోటీసులు ఇచ్చినట్ల తెలిసింది.
అమిత్ షాకు చెందిన ఓ ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ విభాగం ఆ వీడియోను బాగా వైరల్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అమిత్ షా సిద్దిపేట సభలో వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపిస్తున్నారు. రిజర్వేషన్లు తొలగిస్తాం అన్నట్లుగా వీడియోను రూపొందించారు. ఈ వ్యవహారంపై కేంద్ర హెంమంత్రిత్వ శాఖ సీరియస్ అయి విచారణకు ఆదేశించినట్లు సమాచారం. అందులో భాగంగానే ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డికి సమన్లు ఇచ్చారు. మే 1న విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్లు తెలిసింది.